121.Q: Why did Jesus Ask to Buy a Sword? (Luke 22:36) (KSM 121)

❓ ప్రశ్న: లూకా 22:36 లో ‘కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి కత్తి కొనుక్కోవాలి’ అని యేసుప్రభువు చెప్పిన మాట వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? (0:06:39)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి

దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 30s)

  • ⚔️ సమర్పణ మరియు సామర్థ్యం: దీనికి ఇంతకుముందు కూడా చెప్పానమ్మా. మంచిది సిస్టర్ గారు నేను చెప్తాను సమాధానం అందరూ ఆలకించండి. యేసుప్రభువు వారు ఒకచోటనేమో “కత్తి పట్టుకొను వారందరూ కత్తి చేతనే నశించెదరు.. పేతురు నీ కత్తి నీ ఒరిలో పెట్టుము” అన్నాడు. ఆ తర్వాత “ఇక నుండి కత్తి లేనివాడు బట్టను అమ్మి కత్తి కొనుక్కోవాలి” అన్నాడు.
  • 🛡️ నిజమైన క్షమాపణ: అంటే ఈ రెండిటికీ సమన్వయం చెబుతూ చాలాసార్లు చాలా సంవత్సరాల క్రితం నేను చెప్పాను. విషయం ఏంటంటే.. క్రైస్తవుని దగ్గర ఒకనికి హాని చేయగలిగిన శక్తి ఉండాలి కానీ దాన్ని ఉపయోగించకూడదు. అతడే సంపూర్ణ క్రైస్తవుడు. ఇప్పుడు శత్రువును క్షమించమన్నాడు.. క్షమించమని అంటే అర్థం ఏమిటి? వానికి తిరిగి ప్రతి కీడు చేసి, మళ్ళీ దాడి చేసి వాడిని గాయపరిచే శక్తి ఉన్నోడు క్షమిస్తే అది క్షమాపణ అవుతుంది. కానీ వాడిని ఏం చేయలేనోడు, చేతకాక “క్షమించాను పోరా” అంటే జనం నవ్విపోతారు కదా!
  • ఆత్మీయ బలం మరియు క్రమశిక్షణ: ఎవడైనా మనకు హాని చేసినప్పుడు పగ తీర్చుకునే బలము, శక్తి, ధైర్యము, సత్తా మనకు ఉండాలి. మనకు వాడిని శిక్షించగల శక్తి ఉంటే కూడా దాన్ని ఉపయోగించకుండా దేవుని ఆజ్ఞకు విధేయులమై.. “నా దగ్గర కత్తి ఉన్నదిరా కానీ నీ మీద ఉపయోగించను, ఉపయోగించవద్దు అన్నాడు నా ప్రభువు” అనాలి. గనుక కత్తి ఎలాగో వాడము కదా మనకెందుకు అనేది కాదు.
  • 💪 క్రైస్తవుల సర్వతోముఖాభివృద్ధి: కత్తి అంటే కత్తి అనే కాదు, ఆయుధం అనే కాదు. కత్తి అంటే అర్థం ఏంటంటే.. మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక ఆయుధము, సామర్థ్యము, ఎదుటి వాళ్ళని కూడా తలుచుకుంటే ఏమైనా చేయగలిగినంత శక్తి సామర్థ్యాలు ఇవి క్రైస్తవులకు ఉండాలి. క్రైస్తవులు బలవంతులుగా ఉండాలంటే అర్థం ఏమిటంటే.. శారీరక ఆరోగ్య విషయంలో బలంగా ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, సామాజికంగా బలంగా ఉండాలి. అన్ని బలమైన స్థానాల్లో క్రైస్తవులు ఉండాలి. మనం తలుచుకుంటే అవతల వాడిని ఏమైనా చేయగలం కానీ యేసయ్య నామాన్ని బట్టి క్షమిస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు మనలో క్రీస్తుని చూడగలుగుతారు. అదమ్మ.

Detailed English Translation:

❓ Question: What was Jesus’ intention behind asking His disciples to sell their garments and buy a sword in Luke 22:36? (0:06:39)

  • Strength vs. Use of Force: Apostle Ranjith Ophir explains that Jesus previously told Peter to put his sword away, stating that those who take the sword perish by it. However, later He commanded them to buy one. The balance is that a Christian should possess the power to harm but choose not to use it.
  • The Essence of Forgiveness: True forgiveness exists only when you have the capacity to take revenge but choose to forgive instead. If a weak person says “I forgive you” simply because they can’t do anything else, it carries no weight. A Christian must be strong and capable, yet restrained by God’s command.
  • Comprehensive Strength: The ‘sword’ symbolizes self-defense, capability, and influence. Christians should strive to be strong physically, financially, and socially. When strong people choose to forgive rather than retaliate, they effectively reflect the character of Christ to the world.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram