🧴 ప్రశ్న: సంతోషం సార్. ఈ పరంపరలోనే ఇలా చేస్తూ మీరేమో ఈ పందాలో వెళ్తున్నారు కదా సార్. వెళ్తున్నప్పుడు ఈ మధ్య ఒక గందరగోళం రేగింది ఏంటంటే – ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని తల మీద చెయ్యి పెడితే స్వస్థతలు అవుతాయి, క్యాన్సర్ పోతది, రోగాలు పోతాయి.. నూనె సీసాలు అమ్ముకుంటున్నారు, దశమభాగాలు తీసుకుంటున్నారు, దాని కొరకే వీళ్ళు సేవ చేస్తున్నారు అని చెప్పేసి ఒక దుమారం రీసెంట్ గా జరిగింది కదా సార్! దీని మీద మీ అభిప్రాయం ఏంటి? (0:59:44)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (8m 22s)
- 🧴 ఇప్పుడు అసూయపరులు, క్రీస్తు మార్గాన్ని ద్వేషించే వాళ్ళు ఎన్నైనా మాట్లాడుతారు. సువార్త చెప్పి లక్షలాది మంది జీవితాలు మార్చబడుతూ ఉంటే – దశమభాగాల కొరకే మీరు సేవ చేశారు లేకపోతే దశమభాగాల కొరకే నూనె సీసాలు అమ్ముకోవడానికి వచ్చారు అని చెప్పడం ఎంతవరకు సబబు? ఆ లెక్కన మరి వీళ్ళు బాబాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు బయలుదేరి వందల ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఆ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో నిన్న కాక మొన్న ఏమీ లేని చోట చిన్న రాయి పెడతారు, అది పెద్ద దేవాలయమే ఎకరాల కొద్దీ కబ్జా అయిపోతుంది. దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు. మీరు ఇట్లా భూకబ్జాల కొరకే మీరు ధర్మ ప్రచారం చేస్తున్నారు అంటే ఒప్పుకుంటారా? ఆ ఒప్పుకోరు.
- ✨ అందుచేత అసూయపరులు ఎన్నెన్నో మాట్లాడుతారు, దానికి మనం జవాబు ఇయ్యాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే – తల మీద చేయి పెడితే రోగాలు నయం, వీళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. అలాగే స్వస్థత పొందిన వాళ్ళు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు. ఉమ్ ఇప్పుడు నేను చెప్తున్నాను – అలాగే స్వస్థత పొంది డాక్టర్లందరూ కూడా ఆశ వదిలేసి మ్ మా వల్ల ఏమీ జరగదు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏసుప్రభువును నమ్ముకొని స్వస్థత పొందినోళ్ళు వేల మంది రోగులు ఉన్నారు. మ్ ఏ డాక్టర్ దగ్గర పోయినా వాళ్ళు ఫైనల్ గా ట్రీట్మెంట్ చేసినంత చేసి ఆఖరిన ఒక మాట అంటారు – “మానవ ప్రయత్నంగా మేము చేసామండి, ఆ పైన అంతా ఆ పైవాడి దయ” అనేది ఒక హిందూ వైద్యుడైనా, మ్ ఒక క్రైస్తవ వైద్యుడు, ముస్లిం వైద్యుడైనా ఎవరైనా అంటారు. అవును.
- 🧪 గనుక మానవ ప్రయత్నం, వైద్యశాస్త్రం యొక్క ప్రయత్నానికి కూడా ఒక పరిమితి ఉంది, లిమిట్ (Limit) ఉంది. ఓకే దే ఆర్ నాట్ గాడ్స్ (They are not gods). అవును. మా వల్ల జరిగింది చేసామండి తర్వాత మా చేతిలో ఏమీ లేదు అన్న తర్వాత మిరాక్యులస్ (Miraculous) గా బ్రతికిపోయినోళ్లు వేల మంది ఉన్నారు. అవును. గనుక మన కళ్ళ ముందు జరుగుతున్న వేరే కొంతమంది స్వస్థతలను చూసి ఇంకా జన సమూహం రావడం జరుగుతుంది తప్ప వీళ్ళు ప్రచారం చేసుకుంటే ఎవరూ రారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, సవాలు చేస్తున్నాను – ఈ ప్రచారం ఇట్లా మోసం చేస్తున్నారు అని చెప్తున్నారు కదా, ఆయన ఒక పేపర్ ప్రకటన ఇయ్యమనండి “నేను రోగులను స్వస్థపరుస్తాను” అని. రేపటికల్లా పదివేల మంది వస్తారేమో ఆయనకి! మ్ నవ్వేసి ఊరుకుంటారు – “నీ మొఖం పోరా” అని. అవును. వీళ్ళు చెప్పుకున్నందుకు జనాలు రావడం లేదు. మ్ అక్కడికి వెళ్లి బాగుపడి వచ్చిన వాళ్ళు నా ఊరోళ్ళందరూ చూస్తున్నారు, అందుకని ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు.
- 🛡️ స్వస్థతలు జరగడం అనేది నిజం. మ్ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను – దర్గా దగ్గరికి పోయినప్పుడు, తిరుపతి కొండకు పోయినప్పుడు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి అని కూడా నేను చెప్తున్నాను. అవును ఎన్నో సార్లు చెప్పాను ఇప్పుడే కాదు. అవును ఏ దేవుని మీద విశ్వాసం ఉన్నోళ్ళకి అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి గనుక పెద్ద అబ్బురం ఏమీ లేదు. అద్భుతం జరిగినందుకు యేసుని నమ్మకండి బాబు మ్మ్ వేద ప్రవచనము నెరవేరుస్తూ యేసు సిలువలో బలియై మళ్ళీ లేచాడు గనుక యేసుని నమ్మండి. ఉమ్ ఏ శక్తి అయినా ఏ పుణ్యక్షేత్రమైనా నీకు రోగ స్వస్థత ఇవ్వచ్చు, పాప క్షమాపణ నరకము నుండి రక్షణ యేసు మాత్రమే ఇవ్వగలడు అనేది నేను చెబుతున్న సందేశం. అవును సార్. ఓకే. సో ఐ హావ్ నో అబ్జెక్షన్ (I have no objection) ఇఫ్ ప్రవీణ్ కుమార్ ఈజ్ హీలింగ్ (Is healing) ఆర్ ఎనీబడీ ఈజ్ డూయింగ్ హీలింగ్ మినిస్ట్రీ (Is doing healing ministry). బ్రదర్ దినకరణ్ గారు, ఇంకా చాలా మంది – ఆస్బార్న్ గారు, బెన్నీ హిన్ గారు, జాయిస్ మేయర్ గారు ఎందరో ఉన్నారు. ఓకే ఐ హావ్ నో అబ్జెక్షన్. అండ్ ఐ హావ్ నో అబ్జెక్షన్ ఇఫ్ సంబడీ టెల్స్ – “తిరుపతి కొండకు పోయాను నా క్యాన్సర్ నయమైంది” అంటే కూడా నేను ఆబ్జెక్ట్ చేయను. అవును. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ (It doesn’t matter for me). నేను చెప్పేది ఏంటంటే – ఎక్కడ పోయినా మీరు స్వస్థత పొందొచ్చు పొందకపోవచ్చు, రక్షణ మాత్రం యేసయ్య ఇస్తాడు. ఇది నా సందేశం.
- 🧴 ఓకే సార్ థాంక్యూ సార్. సార్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు, సతీష్ కుమార్ గారు నూనె సీసాలు అమ్ముకుంటున్నారు అని అంటున్నారు. అయితే దానిని అది బైబిల్ లో ఉందా నూనె సీసాలు ఇలా అమ్ముకోమని అని చెప్పేసి మొన్న ఒకాయన టీవీ ఛానల్ లోనే ఆ క్రైస్తవుడు అయి ఉండి మాట్లాడుతున్నాడు ఈ మాట. ఆ క్రైస్తవులు, క్రైస్తవులందరూ కూడా మ్ క్రైస్తవ సమాజం పక్షంగా అథెంటిక్ వాయిస్ (Authentic voice) కాదు కదా! వాళ్ళకు కూడా ప్రత్యక్షత లేదు. ఉమ్ గనుక అట్లా విమర్శించడం అనేదాన్ని నేను ఒప్పుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చెబుతున్నాను ఏంటంటే మ్ రోగుల కొరకు నూనె రాసి ప్రార్థన చేయమని బైబిల్ లో ఉంది. నూనె అట్లా వదిలేసేయండి – నయమాను ఆ యోర్దాను నదిలో ఏడు సార్లు మునిగితే శుద్ధుడై ఉన్నాడు. ఒక గుడ్డివానికి యేసయ్య ఉమ్మి వేసి బురద చేసి, బురద కళ్ళు పూసి కడుక్కోమంటే వాడికి చూపు వచ్చేసింది. పౌలు భక్తుడు ఒకసారి వాడినటువంటి జేబు రుమాలు, నడికట్టును తీసుకెళ్తే రోగులు స్వస్థత పొందారు అంటే నిర్జీవ వస్తువులలో దేవుని శక్తి ప్రతిష్టించబడుతోంది, వాడబడుతుంది అనేది బైబిల్ అంతటా కనబడుతుంది.
- 💰 ఈ నూనె అనేది కొంచెం ప్రస్తావించబడింది యాకోబు పత్రికలో. గనుక ప్రజలకు నమ్మకం ఉన్నది, వాళ్ళ నమ్మకాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. కొంతమంది నూనె కాదు మంచి నీళ్లు – “అయ్యా నా దగ్గరికే వచ్చి ప్రార్థన చేయమంటే నూనె లేదు నీళ్ళ మీద సిలువ కుట్టేసి ఇస్తాను” బాగుపడ్డ వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. మేము అది ప్రచారం చేసుకోము, ఎందుకంటే బాగు చేసినవాళ్ళు యేసయ్య, రంజిత్ ఓఫిర్ కాదు. మ్ యేసుప్రభువు వారు బాగుచేశారు నేను కాదు, నేను డబ్బా వాయించుకోవడం ఏముంది! ఉమ్ ఆ విషయంలో ఒకవేళ అదే స్థానంలో, నా స్థానంలో ఒక చిన్న పిల్లవాడు ప్రార్థన చేసినా బాగుపడొచ్చు. ఓకే యేసు నామములో శక్తి ఉన్నది. మ్ రంజిత్ ఓఫిర్ లో లేదు, దినకరణ్ లో లేదు, ప్రవీణ్ కుమార్ లో లేదు. వాళ్ళే అదే చెప్తున్నారు. ఓకే యేసుని నమ్మండయ్యా, ప్రవీణ్ కుమార్ ని కాదు అని ఆయనే చెప్తాడు. అవును.
- 🏛️ కాబట్టి ఇక విషయం ఏంటంటే – స్వస్థతలు జరుగుతున్నాయి. అయితే ఈ నూనె.. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారే లక్ష మంది ఇండ్లకు పోయి నూనె రాసి ప్రార్థన చేయడం సాధ్యం కాదు, సతీష్ కుమార్ గారే లక్ష మంది ఇంట్లోకి పోవడం సాధ్యం కాదు. బిజీ ఇవాంజలిస్ట్ (Busy evangelists), బిజీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ (Busy servants of God). గనుక “అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఇవ్వడం కాకుండా, మీరు ముందే ప్రార్థన చేసింది నూనె ఉంటే మేము తీసుకుపోతాము” అని అడిగితే.. మరి దానికి కూడా వారు సిద్ధమయ్యారు. ఓకే. అట్లా ముందు ఒక సీసా, నాలుగు సీసాలు, 10 సీసాలు, 1000 సీసాలు.. ఇక అందరూ అడుగుతున్నారు గనుక, ఎందుకు అడుగుతారు? కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి. అవును మరి నూనె ఆయనకి నూనె కానుకగా వస్తుందా? నూనె ఆయిల్ మిల్లు ఉందా సతీష్ కుమార్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి? అవి తీసుకుని రావాలి, అది కొనుక్కుంటేనే కదా వస్తుంది!
- ✨ కనుక ఏదో సువార్త ప్రకటించడానికి నూనెని తీసుకొస్తారు, దాన్ని మరి డబ్బులు పెట్టి కొన్నది గనుక అమ్ముతారు వాళ్ళు. వాళ్ళు కూడా మేము ఎక్కడో నూనె కొనుక్కొని వచ్చి ప్రార్థన చేయించుకోవడం కాకుండా అక్కడ వాళ్ళే అది కూడా కొన్ని ఏర్పాటు చేస్తే సరిపోతది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు లేని బాధ వీళ్ళకి ఎందుకండి? “నూనె సీసాలు అమ్మారు”.. నువ్వు అమ్ముకోవట్లేదు బూడిద! మ్ బూడిద అమ్ముకుంటున్నారు, అడ్డమైన పదార్థాలు అమ్ముకుంటున్నారు. అవును ఆవు మూత్రం అమ్ముకుంటున్నారు. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎందుకు విమర్శించాలి? అదంతా కూడా దురుద్దేశపూర్వకమైన ప్రచారాలు, దాన్ని మనం అసలు కన్సిడరే (Consider) చేయకూడదు. ఓకే సార్.
Detailed English Translation:
🧴 Question: There is a lot of controversy recently about pastors claiming to heal diseases like cancer by laying on hands and the sale of ‘blessed oil’ and collecting tithes. Critics say this is all done for money. What is your opinion on this?
- Biased Criticism: Those who hate the path of Christ will always find reasons to criticize. When millions of lives are being transformed through the Gospel, focusing solely on tithes or the sale of oil is unfair. Other religious groups occupy hundreds of acres of land or sell items like cow urine and sacred ash, but they are rarely questioned with such intensity. This is often fueled by professional jealousy or religious bias.
- The Reality of Miracles: Thousands of people, whom doctors had given up on, have been healed through faith in Jesus. Doctors often admit that while they provide treatment, ultimate healing comes from a higher power. People flock to these ministries not because of advertisements, but because they see real healings in their own communities. If healing wasn’t real, no one would bother coming, regardless of the claims made.
- Healing vs. Salvation: I acknowledge that miracles can happen in various faiths and places, including temples or dargahs, based on an individual’s faith. However, my message is clear: miracles may provide temporary physical relief, but only Jesus Christ can provide the forgiveness of sins and eternal salvation. Don’t believe in Jesus just because of a miracle; believe in Him because He fulfilled ancient prophecies and died for your sins.
- The Use of Tangible Items: The Bible supports using oil for prayer (James 5:14) and records instances where even handkerchiefs used by Apostle Paul brought healing. These are tools for faith. Regarding the ‘sale’ of oil—pastors cannot visit every home personally due to their busy schedules. When people request pre-blessed oil, the ministry has to purchase and bottle it. Since the oil isn’t free to obtain, they sell it to cover costs. If the people are satisfied and find peace, outsiders shouldn’t complain. The power isn’t in the pastor or the oil; it’s in the name of Jesus.
