❓ ప్రశ్న: ఆనంద్ గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు – అయ్యగారు, లూకా సువార్తలో ఒకలాగా, మార్కు సువార్తలో ఒకలాగా సందర్భాలు వేరువేరుగా ఉన్నాయి కదా అయ్యగారు! అదొకటి. మూడవదిగా, బైబిల్ గ్రంథంలో మనకి వంశావళులు తేడా ఉన్నాయి కదా అయ్యగారు! ఇవి మూడు డౌట్లు అంటే నన్ను కొంతమంది అడిగారు, నాకు చెప్పడం కోసం తెలియలేదు. ఇవి వివరించండి. (1:29:52)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 40s)
- 📰 వార్తాపత్రికల ఉదాహరణ: వంశావళుల విషయం, తర్వాత ఈ సువార్తల్లో ఒక్కొక్క చోట ఒక్కో రకంగా తేడాగా ఉండటం అని చెప్పారు. దాని గురించి కూడా క్లుప్తంగా సమాధానం చెప్తాను. ఇప్పుడు ఒక చోట యాక్సిడెంట్ అయింది అని ఒక పత్రిక రాసింది. ఇంకో పత్రిక ‘మారుతీ కారు యాక్సిడెంట్ అయింది’ అని రాసింది. ఇంకో పత్రిక ‘ఎర్ర రంగు కారు యాక్సిడెంట్ అయింది’ అని రాసింది. ఇంకో పత్రిక ‘కారు వెళ్లి మర్రి చెట్టును గుద్దింది’ అని రాసింది.
- 🔍 కోణాల వ్యత్యాసం: ఈ నాలుగు ఒక్క సంఘటనే. యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే – ఒక ఎర్ర రంగు మారుతీ కారు మర్రి చెట్టును గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. ఇంకో ఐదవ పత్రిక రాసింది – ‘డ్రైవర్ తప్పతాగి డ్రైవ్ చేసినందుకు యాక్సిడెంట్ అయింది’ అని. అంటే ఒకటే సంఘటనను ఒకరు రాసిన వివరాలు ఇంకొకరు రాయకుండా, ఒకరు వదిలేసిన వివరాలు ఇంకొకరు రాసి వార్తాపత్రికల్లో కథనాలు ఎలాగ వేరువేరుగా వస్తున్నాయో, అలాగే ఈ నలుగురు సువార్తికులు ఒకే సంఘటనను వేరువేరు కోణాల్లో రాశారు.
- 📜 వంశావళుల మర్మం: మత్తయి సువార్తలో ఉన్న వంశావళి యేసుప్రభువును ‘రాజు’గా చూపిస్తుంది, కనుక అది యోసేపు వంశావళిని (లీగల్ లైన్) ఇస్తుంది. లూకా సువార్తలో ఉన్న వంశావళి ఆయన ‘నరుడు’ అని చూపిస్తుంది గనుక, అది మరియమ్మ వంశావళిని (బయోలాజికల్ లైన్) ఇస్తుంది. అందుకే పేర్లు వేరుగా ఉంటాయి తప్ప అవి తప్పులు కావు. యేసుప్రభువుకు ఇద్దరు తాతలు ఉన్నట్టు లెక్క – ఒకరు చట్టపరంగా, ఒకరు రక్తసంబంధ రీత్యా.
- ✨ ముగింపు: గనుక కోణాలను బట్టి వివరాలు మారతాయి తప్ప సత్యం మారదు. వంశావళులు కూడా ఒకరు అబ్రహాము దగ్గర మొదలుపెడితే, ఇంకొకరు ఆదాము దగ్గర మొదలుపెట్టారు. కాబట్టి వీటిని వైరుధ్యాలుగా చూడకూడదు, ఒకదానికొకటి పూరకాలుగా (Complementary) చూడాలి.
Detailed English Translation:
📜 Question: Why are there differences in the genealogies of Jesus and why do some narratives vary between the four Gospels (Matthew, Mark, Luke, and John)?
- Perspective of the Authors: Think of four different newspapers reporting on the same car accident. One might focus on the car’s brand, another on its color, the third on the location (like hitting a tree), and the fourth on the driver’s condition. All four are reporting the same truth, but their details differ based on their specific focus.
- The Four Gospels: Similarly, the four Gospel writers wrote with four distinct objectives. Matthew presented Jesus as the ‘King of the Jews,’ Mark as the ‘Sufferring Servant,’ Luke as the ‘Perfect Man,’ and John as the ‘Son of God.’ Naturally, the details they highlight align with these specific themes.
- The Genealogies of Joseph and Mary: The primary reason for the two different genealogies is that Matthew provides the legal lineage through Joseph (the kingly line of Solomon), while Luke provides the biological lineage through Mary (the line of Nathan). Mary’s line proves Jesus is humanly descended from David, while Joseph’s line gives Him the legal right to the throne of David.
- Complementary, Not Contradictory: These are not contradictions but complementary records. One trace back to Abraham to show His Jewish roots, and the other traces back to Adam to show His connection to all of humanity. Together, they provide a complete picture of who Jesus Christ is.
