🌊 ప్రశ్న: విజయవాడ నుండి రాధ అనే సహోదరి అడిగిన ప్రశ్న – ఈ ప్రోగ్రాం కి ఇప్పుడు నడుస్తున్న ప్రోగ్రాం కి “క్షీరసాగర మథనం” అని పేరు ఎందుకు పెట్టారు? మీరు క్రైస్తవులుగా, క్రైస్తవ నాయకులుగా మాకు సుపరిచితులు, మరి ఇదేమో హిందువుల పురాణాలకు సంబంధించిన మాట. దీనికి ఆ పేరు పెట్టారు ఏమిటి? అసలు మీరు మీ మతం ఏది అని అడుగుతున్నారు. (0:19:04)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 19s)
- 🌊 సిస్టర్ గారు మంచి ప్రశ్న. సమాధానం నేను తప్పకుండా చెప్తాను అందరూ చిత్తగించాలని మనవి. అసలు హిందూ పురాణాలలో ఉన్నటువంటి అనేక సంగతులు దాదాపుగా సకల సంగతులు కూడా బైబిల్ లో ఉన్న ఏదో ఒక సత్యానికి సంబంధము కలిగి, పోలిక కలిగి ఉన్నది, సాదృశ్యము కలిగి ఉన్నది అనే విషయాన్ని నేను నమ్ముతున్నాను. అసలు బైబిల్ లో కూడా దేవుడు ఏదీ కూడా ఉపమానము లేక ఏదియు వారికి బోధించలేదు, ఉపమాన రీతిగా అన్ని వారికి బోధించాడు అని బైబిల్ లో కూడా రాయబడింది. గనుక ఇప్పుడు ఆ ఉపమానము ద్వారా నేర్పించుట అనే సంప్రదాయంలో భాగంగానే ఇతర మత గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు, అవి కూడా ఉపమానముగా అలంకార భాషలో బైబిల్ లోని సత్యాన్ని అవి నేర్పిస్తున్నాయి. ఆ విధంగా సర్వమత సామరస్యం – ఈ యొక్క కాన్సెప్ట్ మనకు అలవాటు అయిపోతే సర్వమత సామరస్యము, సహజీవనము, సుహృద్భావము, అండర్స్టాండింగ్ (Understanding), రిలీజియస్ హార్మోనీ (Religious harmony) అనేది సాధ్యపడుతుంది అనేది మా ఉద్దేశము ఒక ప్రయోజనం కొరకు. అంతేకాకుండా ప్రయోజనం పక్కన పెడితే వాస్తవంగా కూడా పోలికలు ఉన్నాయి అనేది మా ఉద్దేశం.
- 🏺 ఇప్పుడు ఈ పేరుకు కారణం ఏంటంటే – హిందూ పురాణాలలో అసలు ముందు ఆ దేవతలు, దానవులు (రాక్షసులు అంటే దానవులు) మ్ దేవదేవదానవ సృష్టి జరిగినప్పుడు ఆ పాల సముద్రం అనేదాన్ని చిలికినారు. మంధర పర్వతం అనేదాన్ని కవ్వముగా పెట్టి, మ్ ఆ వాసుకి అనే మహా సర్పాన్ని దానికి తాడుగా పెట్టి, ఆ అటు రాక్షసులు ఇటేమో దేవతలు ఉండి తాడును చిలికినట్టు ఆ కవ్వాన్ని చిలికినట్టుగా చిలికారు. అందులో నుండి లక్ష్మీదేవి వచ్చింది మ్ విష్ణుమూర్తి భార్యగా తీసుకున్నారు మ్ ఐరావతం వచ్చింది దేవతల రాజైన ఇంద్రుడికి ఇచ్చేశారు మ్ అని ఈ విధంగా కొన్ని కొన్ని వచ్చాయి. ఆఖరున అమృత భాండం వచ్చింది. ఆ అమృతం తాగినప్పుడు దేవతలు అమరులు అయినారు. అప్పటిదాకా అమరత్వం లేదు. ఓకే. అయితే రాక్షసులకు మాత్రం అమరత్వం లేకుండా మోసం జరిగింది. ఆ శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి, అనేక తమో గుణాలు (తమో గుణాలు అంటే చీకటి గుణాలు) కలిగిన రాక్షసులకు అమరత్వము, అక్షయత ఉండకూడదు మ్ కాబట్టి అన్ని సత్వగుణ సంపన్నులైనటువంటి మంచి గుణాలు కలిగినటువంటి దేవతలే అక్షయత కలిగి ఉండాలని ఆయనగారు శ్రీ మహావిష్ణువు అమృత భాండాన్ని నేనే అందరికీ వడ్డిస్తానని దేవతల బంతి వేరు, రాక్షసుల పంక్తి వేరుగా కూర్చోబెట్టేసి దేవతలకేమో నిజంగా అమృతం పోశారు మ్ రాక్షసులకేమో అమృతం పోసినట్టు నటిస్తున్నాడు కానీ పోయలేదు మ్ వీళ్ళు ఆమె అందాన్ని చూసేసి.. మహావిష్ణువే స్త్రీ అవతారంలో ఉన్నారు మ్ చాలా చక్కని అతిలోక సౌందర్యవతిగా ఉన్నారు. ఆ అందాన్ని చూసి అందాన్నే జుర్రుకుంటూ వీళ్ళు మైమర్చి, ఎందుకంటే కాముకులు, తమోగుణ భరితులు కదా చీకటి గుణాలు కలిగినవారు కదా, స్త్రీని చూడగానే ఆ వ్యామోహంలో పడి అసలు ఏం తాగుతున్నామో అసలు వాళ్ళకి ధ్యాస లేకుండా మ్ అలా జరిగింది అనేది ఆ కథ.
