16.Q: Models in Politics and Social Justice (KSM 02) 👤

👤 ప్రశ్న: సర్, అదేవిధంగా ఇప్పుడు మీరు రాజకీయంలోనికి ప్రవేశించారు. రాజకీయంలో మీరు ఎవరిని మోడల్ గా తీసుకున్నారు? అసలు ఎందుకు మీరు రాజకీయాల్లోనికి రావాలనుకున్నారు? (0:08:53)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (6m 05s)

  • 👤 మోడల్ గా ఒకరిని తీసుకొని రావడం అనేది జరగలేదు మార్కు బాబు గారు. ఇదొక పౌరునిగా నా విధి నా బాధ్యత అని నా మనస్సాక్షి నాకు చెప్పినందుకు రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే అసలు అసలు నాకు అర్థమైనటువంటి విషయం నా అవగాహన ఏంటంటే రాజకీయము అనేదానికి నేను చెప్పుకున్న నిర్వచనం చాలా సింపుల్ నిర్వచనం. మా ఇంట్లో కుళాయిలో నీళ్లు రావడం లేదు ఓకే అని నేను ఒక అర్జీ పెట్టుకుంటే అది నా స్వార్థము నా స్వప్రయోజనం. ఓకే మా కాలనీలో 10వేల ఇళ్లకు కూడా నీళ్లు రావడం లేదని అందరి సంతకాలు సేకరించి, హ్మ్ అందరి పక్షంగా ఒక ప్రతినిధిగా వెళ్లి అధికారి గారికి చెప్పుకొని వారిని పిలిచి సమస్య చర్చించి పరిష్కారం కొరకు నేను పని చేస్తే అది రాజకీయం.
  • ⚖️ సో ఇది రాజకీయం అని ఎందుకు అంటారంటే ఇలాగ అందరి ప్రయోజనాలను పట్టించుకునే వారిని ప్రజలు మెచ్చుకొని ప్రశంసించి, ఇట్లాంటి వాడు మా పక్షంగా ఆలోచించేవాడు చట్టసభల్లో ఉంటే మాకు మేలు జరుగుతుందని ప్రజా ప్రతినిధిగా అతన్ని చట్టసభలకు పంపిస్తారు. మ్ కనుక నేనైతే మరి సామాజిక స్పృహ కలిగిన వాడిని. ఆ సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. అవును సార్. అన్నిటికంటే దారుణమైనది తట్టుకోలేనటువంటి విషయం మహిళల మీద జరుగుతున్న అత్యాచారం. అవును సార్. అయితే ఒక తొమ్మిది నెలల పసికందు మీద కూడా అట్లాంటి దుష్కృత్యము జరగడం, దుష్కార్యము, అక్రమము, అత్యాచారము అది దాన్ని ఏమనా అసలు ఏ భాషకు అందనటువంటి నికృష్ట కార్యం అది. అవును సార్. ఊహ కూడా సాధ్యం కావడం లేదు వాడికి ఐడియా ఎలా వచ్చింది? ఆ పసిమొగ్గ అసలు పరిపూర్ణమైన స్త్రీ శరీరమే కాదు, ఎలా చేద్దాం అనుకున్నాడు? ఆ చిన్నారి అసలు వీడు అత్యాచారం చేసి చంపేసాడు అనేది తప్పు, వీడు అటెంప్ట్ చేస్తున్నప్పుడే పసిపాణం వెళ్ళిపోయింది. అంతే కదా ఇంకా అవును. అటెంప్ట్ చేస్తున్నప్పుడే విపరీతమైన బ్లీడింగ్ పోయి ప్రాణం వదిలేసుకుంది. అవును అంత ఘోరం ఇప్పుడు సమాజంలో ఎక్కువైపోయింది.
  • 🛡️ ఇప్పుడు హర్యానా పోలీసు రికార్డు ప్రకారము ప్రతి నెల మూడు నాలుగు మూడు నాలుగు మూడు నాలుగు సామూహిక మానభంగాలు, గ్యాంగ్ రేప్స్ అవుతాయి అక్కడ. ఒక్క రేపిస్ట్ కు శిక్ష పడదు. అవును సార్ అవును. రేపిస్ట్లు అరెస్ట్ కావడం లేదు, అరెస్ట్ అయితే గనుక మళ్ళా బెయిల్ మీద విడుదల అవుతారు. ఆడవాళ్ళకు మాత్రం భద్రత లేదు. ఇది ఒకటి. రెండవది మతం పేరు మీద హత్యలు జరగడం, మతం పేరు మీద అత్యాచారాలు జరగడం, మతం పేరు మీద ఒకరినొకరు ద్వేషించుకోమని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు నేర్పించటం. మ్ సమాజమంతా కలుషితం అయిపోతా ఉన్నది ఇదొకటి. నాకు నన్ను స్పందింపచేసిన బాధ కలిగించిన మూడో విషయం కుల వివక్ష సార్. కులం పేరు మీద ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. మరి అంటే అది ఒక మచ్చుతునక మాత్రమే అది ఒకటే కాదు. ఆ తర్వాత మళ్ళీ ఇటు ఈస్ట్ గోదావరిలో ఆ రెండు మామిడి కాయలు తిన్నాడని చెప్పి అతన్ని దళితుణ్ని పంచాయతీ ఆఫీస్ లోనే ఉరితీసి చంపేసారు. చంపేసారు ఇక ఇటువంటివి ఒకటి అలా కాదు ఎన్నో జరుగుతున్నాయి. నిరంతరం జరుగుతాయ్ న్యూస్ లోకి రానివి కూడా చాలా ఉండొచ్చు. రానివి ఎన్నో ఉన్నాయి వచ్చేవి సగానికి సగం కూడా రావు.
  • 📢 గనుక ఈ కులం పేరు మీద ఆ విద్వేషం అనేది పెరిగిపోతుంది. మన దేశ రాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి హిజ్ ఎక్సలెన్సీ రామ్ నాథ్ కోవింద్ జీ వారు కూడా ఆంధ్రాలో ఆ బ్రహ్మ దేవాలయానికి వెళ్తే స్టెప్స్ మీద కూర్చోబెట్టి అవును బయట కూర్చోబెట్టి ఏదేదో పూజ చేసి పంపించారు. అవును గనుక దళితులను చాలా దారుణంగా అవమానిస్తున్నారు. గనుక మరి ఆ విధంగా మన చింతమనేని ప్రభాకర్ గారు – దళితులు మీకెందుకు? అవును చాలా హృదయం గాయపడతా ఉంది. ఒక దళితుడు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా మనం పరిపాలన చేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలకు పూలమాల వేస్తూ, తాడి చెట్టు మీద విగ్రహాలు పెడుతున్నాం చెప్పుకుంటూ – దళితులు మీకెందుకురా అని నా కొడుకులారా అనే మాట కూడా మాట్లాడడం ఎంత బాధకరం. మరి దీని గురించి పోరాటం చేయాలా? మహిళల మీద ఏదైనా అత్యాచారం జరిగితే, కులం పేరు మీద హత్య అత్యాచారం జరిగితే, మతం పేరు మీద ఏమైనా జరిగితే ఒక ఇండివిడ్యువల్ గా నేను ప్రశ్నిస్తే దానికి విలువ ఉండదు. మ్ ఒక రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్, లైసెన్స్డ్ రాజకీయ పార్టీగా నేను ప్రశ్నిస్తే అది చట్టసభల్లో గాని బయట గాని ఒక రాజకీయ పార్టీగా – మహిళలను ఎందుకు ఇలా చేస్తున్నారు? కులాన్ని ఎందుకు ఇలాగ మీరు ఒక వివక్షగా ఉపయోగించుకుంటున్నారు? కుల వివక్ష ఎందుకు పోషిస్తున్నారు? ఎందుకు పెంచుతున్నారు? అని అడగడానికి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, సభ్యుడిగా అయితే ఆ వేదికకు ఉండే పవర్ వేరు. అవును సార్. అందుచేత రాజకీయ పార్టీ పెట్టాము. రేపు పొద్దున మేము చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అవుతామని కాదు ఆశ, కావాలని కూడా కాదు. ఉన్నవాళ్ళు సరిగ్గా వెళ్తే చాలు మాకు అవసరం లేదు. ఓకే కానీ ఇలాంటి బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు మేము స్వరమెత్తి ఘోషించడానికి, ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఒక గౌరవ వేదిక రాజకీయ పార్టీ. అందుకొరకు మేము పార్టీ పెట్టాం. ఓకే సార్.

Detailed English Translation:

👤 Question: Who is your role model in politics? And why did you feel the need to enter politics and establish a political party?

  • Defining Politics as Service: I didn’t enter politics by choosing a specific role model. It was a decision guided by my conscience and my duty as a citizen. My definition of politics is simple: seeking a solution for one’s own problem is selfishness, but representing the collective problems of the community (like a water crisis affecting 10,000 homes) to the authorities is politics. People elect such representatives to the legislature believing they will fight for the common good.
  • Responding to Social Atrocities: As someone with social consciousness, I am deeply pained by the injustices in our society. The brutal rape and murder of a nine-month-old infant is a crime so heinous that words fail to describe it. Such depravity is becoming common, with gang rapes reported frequently and culprits often escaping justice through bail.
  • Fighting Caste and Religious Hate: I am also driven by the need to fight religious hatred and caste discrimination. Incidents like the honor killing of Pranay or the lynching of a Dalit man over a trivial matter like mangoes are just the tip of the iceberg. Even the President of India was once subjected to discriminatory treatment at a temple. When leaders openly insult Dalits, it is a direct blow to the Constitution written by Dr. B.R. Ambedkar.
  • The Necessity of a Political Platform: If I question these atrocities as an individual, my voice has limited reach. However, as the founder of a recognized and registered political party, my questions carry legal and legislative weight. We didn’t start the ‘India Praja Bandhu Party’ out of a hunger for the CM or PM post. We established it to serve as a dignified platform to roar against injustice, protect the vulnerable, and hold the powers that be accountable. A political platform is a tool for systemic change.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram