20.Q: Analysis of 2019 Election Results (KSM 02) 🗳️

🗳️ ప్రశ్న: ఇప్పుడు మీరు రాజకీయ పార్టీని స్థాపించారు, రాజకీయాల్లోనికి వచ్చారు. ఎంతో మంది క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారు. మీరు 2019 ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయడం జరిగింది. దీనివల్ల ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి సార్? ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? వచ్చిన రిజల్ట్ మీద? (0:35:02)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 13s)

  • 🗳️ ఈ రెండు వేరు వేరు ప్రశ్నలు – మాకు ఎదురైన అనుభవాలు ఏమిటి అన్నారు, ఈ వచ్చిన ఫలితాల మీద మీ అభిప్రాయం ఏంటన్నారు. ఈ రెండు కొండంత ప్రశ్నలు. అయితే మొట్టమొదటి ప్రశ్నకు మొదటి సమాధానం చెప్తాను. మేము పోటీ చేసాము, అయితే ఒక్క సీటు కూడా గెలవలేదు సార్. మేము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసాం – ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, అలాగే మరి జమ్మూ కాశ్మీర్, తర్వాత ఇటు ఆంధ్ర, తెలంగాణ ఇలాగ అనేక కర్ణాటక, అనేక రాష్ట్రాల్లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కూడా చేశాం. అసెంబ్లీలో తర్వాత ఛత్తీస్గడ్ కూడా చెప్పాను, జార్ఖండ్.. ఎన్ని రాష్ట్రాల్లో చేసాం అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ (As well as) లోక్ సభ సీట్స్ కూడా చేసాం.
  • ⚖️ ఓకే అయితే ఒక్క సీటు కూడా రాలేదు. దీని గురించి మరి మీరు ఏమనుకుంటున్నారు ఇదేమి నిర్వాహకం అంటే – మొట్టమొదటి విషయం ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టడానికి, పోటీ చేయడానికి ప్రతి ఒక్క పౌరుడికి కూడా హక్కు ఉన్నది, అధికారం అన్నది. తర్వాత తప్పకుండా గెలిచి తీరాలి అనే రూల్ ఏమీ లేదు. అది ప్రజల తీర్పు. ఓకే రేసులో మేము ఉన్నాము, మాకు అధికారం ఇస్తే ఈ మేలు చేద్దాం అనుకున్నాము. మ్మ్ ప్రజలందరూ ఎవరో ఒకరిని ఎన్నుకొని వాళ్ళకు అధికారం అప్పచెపితే, వాళ్లైనా ప్రజల్ని సరిగ్గా పరిపాలించడానికి మేము నిర్మాణాత్మకంగా మేము కృషి చేస్తాము, సహకారం అందిస్తాం. మ్ ఆ ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేకమైన చర్యలు చేస్తే ఇంతకుముందు కంటే ఇప్పుడు మాకు బెటర్ ఛాయిస్ (Better choice) ఉంది, బెటర్ ప్లేస్మెంట్ (Better placement) ఉంది, బెటర్ ప్లాట్ఫామ్ (Better platform) ఉంది. ఇంతకుముందు ఒంటరిగా ఒక వ్యక్తిగానే గళమెత్తి నిలదీసేవాళ్ళం, ఇప్పుడు ఒక పార్టీ వేదిక మీద నిలదీస్తాము. దట్ వే వి హెల్ప్ ద గవర్నమెంట్, ద రూలింగ్ పార్టీ అండ్ బ్యూరోక్రసీ టు రూల్ వెల్ (That way we help the government, the ruling party and bureaucracy to rule well). ఇదొక విషయం.
  • 🧱 ఇకపోతే మొన్న జరిగినటువంటి ఫలితాలలో మేము అధికారానికి రాలేకపోయాము అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ (Factors). మొట్టమొదట అధికారం సాధించడానికి చాలినన్ని సీట్లు మేము పోటీ చేయలేదు. ఓకే కొద్ది మాత్రమే చేయగలిగాం. ఎందుకు అంటే అంతమంది అంబేద్కర్ రైట్లు (Ambedkarites) మాకు దొరకలేదు. ఓకే ఇప్పుడు 175 సీట్లు మేము పోటీ చేయాలి అనుకోండి, 543 సీట్లు పోటీ చేయాలి అనుకోండి – అంతమంది 543 లోక్సభ నియోజకవర్గాలకు అంబేద్కర్ రైట్లు మాకు కావాలి కదా! అవును సార్. మేము వడపోత చేసినప్పుడు అంబేద్కర్ రైట్లం అనుకున్న వాళ్ళు, నీలి జెండా వేసుకున్న వాళ్ళు కూడా కులం కొరకు పోరాడుతున్నట్లుగానే మాకు కనపడింది. ఓకే కనుక ఎవరైతే అంబేద్కర్ రైట్ అని మా ఇజం (Ism), మా ఆలోచన విధానానికి కట్టుబడి ఉంటారు అనుకున్నామో వాళ్ళకి టికెట్లు ఇచ్చాం. అది దట్ బికమ్ ఏ వెరీ స్మాల్ నెంబర్ (That became a very small number). అప్పుడు మరి ప్రజలు ఎలాగ ఓటు వేస్తారు? ఓటు వేసినా ప్రయోజనం ఏముంది వీళ్ళు అధికారంలోకి రారు, వ్యవస్థను మార్చలేరు గనుక అందుబాటులో ఉన్నోళ్ళ వరకు సెలెక్ట్ చేసుకున్నారు. ఇదొక విషయం.
  • 🏛️ ఓకే తర్వాత అధికారంలోకి రాకపోవడం అనేది మాకు ఏమి అవమానం కాదు ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారే అధికారంలోకి రాలేదు. అవును ఇప్పుడు ఆయన రిపబ్లికన్ పార్టీ పెట్టారు. నా అంచనా ప్రకారం, నా ఎక్స్‌పెక్టేషన్ (Expectation) ప్రకారం న్యాయంగా నేను ఆలోచించేది ఏంటంటే – దేశంలో దళితులు, బీసీలు మొత్తం అందరూ మహిళల హక్కుల కొరకు కూడా ఆయన పోరాడి ఆలోచించాడు. అవును ఆ బీసీ వాళ్ళ కొరకు కూడా, ఎస్సీ ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్స్, ట్రైబల్స్ వీళ్ళందరి కొరకు, మహిళల కొరకు ఆయన ఆలోచించి తపించిన మహనీయుడు ఆయన. అవును ఒక్క మహిళా ఓటు గాని, ఒక ట్రైబల్ ఓటు గాని, దళిత ఓటు గాని, బీసీ ఓటు గాని ఎటు పోకుండా రిపబ్లికన్ పార్టీకి పడాలి. అవును అంబేద్కర్ గారు హీ షుడ్ రూల్ ద కంట్రీ (He should rule the country). అవును కానీ మరి దళితులు, బీసీలు కూడా ఆయనను సపోర్ట్ చేయలేకపోయారు. మరి నేను ఏ పార్టీ? ఆ మహానుభావుడితో పోల్చుకుంటే ఆయన అంతరిక్షం అంత ఎత్తున్న మహా గొప్ప వ్యక్తిత్వం. నేను చిన్న ఏదో ఎలకపిల్లో ఏదో చిన్న ప్రాణి లాంటి వాడిని సార్. అందుచేత ఆయనే కాకుండా మహామహానుభావులు, మంచి మంచి పెద్ద పెద్ద ధనవంతులు అయిన వాళ్ళు, అనుభవజ్ఞులు కూడా పార్టీలు పెట్టి ఎన్నికల్లో పెర్ఫామ్ (Perform) చేయలేకపోయిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. కనుక రాజకీయాల్లో ఇది మామూలే, చాలా మామూలే.
  • 💎 మ్మ్ హ్మ్ మరొక విషయం కూడా ఏంటంటే మాకొక గర్వకారణం ఉన్నది సార్. మేము కాళ్ళ ఎగిరేసుకొని మేము ఆ గుండెల మీద చెయ్యి వేసుకొని మా జబ్బ మీద చర్చుకొని షబాష్ అని మురిసిపోతున్నటువంటి విషయం ఒకటి ఉంది సార్. ఏంటంటే – కొన్ని చోట్ల మా అభ్యర్థులకు 6000 ఓట్లు వచ్చినాయి, 2000 ఓట్లు వచ్చినాయి, రెండున్నర వేల ఓట్లు వచ్చినాయి. ఉమ్ మిగతా పెద్ద పెద్ద పార్టీలు డబ్బులు మంచినీళ్ల లాగా ప్రవహింపజేశారు. ఒక్కొక్క ఓటుకు 4000, 5000, 10,000 కూడా ఇచ్చారట. మ్మ్ మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ప్రభుత్వం ఏం చేస్తుందో, ఈ చెక్ పోస్ట్లు ఏం చేస్తున్నాయో తెలీదు. మాకైతే డబ్బు లేదు, పార్టీ ఫండ్ లేదు సార్. ఆ మేము టికెట్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు గనుక మా దగ్గర డబ్బులు లేదు, గనుక మేము పెద్దగా ప్రచారం చేయము లేదు. ఓకే మేము ఓటుకు ఇంత రేట్ అని డబ్బులు మేము ఇవ్వకపోయినా, మేము ప్రచారం పెద్దగా చేయకపోయినా.. అవతల వాళ్ళు ఓటుకు 10,000, 5000 ఇస్తున్నా సరే ఇవన్నీ మాకు వద్దని మా పార్టీకి ఓటు వేసినోళ్ళు ఒక 6000 మంది అయినా ఉన్నారు. అవును 2000 మంది అయినా ఉన్నారు.
  • ✨ హ్మ్ పెద్ద పెద్ద పార్టీల నాయకులు నాకు ఎన్నికల తర్వాత ఫోన్ చేశారు – “రంజిత్ గారు మీకున్న ఫేస్ వాల్యూ (Face value) ఎటువంటిదండి? మా పార్టీలన్నీ డబ్బులు వేల కోట్లు, లక్షల కోట్లు పంచిపెడితే మీరు ఇంట్లో కూర్చొని ఒక పిలుపునిచ్చి 6000 మంది, 2000 మందిని ఓట్లు వేయించారుగా!” ఇప్పుడు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం మా అభ్యర్థి విజయభాస్కర్ గారికి 2550 ఓట్లు వచ్చినాయి సార్. అంటే ఆ పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వేల మంది ఒక రూపాయి నాకు అక్కర్లేకపోయినా రంజిత్ గారి ఆలోచన విధానం నేను నమ్ముతున్నానని ఓట్లు వేసినోళ్ళు ఉన్నారు. అవును ఇది మాకు గర్వకారణం. ఓకే కాబట్టి ఈ ఇజం (Ism) అనేది, ‘ఓఫిరిజం’ అనేది, ప్రజాబంధు పార్టీ యొక్క ఆలోచన విధానం అనేది ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేము నమ్ముతున్నాం నెక్స్ట్ ఎలక్షన్స్ లో తప్పకుండా మేము ప్రభావం చూపగలుగుతాం.

Detailed English Translation:

🗳️ Question: You established a political party and contested the 2019 elections despite opposition from some Christians. What were your experiences, and what is your opinion on the results where you didn’t win any seats?

  • The Right to Contest: In a democracy, every citizen has the right to form a party and contest elections. Winning is the people’s verdict, and we respect that. Even though we didn’t win a seat, the experience provided us with a better platform and identity to question the government constructively. We are now a recognized voice rather than just an individual critic.
  • Adherence to Ideology: We didn’t contest all seats because we couldn’t find enough genuine ‘Ambedkarites’ who were free from their own sub-caste biases. We prioritized ideology over numbers. If we can’t find people committed to the cause, we prefer to contest fewer seats with quality candidates.
  • No Shame in Defeat: Not coming to power is not an insult. Even Dr. B.R. Ambedkar, the architect of our Constitution, could not win through his Republican Party because the very marginalized sections he fought for—Dalits, BCs, and women—didn’t fully consolidate their votes for him. If a giant like Ambedkar faced such hurdles, my party’s struggle is understandable.
  • The Pride of ‘Clean’ Votes: Our greatest achievement is our integrity. While major parties spent thousands of rupees per vote, we didn’t pay a single rupee. Despite no money power and limited campaigning, thousands of people voted for us purely because they believed in our vision. Political rivals were shocked that my ‘Face Value’ could pull thousands of votes without any financial distribution. This base of selfless supporters is our true strength. ‘Ophirism’ and our party’s ideology are reaching the masses, and we are confident of making a significant impact in future elections.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram