19.Q: What if Adam hadn’t eaten the fruit? (KSM 02) 🍎

🍎 ప్రశ్న: నా ప్రశ్న ఏంటంటే – ఆదాము హవ్వ ఆ పండు తిన్నప్పుడు హవ్వే మోసపరచబడింది కానీ ఆదాము మోసపరచబడలేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉంది కదా! అయితే హవ్వ పండు తిన్నప్పుడు ఆదాము కూడా ఆమెను ప్రేమించి, ఆమెతో పాటే నేను కూడా తింటాను ఆ తర్వాత దేవుడు ఏదో ఒకటి చేస్తాడే అని తాను కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి ఇష్టపడి, ఇష్టపూర్వకంగా హవ్వను ప్రేమించి.. ఒకవేళ ఆదాము దేవునికి లోబడి సంపూర్తిగా హవ్వ మీద అంత ప్రేమ తెచ్చుకోకుండా ఉండి, ఒకవేళ పండు తినకుండా ఉండి ఉంటే హవ్వ నరకానికి వెళ్ళేది, ఆదాము మాత్రము పరలోకంలో ఉండేవాడు. ఒకవేళ అదే గనుక జరిగి ఉంటే.. ఒక రక్షించుకోవడం కూడా ఆయన ఇష్టం లేదన్న మాట ప్రకారం మరి హవ్వ కొరకు ఏ రక్షణ ఇచ్చేవాడు? ఒకవేళ అనుకున్నట్లయితే ఇప్పుడు? (0:29:19)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 34s)

  • 🍎 చాలా మంచి ప్రశ్న అడిగారు, మీ పేరు తెలుసుకోవచ్చా? చాలా సంతోషం మంచిది బ్రదర్ ఆదిత్య. నేను చెప్తాను ఇప్పుడు. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ (Beautiful question) ఇది. చాలా చాలా లోతుగా మీరు గ్రహింపుతో వినవలసినటువంటి విషయము. ఒకవేళ హవ్వ ఒకతే నశించి ఉంటే, ఆదాము ఆమెతో ఏకీభవించకుండా ఉంటే, ఆదాము “నేను ఆ పండు తినను పొమ్మని” నిరాకరిస్తే.. ఆదాముకు దేవుడు ఇంకో హవ్వను చేసి ఇచ్చేవాడే.
  • ⚖️ మరి అప్పుడు హవ్వ సంగతి ఏంటి అంటున్నారు మీరు. అప్పుడు హవ్వ ఒకటే నశిస్తుంటే, ఒక గొర్రె కొరకైనా వెతికి రక్షించడానికి వెళ్లే కాపరి లాగా దేవుడు ఆమె కొరకు కూడా ఏమైనా ప్రణాళిక ఆయన రచించేవాడా? లేకపోతే ఆమెను నరకానికి వదిలేసి ఉండేవాడా? అనేది ప్రశ్న. ఇప్పుడు దానికి జవాబు ఏంటంటే – యేసు ప్రభువు నందు మనకొక రక్షణ ప్రణాళిక సిద్ధపరచబడింది. ఆ రక్షణ ప్రణాళిక ఏంటి? ఆదాము అనే ఒకని అవిధేయత వలన మనందరం పాపులమైనాము. ఒక్కని అతిక్రమము చేత అందరికిని పాపము, మరణము సంప్రాప్తమాయెను అంటాడు పౌలు. గనుక మనకు రక్షణ కూడా మనకు సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనం కష్టపడకుండానే వచ్చింది. “మీరు ఇది క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే.. మీ వల్ల కలిగింది కాదు” అని పదే పదే రెట్టించి చెప్తారు పౌలు భక్తుడు.
  • 🧱 గనుక ఇప్పుడు మనకు మన క్రియల మీద ఆధారపడకుండా రక్షణ ఎందుకు ఇచ్చాడు అంటే – మనకు తెలియకుండానే పాపులమయ్యాం కాబట్టి. కానీ ఈ పాయింటు హవ్వకు వర్తించదు. ఎవరో చేస్తే నేను పాపిని అయ్యాను అనే పాయింట్ ఆమెకు వర్తించదు. గనుక ఆమె కొరకు రక్షణ ప్రణాళిక దేవుడు క్రియల ద్వారానే ఆమెకు ఏర్పాటు చేసేవాడు. ఇప్పుడు ఎట్లాగ అన్యమతాలు ఆలోచిస్తున్నట్టు – “మనం ఇది చేస్తే రక్షణ, అది చేస్తే రక్షణ, నియమ నిష్టలతో ఉంటే రక్షణ” అని ఎలాగ అన్యమతాలు ఆలోచిస్తున్నాయో, అది హవ్వకు అప్పుడు అప్లై (Apply) అయ్యేది.
  • ✨ అప్పుడు అది న్యాయం అవుతుంది. ఇప్పుడు నాకు తెలియకుండా పుట్టుకతోనే నేను పాపినయ్యాను గనుక, నేను శ్రమపడకుండానే నాకు రక్షణ వస్తుంది అనేది ఎలా న్యాయమో.. ఆమె కావాలని తెలిసి తెలిసి ఆజ్ఞకు అవిధేయురాలై తప్పు చేసింది గనుక, మ్ ఆమె ఇంకొక పని ఏదైనా చేసి రక్షణ పొందేటట్టు దేవుడు ఆమెకు ఏదైనా ఏర్పాటు చేస్తాడు. దేవుడు న్యాయమే చేస్తాడు ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ కాలమైనా, ఏ యుగమైనా, ఏ సన్నివేశం అయినా.
  • 🛡️ ఓకే. ఇప్పుడు మనకు ఉచితముగా రక్షణ ఇవ్వటంలో, కృప ద్వారా ఇవ్వడంలో ఒక న్యాయం ఉంది. ఉమ్ అలాగే హవ్వకు ఆమె సొంత స్వయంకృతపరాధం గనుక, ఆమె ఇంకేదైనా ఒక చిన్న మంచి పని చేసి రక్షణ పొందమని పెట్టేవాడేమో! కానీ అలా జరగలేదు. జరగని దాని గూర్చి మనం ఎప్పుడూ సిద్ధాంతాలు చేసే పని లేదు. దేవుని మంచితనాన్ని ఎరిగిన వాడిని గనుక, దేవుని ప్రేమ, న్యాయము, కృప ఎరిగిన వాడిని గనుక ఇలా దేవుడు చేసి ఉండేవాడు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మనము రక్షణ పొందటానికి, రక్షణ కొనసాగించుకోవడానికి ఈ సిద్ధాంతం అవసరం లేదు. జస్ట్ ఫర్ ఆన్ అండర్స్టాండింగ్ (Just for an understanding). ఓకే కానీ ఇప్పుడు మనకు దొరికిన ప్రకారం అయితే సంపూర్ణ సిద్ధిలోకి మనం వెళ్లాల్సిందే. దిస్ ఈజ్ జస్ట్ ఇమాజినరీ డిస్కషన్ (This is just imaginary discussion). నాట్ ఏ ప్రాక్టికల్ రియలిస్టిక్ డిస్కషన్ (Not a practical realistic discussion). ఓకే. బ్రదర్ ఆదిత్య గాడ్ బ్లెస్ యు.

Detailed English Translation:

🍎 Question: If Eve was deceived and ate the fruit, but Adam (who was not deceived) had chosen not to eat it out of love for God instead of eating it out of love for Eve, what would have happened to Eve? Would God have provided a way of salvation for her individually?

  • A Hypothetical Scenario: If Adam had remained obedient, God could have easily provided him with another companion. The core of the question is God’s plan for a lone sinner.
  • Salvation by Grace vs. Works: Our current salvation is by grace through faith, without our works, because we became sinners through Adam without our choice. We inherited a fallen nature effortlessly, so we receive a redeemed nature effortlessly through Christ.
  • Eve’s Unique Position: This ‘inheritance’ logic wouldn’t apply to Eve in this scenario because her sin was personal, willful, and direct. Therefore, her path to redemption would likely have been based on ‘works’ or specific acts of repentance and obedience, similar to how other religions perceive salvation—doing something to earn back God’s favor.
  • The Justice of God: God is perfectly just. He would not have simply abandoned her to hell without a chance for restoration. He would have instituted a fair method for her to seek forgiveness. However, since this is not what happened in history, this remains an ‘imaginary discussion’ to help understand the mechanics of grace and justice. Our focus must remain on the actual path of salvation provided through the second Adam, Jesus Christ.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram