❓ ప్రశ్న: లూకా సువార్త 16వ అధ్యాయంలో – ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండెనని యేసు ప్రభువు చెప్తారు కదా అయ్యగారు, అదే అన్యాయస్తుడు. ఆ “అన్యాయపు సిరి” అంటే ఏమిటి? అన్యాయస్తుడిని యజమానుడు ఎలా మెచ్చుకున్నాడు? అన్యాయం చేయడం వల్ల స్నేహితులను ఎలా సంపాదించుకోమన్నాడు? (1:21:01)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (9m 14s)
- 🧠 యుక్తిని మెచ్చుకున్నాడు: మొట్టమొదటి విషయము – వాడు అన్యాయమే చేశాడు, అవినీతిలో దొరికిపోయాడు. దొరికిపోయాడు, వాడి ఉద్యోగం ఊడిపోతుంది. ఆ ఉద్యోగం ఊడిపోతుంది అనే ప్రమాదం వచ్చినప్పుడు – “నా ఉద్యోగం పోయిన తర్వాత మరి నా పరిస్థితి ఏంటి? నన్ను ఎవడైనా ఊరిలో దగ్గరికి రానివ్వాలి కదా, మంచినీళ్లు అయినా ఇవ్వాలి కదా!” గనుక నా ఉద్యోగం ఊడిపోయిన తర్వాత నేను నిరాశ్రయుడిగా, నిరాధారుడిగా ఉన్నప్పుడు నాకంటూ ఎవడో ఒకడు స్నేహితుడు, మిత్రధర్మం నెరవేర్చేవాడు రమ్మని మంచినీళ్లు ఇచ్చేవాడు ఉండాలి అని వీడు ముందుచూపుతో వాళ్ళకి ఏదో వాడి చేతనైన ఫేవర్ (Favor), మేలు అనేది చేశాడు. అయితే దీన్ని వీడు చేసిన పని మంచిది అనలేదు ఆ యజమానుడు. వీడు చేసిన పనిని మెచ్చుకోలేదు, యుక్తిగా నడుచుకున్నాడు అన్నాడు అంతే.
- ⚖️ అన్యాయపు ధనం: వాడు చేసింది ఇంతకుముందు చేసింది దొంగతనమే, ఇప్పుడూ అన్యాయమే. యజమాని బొక్కసానికి అప్పుడూ నష్టమే చేశాడు, ఇప్పుడూ నష్టమే చేశాడు. అయితే యజమాని వాడిని మెచ్చుకున్నది ఏంటంటే – “యుక్తిగా నడుచుకున్నావురా! కనీసం ఇంతకుముందటి పద్ధతిలోనైతే ఉద్యోగం ఊడిపోయేది ఎలాగూ ఖాయమే, కానీ ఉద్యోగం వదిలాక నిన్ను ఒకడు ఇంట్లోకి పిలిచి మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి ఊరిలో లేదు. కనీసం స్నేహితులను సంపాదించుకున్నావు” అని వీడు కొంచెం తెలివిగా ఆలోచించాడు అన్నాడు ఆయన. అంతవరకే. వాడు చేసిన పనిని మెచ్చుకోలేదు, ముందుచూపును మెచ్చుకున్నాడు.
- 💰 లోకపు డబ్బు – అన్యాయపు సిరి: ఇకపోతే అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోమని యేసుప్రభువు వారు అనడం గూర్చి – మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనము ఎవడు మీకు వశము చేయును అని యేసుప్రభు వారు అడిగారు. అన్యాయం అనే దానికి వ్యతిరేక పదం న్యాయమైన సిరి కదా? కానీ యేసుప్రభు వారు ఏమన్నారు – అన్యాయపు సిరి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనము మీకు ఎవరు ఇస్తారు? అంటే అర్థం ఏంటి? ఇది ‘అసత్యమైన ధనం’ అన్నమాట. అంటే అన్యాయపు సిరి అని దేన్ని అంటున్నామంటే – ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు అనేదంతా అసలు డబ్బు ఉండడమే అన్యాయము. ఈ డబ్బు అనేది ఉన్నది అనుకుంటున్నాం కానీ వాస్తవానికి లేదు, ఇది ఊరికేనే మాయమైపోతుంది.
- 🌍 మానవ ఎకానమీ: కనుక ఈ లోకపు డబ్బుకంతటికీ కలిపి దేవుడు పెట్టిన పేరు అన్యాయపు ధనము, అసత్యపు ధనము. ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయలు ఇన్ని రూపాయల కిలో అంటాము, బంగారం 40 వేలకు తులం అంటాము. బంగారాన్ని మనం సృష్టించలేదు కదా? మనం ఎవరు రేటు కట్టడానికి? దేవుని సృష్టిని అమ్ముకోకూడదు. “సమస్త భూమి నాదే, భూమిని శాశ్వత విక్రయం చేయొద్దు” అన్నాడు దేవుడు ధర్మశాస్త్రంలో. ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించిన వాటిని మనిషి కబ్జా పెట్టుకొని వీడు అమ్ముకుంటున్నాడు, డబ్బులు చేసుకుంటున్నాడు. అసలు మానవ ఎకానమీ (Economy) మొత్తము, ఈ ఆర్థిక రంగమే అన్యాయం. అందుకే దీన్నంతా కూడా అన్యాయపు సిరి అన్నారు.
- 🤝 నిత్య నివాసాలలో స్నేహితులు: అన్యాయపు సిరి ద్వారా స్నేహితులు సంపాదించుకోవడం అంటే – ఆ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఉద్యోగం ఊడిపోయాక వాడిని కొందరు ఇంట్లో చేర్చుకోవాలి. అలాగే ఈ అసత్యమైన ధనం మనల్ని ఎప్పుడు వదిలిపోతుంది అంటే మన మరణ సమయంలో. ఈ లోకపు డబ్బు మనం ఎన్ని కోట్లు సంపాదించినా అది మనల్ని వదిలేస్తుంది. అప్పుడు నిత్య నివాసములలో వారు చేర్చుకుంటారు అంటాడు ఏసుప్రభువు. నిత్య నివాసములు అంటే ఈ తాత్కాలిక నివాసమైన ఈ లోకాన్ని వదిలేసి మనం వెళ్ళిపోయినప్పుడు, అవతలి లోకంలో ఒకడు వచ్చి పలకరించాలి – “అన్నయ్యా, తమ్ముడూ రా, నీ కొరకు ఎదురుచూస్తున్నాము బాగున్నావా రమ్మని” అని అక్కడ ఒకడు ఎవడో పిలవాలి.
- ✨ ముగింపు: వాడు ఎవడో మనల్ని ఎలా గుర్తుపడతాడు అంటే – ఇక్కడ ఉన్న డబ్బును సువార్త సేవ కొరకు ఉపయోగించాలి. ఇక్కడ మనము మనకు దేవుడు ఇచ్చిన డబ్బును సువార్త కొరకు ఉపయోగిస్తే, ఈ సువార్త విని కొంతమంది రక్షణ పొందితే, వాళ్ళు మనకన్నా ముందు పరదేశికి, పరలోకానికి వెళితే.. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు కొంతమంది వస్తారు – “అన్నయ్యా, మీరు డబ్బులు ఇచ్చి ఒక సేవకుడిని పంపించారు మా ఊరికి, నేను రక్షణ పొందాను” అని చెప్పేవాళ్ళు ఉంటారు. గనుక అన్యాయపు సిరి వలన నిత్య నివాసములలో స్నేహితుని సంపాదించుకో అంటే – ఈ లోకపు డబ్బు వలన సువార్త ప్రకటించి, పరలోకంలో కొందరు నిన్ను స్నేహ ధర్మంగా చేర్చుకునే పరిస్థితి కల్పించుకోమంటాడు. ఇది ఆ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి సందేశం.
Detailed English Translation:
💰 Question: In Luke 16, Jesus tells the parable of the Unjust Steward. What is “Unrighteous Mammon” (Unjust Wealth)? Why did the master praise the dishonest steward, and why did Jesus advise us to make friends using such wealth?
- Praising Shrewdness, Not Dishonesty: The steward was caught in corruption and faced termination. Realizing he would soon be jobless and homeless, he used his remaining authority to cancel portions of the debts owed to his master. He did this so that the debtors would owe him a favor and welcome him after his dismissal. The master did not praise the steward’s theft; he praised his ‘shrewdness’—his ability to plan for his future during a crisis.
- Why Mammon is Called ‘Unrighteous’: Jesus contrasts ‘Unrighteous Mammon’ with ‘True Riches.’ He calls earthly money unrighteous or false because the entire human economic system is fundamentally flawed. Humans put price tags on things God created—like land, gold, and food. God owns the earth, yet man commoditizes it. Furthermore, money is transient and ‘false’ because it vanishes at death.
- Investing in Eternity: Making friends with unrighteous mammon means using earthly, temporary wealth for eternal purposes. When you use your money to support the Gospel, people are saved. When those saved individuals precede you to Heaven, they become your ‘friends’ in the eternal dwellings.
- The Spiritual Lesson: Earthly wealth will eventually fail us—certainly at the moment of death. Jesus teaches us to be as shrewd about our eternal future as the steward was about his earthly future. By investing our money in soul-winning, we ensure that we are welcomed with joy into the eternal habitations by those who reached Heaven because of our support for the Gospel.
