22.Q: Political Strategy for All Communities (KSM 02) 🎭

🎭 ప్రశ్న: సంతోషం సార్ మరి ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఏందంటే ఇదొక క్రిస్టియన్ పార్టీగా చూస్తున్నారు దీన్ని, క్రైస్తవులు మాత్రమే వీళ్ళకు ఓట్లు వేస్తారని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేశారు ఎన్నికల బరిలో ఉన్నటువంటి ఆ సమయంలో. ఆ వేరే వాళ్ళ దగ్గరికి వేరే మతస్తుల దగ్గరికి లేదా వేరే కులస్తుల దగ్గరికి ఆ బడుగు బలహీన వర్గాల దగ్గరికి ఏ విధంగా వెళ్ళగలుగుతారు? అంటే మీ నోటి నుండి చెప్పారు మీరే చెప్పారు కదా సార్ – అంబేద్కర్ గారు అంతటి వాడికే ఓట్లు వేయలేరు వీళ్ళు అన్నారు కదా, మరి ఇంకా ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లి వాళ్ళ ఓట్లను సంపాదించుకునే దిశగా ఆ ప్రయత్నించబోతున్నారు? (0:44:39)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 01s)

  • 🎭 ఇప్పుడు అన్ని కులముల అన్ని వర్గముల వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మేము గెలుచుకోవడానికి మ్ అవసరమైన వ్యూహాలు మేము అవలంబిస్తాము అనే మాట చెప్పగలను గానీ మ్ ఈ వ్యూహము ఏమిటనేది వివరంగా నేను చెప్పలేను. ఓకే సార్. ఎందుకంటే మ్ నా వ్యూహం ఏంటో నేనంతా బట్టబయలుగా చెబితే వేరే పార్టీ ఇదే వ్యూహం ఎత్తుకోబోయే ప్రమాదం ఉన్నది. ఓకే. గనుక రాజకీయంలో భాగం ఏంటంటే – ఒక మంచి చేయాలన్నా సరే చేద్దాం అనుకున్న పద్ధతిని దాచిపెట్టాలి, లేకపోతే మంచిని కూడా జరగనియ్యరు.
  • 📚 ఓకే ఆ మరి ఇప్పుడు ముందు మా వ్యూహం పై పైన చెబుతున్నాను – దళితులలో ఉన్న రెండు వర్గాలు ఓకే ఆ 59 ఉపకులాలు వీరినందరినీ సంఘటిత పరచడానికి సామాజిక, ఆర్థిక ఆ అభివృద్ధి కార్యక్రమాలు, ఎడ్యుకేటింగ్ ప్రోగ్రామ్స్ (Educating programs), అవేర్నెస్ ప్రోగ్రామ్స్ (Awareness programs) పెడతాం. బాబాసాహెబ్ అన్నారు – ఫస్ట్ అఫ్ ఆల్ ఎడ్యుకేట్ దెమ్ (First of all educate them). వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. అవును వాళ్లకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి సార్ ఇదొకటి. ఆ ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఈ కులము పేరు మీద ఒకరినొకరు గౌరవించుకోవడం కానీ లేక నీచంగా చూడడం కానీ అనేది పోయేటట్టు సామాజికంగా బ్రెయిన్ వాష్ (Brain wash) జరిగేటట్టు మేము కళారంగాన్ని ఉపయోగించుకుంటాము. ఓకే.
  • 🎬 ఆ కళారంగం – ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను చెప్పాను ‘1942 ఒక గ్రామం’ అని. అవును సార్ అవును. అలాంటి సినిమాలు ఎక్కువ రావటానికి సమాజమంతా ఆ ఆలోచన పంథాలు రావడానికి మావంతు కృషి, ప్రోత్సాహం ఓకే అందిస్తాను. నేను అనుకుంటున్నా ఒక 1000 సినిమాలు అటువంటివి వచ్చాయి అనుకోండి, ఈ దేశం తప్పకుండా సగానికి సగం మారిపోతుంది. ఓకే సార్. అంటే సినిమాలు తీసే ప్రయత్నం కూడా ఏమైనా చేస్తారా సార్? ఆ తప్పకుండా. మాది ‘అపరంజి ఫిలిమ్స్ మోషన్ పిక్చర్స్’ అని నాది ఒక రిజిస్టర్డ్ నా ఫిలిం ప్రొడ్యూసింగ్ సంస్థ ఉంది. ఓకే సార్. ఐ యామ్ రిజిస్టర్డ్ లైఫ్ టైమ్ మెంబర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Andhra Pradesh Film Producers Guild) లో నేను మెంబర్ ని. ఓకే సార్. అయితే ఆ తర్వాత రెండు రాష్ట్రాలు అయ్యాయి, ఇప్పుడు ‘తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ లో కూడా నేను మెంబర్ అయ్యాను. ఓకే సార్. కంగ్రాాచులేషన్స్ సార్.

Detailed English Translation:

🎭 Question: What is your future political roadmap? Many perceive your party as a ‘Christian party’ and doubt your ability to win over other castes and religions. Given that even Dr. Ambedkar struggled to get votes from his own people, how do you plan to gain their trust and votes?

  • Strategic Confidentiality: While we have devised comprehensive strategies to win the trust of all communities and sub-castes, I cannot reveal the fine details publicly. In politics, revealing your methods prematurely allows opponents to hijack your ideas or sabotage your efforts.
  • Education and Social Awareness: Our primary focus is on education and awareness. As Dr. Ambedkar said, “Educate, Agitate, Organize.” We aim to conduct programs that educate the 59 Dalit sub-castes and other marginalized groups about their rights and social standing. We want to remove the internalized hierarchy of caste pride and prejudice.
  • Cinema as a Tool for Reform: We will utilize the power of art and media to bring a social shift. I believe that if we can produce or promote around 1,000 films with powerful messages like ‘1942 Oka Gramam,’ the nation’s mindset will undergo a major transformation.
  • Aparanji Films: To this end, I have a registered film production company called ‘Aparanji Films Motion Pictures.’ I am a lifetime member of the Film Producers Guilds in both Andhra Pradesh and Telangana. We intend to use this platform to create content that inspires social reform and equality, helping people see beyond religious and caste-based labels.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram