❓ ప్రశ్న: టీవీ5 (TV5) లో జరిగిన ‘హైందవ క్రైస్తవం’ గ్రంథం మీద చర్చ విషయంలో ఆరు పాయింట్లను తీసుకొని మూడు పాయింట్లు చర్చించారు. ఇంకా మూడు పాయింట్లు చర్చించలేదు. అసలు ఏం జరిగింది అనే విషయము చాలా మంది లోపల ఉండిపోయినటువంటి ప్రశ్న. మలివిడత చర్చలు ఎందుకు జరగడం లేదు? (1:13:42)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 14s)
- 📜 చర్చాంశాలు: నేను అనుకుంటున్నా ఈ ప్రశ్న మిమ్మల్ని ఎవరు అడిగారు గానీ, వారు ఆ సంఘటనల క్రమాన్ని ఫాలో (Follow) అవ్వలేదు. క్లియర్ గా నెట్ లో కూడా కొన్ని మేము అప్లోడ్ చేశాము. నా సమాధానం లెటర్స్ వాళ్ళు పంపారు, వాళ్ళు పంపి నేను క్లియర్ గా చెప్పాను. ఆ ఆరు పాయింట్లు చర్చనీయాంశములు అని ఆరు నిర్ణయించారు, అందులో మూడు అయిపోయినాయి. మూడు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ మలివిడత చర్చలు ఉంటాయా ఉండవా అనేది అయితే కొన్ని షరతులకు లోబడి కండిషనల్ గా (Conditional) ఉండే అవకాశం ఉంది. అవి ఎప్పటికీ జరగకపోయే అవకాశం కూడా ఉండదు.
- ⚖️ ఆ రోజు ఏం జరిగింది?: ఏ కండిషన్ లో జరుగుతాయి ఏ కండిషన్ లో జరగవో ఇప్పుడు నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఏంటంటే ఆ సంభాషణ ఆ రోజు సాయంత్రం ఐదు అయింది. రిటైర్డ్ న్యాయమూర్తులు దానికి వారు న్యాయ నిర్ణేతలుగా వచ్చారు. వారు అన్నారు – “ఐదు దాటి ఇన్ని గంటలు కూర్చోవడం మాకు అలవాటు లేదు మా సర్వీస్ లోనే లేదు, మరొక రోజు పెడదాం లేండి దీన్ని ఇంతటితో ముగించేద్దాం” అన్నారు జడ్జిలు. సరే అని అన్నాం. ఆ సమయంలో మళ్ళీ డేట్ ఎప్పుడు, మరి ఎప్పుడు డేట్ ఇప్పుడు ప్రకటించండి అని జడ్జిలు అడిగారు.
- 🏛️ చిన్నజీయర్ స్వామి గారి వ్యాఖ్యలు: అప్పుడు చిన్నజీయర్ స్వామి గారు అన్నారు ఏంటంటే – “చర్చ జరిగిన ఆ విధానము మేము గమనిస్తూ ఉన్నాము. ఇదే విధంగా చర్చ అంటూ జరిగితే మళ్ళీ కూర్చోవడం అనవసరము, వ్యర్థము, వృధా కాలయాపన. ఇలా జరిగితే తీర్చేది ఏమీ లేదు. అసలు ప్రమాణము అనేది అక్షరాలా ఉండాలని అడుగుతున్నారు, అలా ఉండదు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం గనుక అక్షరాలుగా ప్రమాణం అడగకూడదు” అని చిన్నజీయర్ స్వామి గారు చెప్పారు. “ఇలాగే జరిగితే మళ్ళీ కూర్చోవడం కూడా మాకు సమయం దండగే” అని. అదే సమయంలో బంగారయ్య శర్మ గారు, నా ప్రతివాది, ఆయన కూడా అన్నారు – “ఇలాగే జరిగితే మళ్ళీ నేను రావడం కూడా వ్యర్థము. మళ్ళీ నేను రావడం వ్యర్థం అండి, ఎందుకంటే ఇలా జరిగితే మరి ఎప్పటికీ విషయం తేలదు, మనం కూర్చోవడం వ్యర్థం” అన్నారు.
- 🔍 సమీక్ష కోరడం: కనుక ప్రతివాది అన్న మాట, చిన్నజీయర్ స్వామి గారు అన్న మాట – వీరిద్దరూ ప్రధానంగా గౌరవనీయమైన వ్యక్తులు, విషయం మీద పట్టున్న వాళ్ళు. గనుక నేను అన్నాను ఏంటంటే – ఈ రెండు మాటలు ఇద్దరు ఈ గురుపాదులు ఎందుకు అన్నారు? చర్చ ఇదే పద్ధతిలో జరిగితే వృధా కాలయాపన, మళ్ళీ మేము రావడం కూడా వృధాయే అని చిన్నజీయర్ స్వామి గారు ఎందుకు అన్నారు? ఇలాగే చర్చ జరిగితే ఫలితం శూన్యం, నేను మళ్ళీ రావడం కూడా వేస్టేనని బంగారయ్య శర్మ గారు ఎందుకు అన్నారు? మరి ఒకవేళ వాళ్ళు రావడం వ్యర్థం కాకుండా ఉండాలంటే చర్చ ఎలా జరగాలి? అనే ప్రశ్న నేను అడిగాను.
- 🧱 ముగింపు: గనుక ఈ ప్రశ్న చాలా సీరియస్. టైమ్ వేస్ట్ అయినా సరే కూర్చుందాం అనడం మూర్ఖత్వం. ఎలా జరిగితే టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుందో చర్చించుకోవడానికి సమీక్ష (Review) కోసం కూర్చుందామని నేను అన్నాను. అయితే సమీక్ష అంటూ జరిగితే ఇక అవతలి వాళ్ళకి మిగతా మూడు పాయింట్లు నిరూపించుకోవడానికి అవకాశం ఉండదని వాళ్ళకి బాగా తెలుసు. అందుకని సమీక్ష లేదు ఏమీ లేదు, మనం అట్లాగే ఆ పాత ముందు రాసుకున్న పద్ధతుల ప్రకారమే మాట్లాడుకోవాలి అంటున్నారు. అది కూడా రాతపూర్వకంగా అందరూ సంతకాలు చేశారు – చిన్నజీయర్ స్వామి గారు, పరిపూర్ణానంద స్వామి గారు, బుట్టా సురేంద్ర బాబు గారు అందరూ సంతకాలు చేశారు. మరి మీరే ఒప్పుకున్న పద్ధతి కదా, గురుపాదులు ఇలాగ అన్నారు, సమీక్ష కూడా అవకాశం ఉండాలని మీరే అన్నారు రండయ్యా అని అంటే రావడం లేదు. ఎందుకంటే ఆ చర్చ ముగింపులో నేను ఒక ప్రశ్న అడిగాను – “వేదాలలో ఉన్న లక్షణాలు యేసుప్రభువులో ఉన్నాయని నేను చెప్తున్నాను, అది యేసు కాదని మీరు అంటున్నారు. యేసు కాకపోతే ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు 33 కోట్ల మంది భారతీయ దేవతలు ఎవరున్నారో నాకు చెప్పండి? మీరు చెప్పలేకపోతే యేసు అని ఎందుకు అనుకోకూడదో చెప్పండి?” ఈ ప్రశ్నకు సమాధానమే వాళ్ళు చెప్పలేకపోయారు. అందుచేత సమీక్షకు ఒప్పుకోలేదు. సమీక్ష జరిగితేనే తప్ప మళ్ళీ ఈ చర్చ ముందుకు సాగదు అని నేను భీష్మించాను.
Detailed English Translation:
❓ Question: Regarding the ‘Haindava Kraistavam’ debate on TV5, only three out of six points were discussed. Why haven’t the remaining three points been addressed? Why is the second round of discussion not taking place?
- The Standoff: The debate ended prematurely on the first day due to time constraints noted by the retired judges acting as moderators. However, the reason it hasn’t resumed is due to a fundamental disagreement on the methodology of the debate.
- Objections from Religious Leaders: During the session, Chinna Jeeyar Swamy and the respondent, Bangarayya Sharma, both remarked that continuing the debate in its current format was a “waste of time.” They argued that demanding literal scriptural proofs for matters of faith was not the right approach.
- Call for Review: I took their comments seriously. If these learned men feel the current format is futile, then we must sit down for a ‘Review Meeting’ to determine a more productive way to discuss the remaining points. It would be foolish to spend crores of rupees and the time of busy individuals on a format that leads nowhere.
- The Unanswered Question: At the end of the first round, I posed a crucial challenge: “I have shown that the characteristics of the Supreme Being mentioned in the Vedas are fulfilled in Jesus. If you say it is not Jesus, then tell me which of the 33 crore Indian deities fulfills these specific Vedic traits. If you cannot name anyone else, why shouldn’t we accept it is Jesus?”
- Methodological Deadlock: Because they couldn’t answer this, they are now reluctant to attend a review meeting. They want to stick to the old rules, whereas I insist that we first address why the elders called the process ‘futile.’ Unless a proper review is held to ensure a meaningful conclusion, the debate cannot proceed. I stand firm on the need for a logical and result-oriented review.
