🏺 ప్రశ్న: ఓకే సార్ థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ సార్. ఇది ఇంకా ఈ వేదాలలో ఉన్నటువంటి సారాంశమును ఇంకా ప్రజలందరూ ఎన్నో ప్రశ్నలతో ఉన్నారు. అంటే ఇంకా చాలా అడగాల్సినవి ఇంకా తెలుసుకోవలసిన చాలా విషయాలు ఉన్నాయి కదా! వాటిని ఇంకా ఏ విధంగా వివరిస్తారు? ఏ విధంగా తెలియజేస్తారు? అంటే 39 విశేషణాలు ఉన్నాయి వేదాలలో భగవంతుని గూర్చిన, ఇంకా అంతేకాకుండా ఆ మీరు చాలా సార్లు ప్రసంగాలలో చెబుతూ ఆయన ఇంకా ఎన్నో విశేషణాలు చెప్పారు కదా! వీటన్నిటినీ కూడా ఇంకా విశ్లేషించడానికి ఇంకా ఏ విధముగా ముందుకు వెళ్లొచ్చు? (0:56:15)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 47s)
- 🏺 మంచి ప్రశ్న అడిగారు. నేను అందరికీ విన్నవించే విషయం ఏంటంటే – వేదాలలో అపారమైన విజ్ఞానం ఉన్నది. ఆధ్యాత్మిక విజ్ఞానం ఉన్నది, వైద్యశాస్త్ర సంబంధమైన విజ్ఞానం ఉన్నది, సామాజిక శాస్త్ర సంబంధమైన విజ్ఞానం కూడా ఉన్నది. ఉమ్ వేదములు అనేవి ప్రాచీన కాలంలో మహర్షులు యోగ ముద్రలో దైవ ధ్యానంలో కూర్చొని సాధించిన దైవిక ప్రత్యక్షత, సాక్షాత్కారం వల్ల పొందిన విజ్ఞానమంతా పొందుపరిచిన విజ్ఞాన భాండాగారము వేదము.
- 🧭 అయితే ఇప్పుడు నాకు ఉన్నటువంటి ముఖ్యమైన కార్యక్రమం, జీవితాశయం ఏంటంటే – వేదములో చాలా మ్యాటర్ (Matter) ఉంది, ఉంది అదొక పెద్ద నిధి. వేదము అనే విజ్ఞాన నిధిలో ఉన్న విషయాలన్నీ బయటికి తీయడం అనేది నా జీవితాశయం కాదు. ఓకే. నన్ను రక్షించిన యేసును అందరికీ చూపడమే నా జీవితాశయం. ఓకే ఆ పని నేను ‘హైందవ క్రైస్తవం’ బుక్కు (Book) లో చేశాను. ఓకే సార్.
- ✨ అది నేను సక్సెస్ ఫుల్ (Successful) గా చేశాను కాబట్టి ఇంత గొడవ జరుగుతుంది. అవును. ఉమ్ ఇప్పుడు ఫ్రాన్సిస్ గారు రాశారు, సూర్యనారాయణ గారు పరవస్తు వారు రాశారు ఉమ్ ఎందరో రాశారు కానీ ఇంత గలిబిలి రేగలేదు ఉమ్ ఎందుకు నన్ను గూర్చి ఇంత గొప్ప కలవరము, వివాదం వచ్చిందంటే – పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ గెట్టింగ్ కన్విన్సుడ్ (People are almost getting convinced) అన్నమాట. ఓకే. అందుచేత నేను యేసును చూపడానికి అవసరమైన విషయాలన్నీ చెప్పాను, ఓకే ఇంకా ఎన్నైనా చెప్తాను యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ పాయింట్ టువర్డ్స్ జీసస్ (As long as I can point towards Jesus).
- 🛡️ ఓకే ఐ యామ్ ఏ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ (I am a servant of Jesus Christ). ఓకే ఐ యామ్ నాట్ ఏ సర్వెంట్ ఆఫ్ వేదాస్ (I am not a servant of Vedas) ఆర్ ఎనీ అదర్ బుక్ (Or any other book) ఆర్ ఎనీ అదర్ ఫెయిత్ (Or any other faith). నేను క్రీస్తు సేవకుడిని. “సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము” అన్నాడు పౌలు, ఆ పరంపరలో ఉండి నేను ఓకే యేసును చూపడానికి నేను దేన్నైనా వాడుకుంటాను. ఓకే సైన్సును వాడుకుంటాను మ్ ఆ తర్వాత చరిత్రను వాడుకుంటాను, కావ్యాలు వాడుకుంటాను, రాజకీయాలను వాడుకుంటాను – క్రీస్తు ఇదిగో అని జస్ట్ పాయింట్ అవుట్ (Point out). ఓకే ఎవరినీ దేనికీ బలవంతం చేయలేము, కొంచెం వాళ్ళ యొక్క దృష్టి మళ్లించాలి. నోబడీ కెన్ ఫోర్స్ ఎనీబడీ (Nobody can force anybody), బలవంతం చేస్తే ఎవడూ విశ్వాసం మార్చుకోడు. మ్ గనుక ఏది చేసినా – సామాజిక సేవ చేసినా, రాజకీయ పోరాటాలు చేసినా – నా జన్మ కర్మ పాపముల నుండి నన్ను విముక్తుడిని చేసిన మహాదేవుడు యేసు, ఒక్కసారి అటు చూడండి భయ్యా అని అందరినీ చూపించడానికే ఏదైనా చేస్తున్నాము. ఓకే సార్.
Detailed English Translation:
🏺 Question: There is so much more to learn from the Vedas, like the 39 attributes of God you often mention. How do you plan to further analyze and explain these profound spiritual truths to the people?
- Treasury of Knowledge: The Vedas are an immense storehouse of ancient wisdom, encompassing spiritual, medical, and social sciences, attained by sages through deep divine revelation.
- The True Purpose: However, my life’s mission is not to simply uncover all the secrets of the Vedas. My singular goal is to point people toward Jesus Christ, the one who saved me. I used the Vedas in my book ‘Haindava Kraistavam’ as a bridge to show Christ, and the controversy surrounding it proves that people are being convinced by this truth.
- A Servant of Christ: I am a servant of Jesus Christ, not a servant of the Vedas or any other philosophy. Like Apostle Paul, I preach the crucified Christ. I am willing to use any medium—science, history, literature, or even politics—as a pointer to say, “Look, here is the Savior.”
- Gentle Persuasion: Faith cannot be forced. My role is to simply shift people’s focus toward the divine reality of Jesus. Whether I engage in social work or political struggle, the underlying motive is always to introduce the Great God Jesus, who liberated me from the cycle of sin. I invite everyone to just take a look at Him.
