27.Q: Differences in Teachings among Pastors (KSM 02) ⛪

⛪ ప్రశ్న: రైట్ సర్. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చాలామంది ప్రతి పాస్టర్ ను కూడా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు ఆలోచిస్తున్నారు – ఈ పాస్టర్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ పాస్టర్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఒకరికి ఒకరికి పొంతన లేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ సమయంలో కొంతమంది అయితే మమ్మల్ని ప్రశ్నలే అడగొద్దు అంటారు, కొంతమంది అలా అడిగినందుకు చర్చిలో నుంచి వెళ్ళిపోమన్నటువంటి సేవకులు ఉన్నారు, బయటికి వచ్చిన విశ్వాసులు కూడా ఉన్నారు. మీరైతేనేమో ప్రసంగాలలో, పబ్లిక్ మీటింగ్స్ లో అన్నిటిలో కూడా “నన్ను అడగండి నేను జవాబు చెప్తాను” అంటారు. మీరేమో ఆ వాయిస్ అంటారు, ఆ మాట అంటారు మీరు చాలా మంది ఇట్లా మాట్లాడారు.. ఇట్లా ప్రతి విషయంలో కూడా ఇలాంటి డిఫరెన్స్ (Difference) పాస్టర్స్ మధ్యలో ఎందుకు ఉంటుంది? చాలా మంది గందరగోళంలో పడిపోతున్నారు – అసలు ఏం చేయాలి, అడగాలనా వద్దా, ఎవరిని అడగాలి, ఎందుకు అడగాలి? (1:07:45)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (6m 30s)

  • ⛪ అసలు వైవిధ్యము అనేది ఒక క్రైస్తవ సమాజంలోనే లేదు, మానవ జాతిలో ఉన్నది. హిందూ మతమే ఉన్నది – శైవము, వైష్ణవము, శాక్తేయము.. ఇట్లా ఉన్నాయి. ఆ తర్వాత ఇస్లాం ఉన్నది, ముస్లిం సోదరుల్లో షియాలు, సున్నీలు ఉన్నారు, సూఫీ ఇస్లాం యిజం ఉన్నది. ఆ సూఫీ ఇస్లాం సోదరులే ఈ మధ్య మళ్ళీ నన్ను యూనివర్సిటీలో పబ్లిక్ చర్చకు పిలిచారు మత సామరస్యాన్ని గూర్చి, వెళ్తున్నాను. ఓకే సార్. అంటే విషయం ఏంటంటే వైవిధ్యం అనేది మానవజాతి అంతట్లో ఉంది. బౌద్ధంలో కూడా హీనయానము, మహాయానము అనేది అది ఉన్నది మళ్ళీ ఆ అందుచేత అసలు వైవిధ్యం లేనిది ఎక్కడ?
  • 🧠 ఎక్కడ కూడా టోటల్ యునానిమిటీ (Total unanimity) ఉండదు. ఉంటే కూడా బాగుండదు. అంతా మోనోటోనస్ (Monotonous) గా ఒకటే ఒకటి చెప్పింది, ఇంకోటి ఒకటి చెప్పింది ఇంకోటి.. అసలు వైవిధ్యం లేకపోతే ఆసక్తికరంగా కూడా ఉండదు. ఓకే నేను చెబుతున్నాను – అసలు మానవజాతిలో ఏ మతమైనా, ఏ సిద్ధాంతమైనా, ఏ కళారంగంలోనైనా, రాజకీయ ఫిలాసఫీస్ (Philosophies) లోనైనా అందరూ ఒక్కటే మాట్లాడరు. ఎందుకంటే భగవంతుడు మనుషులను ప్రోగ్రామ్డ్ రోబోస్ (Programmed robots) లాగా చేయలేదు. మ్ ఎవడికి వాడికి సొంత మెదడు పెట్టాడు – “సొంతంగా ఆలోచించుకోరా” అని. మ్ చుట్టూ ఉన్నటువంటి పరిసర పరిస్థితులు, పర్యావరణ పరిస్థితులను నువ్వు చూసి నీ హృదయం ఎలాగ స్పందిస్తుందో, ఎలాంటి ఆర్గ్యుమెంట్ (Argument) అయితే నీకు తృప్తిని ఇస్తుందో, ఆ నీకు ఎలా మాట్లాడితే నీకు మనశ్శాంతి ఉంటుందో నువ్వు మాట్లాడొచ్చు. మ్ అలాగ ప్రతి ఒక్కడు ఒక స్వతంత్ర వ్యక్తి భగవంతుని రూపంలో. మ్ దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఆదామును చేశాడు అన్నాడు. దేవుడు స్వతంత్ర ఆలోచనాపరుడు, ప్రతి మానవుడు అంతే. మ్
  • 🛡️ స్వతంత్రంగా ఆలోచించినప్పుడు నాకు సబబు అనిపించింది మీకు అనిపించకపోవచ్చు. మీరు వేరుగా ఫీల్ అవుతూ వేరుగా చెప్పుకునే హక్కు ఉండాలి – ఫ్రీడమ్ ఆఫ్ థాట్ (Freedom of thought) ఉంటుంది, లిబర్టీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ (Liberty of expression) ఉంటుంది. అందుచేత ఈ క్రైస్తవ సంప్రదాయాల్లో కూడా డిఫరెన్స్ (Difference), వైవిధ్యం ఉన్నది. దాంట్లో ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు ఒకడు ప్రశ్న అడగొద్దు అంటాడు, ఎందుకంటే నేను చెప్పలేను. ఆ అడిగేవాడికి చెప్పేవాడు లోకువా? చెప్తా పోతే, అడుగుతా పోతుంటే దీనికే టైమ్ అంతా పోతుంది భక్తి ఎప్పుడు సాధన చేస్తాం? దీన్ని ఎంకరేజ్ (Encourage) చేయొద్దు అంటాడు.
  • 📖 నేనేమో “మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు అడిగే ప్రతివానికి మీరు సాత్వికముతో ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండమంటాడు” పేతురు భక్తుడు. అవును. గనుక నేను అందులోకి వెళ్ళిపోయా, ఆ ఆలోచన ధోరణి మైండ్ సెట్ (Mindset) లో ఉన్నాను. నేనేంటంటే ఎదుటివాడిని గౌరవిస్తా, వాడు నమ్మడం లేదు మ్ నమ్మడం లేకపోతే కూడా వాడి అవిశ్వాసాన్ని నేను గౌరవిస్తా. ఏంటంటే అతడు ఎందుకు నమ్మడం లేదంటే ఒక వాలిడ్ ఆబ్జెక్షన్ (Valid objection) ఉంది. మ్ ఒక గౌరవనీయమైన ఒక కన్విన్సింగ్ (Convincing) ఒక ఏదో ఒక మెంటల్ బ్లాక్ (Mental block) ఉన్నది అతనికి. మానసికమైన ఒక డౌట్ (Doubt) ఉన్నది. ఓకే అందుకొరకు నమ్మడం లేదు. ఆయనకు ఆ సందేహాన్ని గనుక నివృత్తి చేయగలిగితే మ్ సత్యం దగ్గరికి యేసు దగ్గరికి వస్తాడేమో అని ఆశ. దీన్ని అపాలజిటిక్ మెథడ్ ఆఫ్ ఇవాంజిలిజం (Apologetic method of evangelism) అంటారు. ఓకే ఇట్లా ఇప్పుడు ఈ పంథాలో ఉన్నవాడు నేనే కాదు, ఇప్పుడు డాక్టర్ రవి జాకరియాస్ గారు ఉన్నారు. అవును. హీ ఈజ్ ఏ క్రిస్టియన్ అపాలజిస్ట్ (He is a Christian Apologist), వరల్డ్ ఫేమస్ అపాలజిస్ట్ ఆయన. ఏమన్నా ప్రశ్న అడిగితే ఉమ్ ఆ వెరీ రేర్లీ హీ సేస్ ఐ డోంట్ నో (Very rarely he says I don’t know) అనేది ఎప్పుడూ రాదు, ఎప్పుడైనా వస్తే కూడా యాజ్ ఏ జోక్ (As a joke) అంటాడు ఆయన. ఓకే అగైన్ హీ గివ్స్ వెరీ వాలిడ్ ఆన్సర్ (Again he gives very valid answer).
  • 🧱 కనుక ప్రశ్నలకు సమాధానం చెప్పే కృపావరం నాకు దేవుడు ఇచ్చాడు అనుకోండి. ఓకే వాళ్ళకి ఆ వరము లేదు. వైవిధ్యం ఉన్నా కూడా వాళ్ళు క్రీస్తు దాసుడే నేను క్రీస్తు దాసుడినే. అల్టిమేట్ గా వచ్చి వాళ్ళైనా నేనైనా “ప్రభు యేసు నందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటివారు రక్షింపబడతారు” అని చెప్తారు తప్ప వేరే దేవుళ్ళ గురించి అయితే చెప్పం కదా! సో డిఫరెన్స్ (Difference) ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ (Disturb) కానక్కర్లేదు. ఏ మతానికైనా ఏ ఫిలాసఫీ (Philosophy) కైనా ఇండిపెండెంట్ థింకింగ్ బ్రెయిన్ (Independent thinking brain) ప్రతి ఒక్క మానవునికి దేవుడు ఇచ్చాడు గనుక వైవిధ్యము కంపల్సరీగా (Compulsory) ఉంటుంది. ఓకే.
  • ✨ వైవిధ్యము అనేది మూల సిద్ధాంతాలలో ఉండకూడదు. ఓకే ఇప్పుడు సత్యం అనే దగ్గర వైవిధ్యం ఉండదు, సత్యం ఒక్కటే. ఓకే సత్యాన్ని మనము ప్రజలకు చేరవేసే విధానంలో వైవిధ్యం ఉండొచ్చు. అది విషయం. ఇప్పుడు యేసే రక్షకుడు, నా ద్వారా తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడని ఆయన చెప్పాడు, మరి ఎవరి వల్ల రక్షణ కలగదని అపోస్తలులు చెప్పారు. ఈ మాటలు ఇప్పుడు సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి అనే దగ్గర వైవిధ్యం. ఓకే అంతేగాని యేసయ్య రక్షకుడు అని నేను అనుకోవచ్చు, యేసు రక్షకుడు కాదని మీరు అనుకోవచ్చు అనేది కుదరదు. దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ వీ కెనాట్ డిఫర్, వీ కెనాట్ డీవియేట్, వీ కెనాట్ థింక్ అదర్ వైస్ (There are certain issues we cannot differ, we cannot deviate, we cannot think otherwise). మస్ట్ అండ్ షుడ్ (Must and should) గా అదే నమ్మాలి. ఇప్పుడు బైబిల్ ప్రామాణిక గ్రంథమా కాదా అంటే అక్కడ వైవిధ్యం ఏముంది? అక్కడ భిన్నాభిప్రాయం ఉంటే వాడు క్రైస్తవుడే కాదు. యేసు దేవుడా కాదా అనే దగ్గర భిన్నాభిప్రాయం ఉండకూడదు, ఉంటే వాడు క్రైస్తవుడే కాదు. ఓకే దట్ ఈజ్ ద పాయింట్ (That is the point). అందుచేత ఏదైతే మౌలిక సిద్ధాంతాలు ఉన్నాయో రక్షణ కొరకు ముఖ్యమైన సిద్ధాంతాలు, సత్యాలు అక్కడ మాత్రం చచ్చినట్టు ప్రతి ఒక్కడూ ఇదే నమ్మాలి. ఉమ్ కానీ ఈ సత్యమును ప్రజలకు తీసుకెళ్ళే విధానం ఎలాగా, పద్ధతి ఎలాగా, ఎలా చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది, ఎలా చెబితే ఎక్కువ మంది రెస్పాండ్ (Respond) అవుతారు, దేవుడు నన్ను ఎక్కువగా ప్రశంసిస్తాడు అనే దగ్గర ఒక్కొక్కడికి ఒకటి తోస్తుందన్నమాట. అక్కడ వైవిధ్యం ఉన్నది. ఓకే.

Detailed English Translation:

⛪ Question: Why is there so much diversity and contradiction in the teachings of various pastors? Some forbid questions while you encourage them. Who should believers follow, and why is there no uniformity?

  • Diversity is Natural: Uniformity is rare in any field—be it religion, art, or politics. Just as Hinduism has Shaivism and Vaishnavism, and Islam has Shia, Sunni, and Sufi sects, Christianity also has diverse perspectives. God did not create us as programmed robots; He gave each human an independent mind to perceive and respond to the world. Freedom of thought and liberty of expression are divine gifts.
  • The Method of Apologetics: Some pastors discourage questions because they might lack the answers or feel it distracts from devotion. However, I follow the scriptural mandate from 1 Peter 3:15, which tells us to be ready to give a logical reason for our hope to anyone who asks. I respect a person’s doubts. If someone doesn’t believe, they often have a valid mental block or a sincere question. If we can clear that doubt through logic and scripture (Apologetics), they may find the truth. Famous apologists like Ravi Zacharias have dedicated their lives to this.
  • Unity in Core Truths: While there is diversity in the ‘method’ of sharing the message, there can be no diversity in the ‘core truths.’ Basic doctrines—such as the divinity of Jesus, the authority of the Bible, and salvation through Christ alone—are non-negotiable. If someone differs on these fundamental points, they cannot be considered a Christian.
  • Difference in Presentation: Diversity exists in how we present the truth to make it understandable and appealing to different audiences. One pastor might focus on a certain aspect while I focus on another. As long as we both point to salvation through Jesus Christ, the difference in style is healthy and necessary to reach a diverse world.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram