⛪ ప్రశ్న: సంతోషం సార్. బేసిక్ గా మీరు అస్ ఏ క్రిస్టియన్ కదా, క్రైస్తవులు ఎందుకు సార్ మరి రాజకీయాలు అనగానే అదొక బూతు మాట లాగా తీసుకుంటున్నారు? ఆ యువత కానివ్వండి, ఆ అందులో వృద్ధులు కానివ్వండి, అందులో పెద్దవారు మొదలుకొని యూత్ వరకు అందరూ కూడా రాజకీయం అంటే అది మనకొద్దు చీచీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ అభిప్రాయము క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎందుకు వచ్చింది? దీనికి మూలం ఏమంటారు? (0:14:58)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 16s)
- ⛪ ఎందుకు అని అంటే క్రైస్తవ నాయకులే దీనికి కారణం. క్రైస్తవ నాయకులే దీనికి కారణము. ఈ బాధాకరమైన పరిస్థితికి కారణం అనేది నేను మీకు ఇర్మియా గ్రంథములో నుండి ఒక మాట చదివి మీకు వినిపించాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా సార్. ఇర్మియా ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఇలాగ దేవుడు మాట్లాడుతున్నాడు. సార్. “మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరే ఎలా అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్ధము చేయుచున్నది. జ్ఞానులు అవమానమునొందిన వారైరి, వారు విస్మయొంది చిక్కున బడి ఉన్నారు.” మ్ ఇక్కడ జ్ఞానులు, శాస్త్రులు ధర్మశాస్త్రానికి అపార్ధము కల్పించి ఉన్నారని యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు.
- 🐑 క్రైస్తవ సమాజం అంతటిని గలిబిలి చేసి కలవరము, కన్ఫ్యూషన్ కు లోను చేసినటువంటి ఈ నేరము, ఈ నిర్వాహకం ఎవరిది అంటే దేవుని కొరకు ఏదో చేద్దామని ఆసక్తి ఉండి ప్రత్యక్షత లేని బోధకులు సార్. వాళ్ళు వ్యక్తిగతంగా మంచోళ్లే మ్ కానీ ప్రమాణ వాక్యం అనేది వాళ్లకు తెలియదు. అసలు ప్రామాణికంగా బోధ ఏంటి? పౌలు మన స్థానంలో ఉంటే ఏమి ఏం చేసేవాడు, ఎలా మాట్లాడేవాడు అని అంత వైడ్ అండర్స్టాండింగ్ లేనటువంటి బోధకులు ఎక్కువమంది ఉన్నారు. ఓకే. అందుచేత సరైన జ్ఞానము ప్రత్యక్షత లేని బోధకులు ప్రసంగ పీఠిక మీద ఉన్నందుచేత పాపం విశ్వాసులు ఏం చేస్తారు? ఏది చెబితే అది వినాలి, తల వొంచాలి, కానుక వేయాలి, వెళ్ళిపోవాలి, ప్రశ్నించే అవకాశం లేదు. అవును.
- ❤️ అందుచేత రాజకీయాల మీద ఒక విముఖత క్రైస్తవ సమాజంలో ఉండటం బోధకులు తీసుకొచ్చి పెట్టిన డామేజ్ అది. ఓకే. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు యేసయ్య. మరి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తే నీ పొరుగువాడి ఇంట్లో కూడా కుళాయిలో నీళ్లు రాలేదు, నీ పొరుగు ఊరిలో దళితుల మీద దమనకాండ జరిగింది, ఎక్కడో ఒక దళిత యువతి మానభంగం చేయబడింది. అది నా చెల్లెలు అయితే ఎలా ఉంటుంది? ఈ చచ్చిపోయినోడు నా కొడుకైతే ఎలా ఉంటుంది? ఇతరుల బాధలు పట్టించుకుంటే, ఈ బాధలన్నీ మనము కలిపి వీటి పక్షంగా మాట్లాడి స్వరమెత్తి మనం గనక నిలదీసి ప్రశ్నిస్తే అదే రాజకీయం సార్. హ్మ్ ఉమ్.
- ✨ కనుక క్రైస్తవుడు రాజకీయం ఎందుకు చేయాలి అని కాదు, క్రైస్తవుడు చేయవలసిందే రాజకీయం. సరే ఆ పొరుగువాని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరచడమే రాజకీయం సార్. పవర్ పాలిటిక్స్ వేరు ఓకే అధికారం కొరకు అడ్డదారులు దొక్కి ఏ అక్రమమైనా చేస్తాను, అధికార పీఠం కావాలి, వచ్చినాక నేను బాగా డబ్బులు సంపాదించుకోవాలి అని కరప్ట్ పాలిటిక్స్ వేరు. ఓకే పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ కరప్షన్ బట్ దేర్ ఆర్ కరప్ట్ పాలిటిక్స్ అండ్ దేర్ ఆర్ ప్యూర్ క్లీన్ పాలిటిక్స్ ఆల్సో. ఎస్. ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ్ గారు లోక్సత్తా పార్టీ, ఆయనే కాకుండా లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారు కూడా ఉండేవారు ఆయన. ఇటువంటి వాళ్ళందరూ కూడా పోరాడినటువంటి అంశం ఏంటంటే రాజకీయాల్లో ప్రక్షాళన జరగాల. అవును సార్ అవును. సో రాజకీయ సంఘాలు కూడా చెప్తా ఉంటారు. రాజకీయం అనేది ఒక కల్మషం కాదు, దాంట్లో ఉన్న కల్మషాన్ని కడిగేస్తే ప్రపంచానికి మేలు జరుగుతుంది. అవును సార్ అవును. థాంక్యూ.
Detailed English Translation:
⛪ Question: As a Christian, why is politics treated like a taboo or a ‘dirty word’ in the Christian community? From youth to elders, many seem to avoid it. What is the root cause of this mindset?
- The Misinterpretation by Leaders: The unfortunate aversion to politics in the Christian world is primarily due to religious leaders who lack true spiritual revelation. Citing Jeremiah 8:8, God points out that the ‘lying pen of the scribes’ has misinterpreted His laws. Many well-meaning but shortsighted preachers have dominated the pulpits, teaching a distorted version of faith that excludes social and civil responsibility.
- Passive Training: Believers have been groomed to be passive—to just listen, pay tithes, and stay silent like sheep. They were never taught how a man like Apostle Paul would have addressed social issues in today’s context. This lack of wide understanding has caused massive damage, creating a community that is disconnected from the nation’s governance.
- Politics as an Act of Love: Jesus commanded us to love our neighbor as ourselves. If we truly love our neighbor, their problems—whether it’s a lack of drinking water, caste-based atrocities, or the violation of a young woman—become our problems. Standing up for their rights and questioning the authorities on their behalf is the very definition of politics.
- Pure vs. Corrupt Politics: We must distinguish between the ‘dirty politics’ of greed and corruption and ‘clean politics’ of service. Politics itself is not corruption, but there are corrupt practitioners. Like reformers Jayaprakash Narayan or Dr. Jayaprakash Narayan (Lok Satta), we should aim for the ‘cleansing’ of politics. For a Christian, politics is simply expressing love for one’s neighbor through systemic advocacy and justice. It is a duty, not a choice.