- 🥛 సరే అది అలా పక్కన పెడితే మ్ ఈ అమృతమును త్రాగిన వారు అమరులు అవుతారు. అమృతం త్రాగిన వారికి అక్షయత వస్తుంది. ఆ అమృతం ఎక్కడ ఉంటుంది అంటే పాల సముద్రాన్ని చిలికితే వస్తుంది. ఓకే. గనుక ఇప్పుడు మరి పాల సముద్రం ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. అవును సార్. నేను నా ఆత్మ నేత్రాలతో దర్శించినటువంటి సత్యము ఏంటంటే మ్ బైబిల్ లో ఉన్నటువంటి పోలికల ప్రకారం దేవుడు బైబిల్ లోని పరిశుద్ధ వాక్యాన్ని ఆయన పాలతో పోల్చాడు. ఓకే. రెండవ పేతురు రెండవ అధ్యాయం ప్రారంభ వచనాల్లో – దేవుని వాక్యమును పాలవలన, నిర్మలమైన వాక్యమును పాలవలన అని రాయబడింది గనుక వాక్యమును పాలతో పోల్చాడు. మరి సముద్రం అంటే చాలా విస్తారమైన పాలు అవును. మరి విస్తారమైన పాలు అది ఎక్కడ ఉంది బైబిల్ లో అంటే – 119వ కీర్తన 96వ వచనంలో మ్ “నీ ధర్మోపదేశము అపరిమితమైనది, సకల సంపూర్ణతకును పరిమితి గలదని నేను గ్రహించి ఉన్నాను”. నీ ధర్మోపదేశం అపరిమితమైనది అని దావీదు భక్తుడు చెబుతాడు. గనుక వాక్యము అనగా పాలు, ధర్మోపదేశం అనగా పాలు, అపరిమిత ధర్మోపదేశము అంటే సముద్రమంతటి పాలు అన్నమాట.
- ✨ ఓకే గనుక ఒకవేళ సముద్రమంతటి పాలుగా లేక పాల సముద్రముగా ఉన్న ఈ బైబిల్ గ్రంథాన్ని మనము చిలికితే ఏమొస్తుంది అంటే నిత్యజీవం వస్తుంది. వాక్య సారాంశాన్ని గ్రహించినప్పుడు మనకు దాంట్లో నుంచి నిత్యజీవం వస్తుంది. ఓకే గనుక ఒక బైబిల్ గ్రంథం అనే కాదు, అసలు ప్రపంచంలో ఉన్నటువంటి సకల ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా మనము సగౌరవంగా పరిశీలన చేయగలిగితే నిత్యజీవానికి ఆధారము, ప్రదాత, మనకు నిత్య అక్షయతను ఇచ్చేవాడైనటువంటి యేసే దొరుకుతాడు. యేసే అమృతం, యేసు నామమే అమృతం, యేసు రక్తము, యేసయ్య కృపే అమృతం. అది అన్ని గ్రంథాలను మనం పాల సముద్రాన్ని చిలికినట్టు చిలికితే దొరికే అమృతమే యేసు. ఓకే యేసును తిని త్రాగి నేను అమరునయ్యాను అనేది నా ఉద్దేశం.
- 🐍 ఇంకొక మాట చెప్పాలి. ఈ పాల సముద్రంలో నుండి అమృతం మాత్రమే రాలేదు, హాలాహలం కూడా వచ్చింది, విషం కూడా వచ్చింది మ్ ఆ హాలాహలం అనే విషము ముల్లోకాలను, బ్రహ్మాండాన్ని కూడా దహించి నాశనం చేసే ఘోరమైన ప్రమాదకరమైన విషం. ఓకే. మరి ఆ విషాన్ని పరమశివుడు మ్రింగేసాడు, అప్పుడు లోకాలు క్షేమంగా ఉన్నాయి అని చెప్తారు. సార్. అది కూడా ఒక ఉపమానమే. మరి సకల లోకాలను భస్మము చేయగలిగిన హాలాహలాన్ని మ్రింగి తన కంఠంలో పెట్టుకొని లోకాలను ఒక ఉనికిని, ఒక సంరక్షణ కల్పించినటువంటి శివుడిని ‘నాద బ్రహ్మము’, ‘నాద శరీరుడు’ అంటాయి హిందూ పురాణ గ్రంథాలు. ఓకే పౌరాణిక సాహిత్యం మ్ నాద శరీరుడు, నాద బ్రహ్మం అనే పేరు శివుడికి ఉంటే బైబిల్ లో అదే పేరు యేసుకు కూడా ఉంది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను – ఆ వాక్యమై ఉన్న దేవుడే యేసు. ఓకే మరి మనుష్య జాతికి నాశనకరమైన పాపాన్ని మ్రింగిన దేవుడు కూడా ఆయనే.
- 🚫 కనుక ఈ పాలసముద్రం అనే కథ చాలా దూరం వెళ్ళిపోతుంది, యేసు దాకా మనల్ని తీసుకొస్తుంది. ఓకే మరి ఈ బైబిల్ అనే పాలసముద్రాన్ని చిలికితే మ్ అమృతమే కాదు కాలకూట విషం, హాలాహలం కూడా వచ్చింది. ఓకే అట్లాగే బైబిల్ లో నుంచే దుర్బోధలు కూడా వస్తున్నాయి సార్. ఆ దేవుడు రాజకీయాలు వద్దు అన్నట్టు, ఇంకా అంతకన్నా ప్రమాదకరమైనవి దేవుడే త్రిత్వమే కాదని, యేసే దేవుడు కాదని, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదని, అసలు పరిశుద్ధాత్మ అక్కర్లేదు పరిశుద్ధాత్మ అంటే ఎలక్ట్రిసిటీ (Electricity) లాగా ఒక పవర్ (Power) అని, ఆ యేసు రెండవ రాకడ లేనే లేదని, వెయ్యేళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతుంది ఇదే వెయ్యేళ్ల పరిపాలన.. ఇదంతా కూడా ఈ బైబిల్ అనే పాల సముద్రంలో నుంచి వచ్చిన కాలకూట విషం. ఓకే అది మింగేశారు కొందరు, ఆ మింగేసి చేశారు మనుషులు మింగారు. కానీ దాని నుండి కూడా మనల్ని దుర్బోధలు అనే కాలకూటము నుండి కూడా రక్షించగలిగిన నాద శరీరుడు యేసుప్రభువు వారు సార్. అది మా కాన్సెప్ట్. ఓకే సార్.
Detailed English Translation:
🌊 Question: Why is this program titled “Ksheera Sagara Madhanam” (Churning of the Milky Ocean), which is a Hindu mythological term? As a Christian leader, why use such a name and what is your religion?
- Promoting Religious Harmony: I believe that many stories in the Hindu Puranas serve as metaphors or parallels for biblical truths. In the Bible, too, God often taught through parables. By finding these common threads in various scriptures, we can foster mutual respect, coexistence, and religious harmony. This program aims to ‘churn’ spiritual knowledge to reveal universal truths.
- The Legend and the Word: According to the myth, the gods and demons churned the Milky Ocean to obtain ‘Amrutham’ (the nectar of immortality). I see a parallel here: the Bible compares the Word of God to pure milk (1 Peter 2:2). Psalm 119:96 describes God’s law as limitless—an ocean of milk. Churning this divine knowledge leads us to Jesus Christ, who is the true Amrutham—the giver of eternal life.
- Symbolism of the Poison (Halahalam): The myth also mentions that a deadly poison emerged before the nectar, which a deity swallowed to save the world, becoming known as ‘Nada Brahma’ (The Sound Manifest). Biblically, Jesus is the ‘Word’ (Logos/Nada) who entered the world to swallow the poison of human sin and save humanity from destruction.
- Beware of False Doctrines: Churning the scriptures also brings forth ‘poison’ in the form of false doctrines—denying the Trinity, the deity of Christ, or the reality of His second coming. Just as the deity in the myth neutralized the poison, Jesus, the living Word, protects us from these spiritual toxins. The concept of this program is to delve deep into the ‘Milky Ocean’ of the Word to find the nectar of Christ while steering clear of the poison of misinterpretation.
