28.Q: Leaving a Church due to False Doctrine (KSM 02) 🛤️

🛤️ ప్రశ్న: ఓకే సార్. అయితే ఇప్పుడు కొందరు విశ్వాసులు అడిగారు సార్, ఏంటంటే – ఇప్పుడు రంజిత్ ఓఫిర్ గారు చెప్పేది ఏంటంటే ఎవ్రీ సండే (Every Sunday) ప్రభువు బలలో పాలుపొందాలి అన్నారు ఒక సిద్ధాంతం తీసుకుంటే. మా నేను వెళ్తున్న చర్చి పాస్టర్ గారు ఎవ్రీ సండే ఇవ్వమంటే “మన పద్ధతి అదే కాదు, మన ముందున్నటువంటి పెద్దలందరూ.. నా గురువు అలానే ఆచరించాడు నేను అలానే చేస్తున్నా, నువ్వు కూడా అలాగే ఉండాలి” అని చెప్పాడు. ఈయనకు అది ఇష్టం లేదు, రంజిత్ ఓఫిర్ గారు చెప్పిందే రైట్ నాకు అది నమ్మాలనిపిస్తుంది, అది చేయాలనిపిస్తుంది. కానీ ఈయన దగ్గర నుంచి వెళ్దామంటే ఈయన వెళ్లనివ్వడు, వెళ్తే అసలు నేను విశ్వాసినే కాదన్నట్టు చూస్తాడు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా అక్కడి నుంచి వాళ్ళు ఏ విధమైన డెసిషన్ (Decision) తీసుకోవాలి? ఏ విధంగా ఉండాలి? (1:14:35)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 42s)

  • 🛤️ వెరీ సింపుల్. మనల్ని రక్తమిచ్చి, ప్రాణమిచ్చి తన సొంత సొత్తుగా చేసుకున్నటువంటి వ్యక్తి యేసునాథుడు. యేసు రక్షకుడే గానీ ఈ సంఘ కాపరి కాదు. యేసు మన యజమాని, యేసు మన సొంతదారు. అంతేగానీ ఈ సంఘ కాపరికి మనము వాళ్ళ ప్రాపర్టీ (Property) అయిపోలేదు. ఏ సంఘము ఏ దాసునికి, ఏ దైవజనుడికి సొంత హక్కు భుక్తం కాదు. “తాతల నాటి ఆస్తి నా భూమి మీరు ఎట్లా కబ్జా పెడతారు” అనేది మనం పోరాడినట్లు విశ్వాసుల విషయంలో.. ఇప్పుడు నా దగ్గర ఉన్న విశ్వాసులు నా సొత్తు కాదు, యేసు సొత్తు వాళ్ళు. మ్ గనుక ప్రతి విశ్వాసి అనుకోవాలి – “మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు దేవుని మహిమ పరచండి, మీరు మీ సొత్తు గారు” అన్నాడు.
  • ⚖️ కాపరికి లోబడవలసిందే. ఎక్స్‌క్యూస్ మీ (Excuse me), అది ఎప్పటి వరకు మనం లోబడాలి అంటే – లేఖనము నుండి ఆయన డిఫర్ (Differ) అవుతున్నాడు అనే పరిస్థితి రానంతవరకు. ఓకే. లేఖనం నాకు అర్థమైనట్లుగా, నా మనస్సాక్షి ఒప్పించబడినట్లుగా ఒక మార్గం కనపడుతుంది నాకు నడవటానికి. ఒక మార్గం.. దీన్ని ఆయన వద్దంటున్నాడు. నేను బతిమాలినా, బామాలి నా, కాళ్ళు వెళ్ళబడ్డా వినడం లేదు. ఇప్పుడు అయ్యగారిని గౌరవిస్తే గ్రంథానికి దూరం కావాల్సి వస్తుంది అనే పరిస్థితి వచ్చినప్పుడు – అయ్యగారు రక్షకుడు కాదు, యేసు మనకు రక్షకుడు, బైబిల్ ప్రామాణికం అని 100% షూర్ (Sure) గా అయ్యగారికి దండం పెట్టి “అయ్యా మీరు చెప్పే మార్గం నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, లేఖనమే ఇట్లా చెబుతోంది, మీకు మాకు ఇక గుడ్ బై (Good bye)” అని చెప్పి వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ విశ్వాసి దోషిగా నిలబడతాడు. ఓకే.
  • 🛡️ ఎందుకంటే అలా బయటికి వచ్చిన వాళ్ళే మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఈ భక్త్ సింగ్ గారు.. ఈ యొక్క సంస్కర్తలు అందరూ కూడా. ఇప్పుడు భక్త్ సింగ్ గారు ముందు ఫాక్స్ (Fox) గారితో ఉండేవారు. ఆ సైలస్ ఫాక్స్ గారు ఆయన బ్రదర్ అండ్ (Brethren) మేధావి, బ్రదర్ అండ్ బోధకుడు. అసలు ఆడవాళ్ళు ఎవరు అసలు సంఘంలో దగ్గకూడదు, తుమ్మకూడదు, మాట్లాడకూడదు, కొయ్యి అనకూడదు కయ్యి అనకూడదు.. అసలు ఏం మాట్లాడొద్దు, ప్రార్థన చేయొద్దు, పాట పాడొద్దు, స్త్రీ మౌనంగా ఉండాలి. భక్త్ సింగ్ గారు అక్కడ డిఫర్ (Differ) అయ్యారు. “అదేంటండి ఆడవాళ్ళు పుట్టిన పాపానికి ప్రభువులో ఆనందించే అవకాశమే లేదా? ఇది చాలా కఠోరంగా ఉన్నది” అని ఫాక్స్ గారు నేను వేరే సేవ చేసుకుంటాను అని బయటికి వచ్చి ఐ.సి.పి (I.C.P) అని పెట్టాడు ఆయన. దేవుడు దాన్ని దీవించాడు, లక్షల మంది రక్షణలోకి వచ్చారు. మరి తప్పు చేశాడా? మరి తప్పు చేయలేదు. మార్టిన్ లూథర్ తప్పు చేయలేదు.
  • ✨ గనుక ఇవాళ ఒక సత్యము నీకు అర్థమైన తర్వాత అయ్యగారికి భయపడి, సత్యానికి ద్రోహం చేసి అయ్యగారిని వెంబడిస్తున్నాము అంటే – అయ్యగారు నీకో విగ్రహం అయ్యాడు. లోక విగ్రహారాధికునివే. దేవునికి, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం ఇంకో మనిషికి ఇస్తే వాడే ఒక విగ్రహం. అవును. కనుక మనం పరలోకానికి ఎలాగ వెళ్తాం? ఇది సీరియస్ మేటర్ (Serious matter) అయిపోతుంది. అవును సార్.
  • 🧱 కనుక నేను నా సంఘస్తులకు కూడా చెప్తాను, నేను అభిషేకించిన సేవకునికి చెప్తా – ఎప్పుడైనా నేను వాక్యానికి భిన్నంగా నడిచినట్టు నీకు అనిపిస్తే, నువ్వు నా దృష్టికి తీసుకొస్తే, మ్ నేను మొండిగా వాదించి, బండగా వాదించి ఆ వితండవాదము చేసి, బైబిల్ లో కనబడుతున్న ప్రమాణాన్ని గుండె నిండా ఒప్పుకోకుండా తిరగబడి నేను మూర్ఖంగా ప్రవర్తిస్తే తప్పకుండా నువ్వు నన్ను వదిలేయాలి. వదిలేయకపోతే నువ్వు దేవుని ముందు దోషివి అవుతావు. కానీ వాక్యానికి భిన్నంగా నేను నడిచినట్టు నేను నిరూపించలేకపోతే, మ్ ఇంకేదో స్వార్థ కారణంతో, స్వార్థపూరిత ఉద్దేశంతో వెడితే నువ్వు దోషిగా అప్పుడు నిలబడతావు. అది నా బోధ. అందరూ వెళ్ళిపోతారు అనేది నాకేం బాధ లేదు. ఎవరు పోతారు అనేది కాదు, యేసయ్య వెళ్ళిపోకుండా ఉండాలి. అవును సార్ అవును. అది మన ఇంట్రెస్ట్ (Interest). అవును సార్. ఓకే సార్.

Detailed English Translation:

🛤️ Question: If a pastor’s tradition contradicts a believer’s understanding of the Word (e.g., weekly Holy Communion), and the pastor pressures them to conform rather than following the scripture, should the believer leave that church? Some feel trapped, fearing they will be labeled as ‘backslidden’ if they leave.

  • Whom do you belong to?: A believer is the ‘purchased possession’ of Jesus Christ, not the property of any pastor or denomination. No church or leader has an absolute claim over a soul. Every believer must realize they were bought at a price and belong solely to God.
  • Limits of Submission: Submission to a spiritual leader is valid only as long as that leader stays aligned with the Word of God. If a situation arises where following the pastor means distancing oneself from the Truth or violating one’s conscience rooted in scripture, then the choice is clear. One must choose God over man. To prioritize a man’s tradition over God’s commandment is a form of spiritual idolatry.
  • The Path of Reformers: Great spiritual reformers like Martin Luther, John Wesley, and Bakht Singh all faced this crossroad. Bakht Singh left his mentor Silas Fox when he found certain practices (like silencing women in church) to be too rigid and unscriptural. His departure led to a massive spiritual awakening. They didn’t sin by leaving; they obeyed a higher calling.
  • The Serious Consequence: If you suppress the Truth you have realized just to please a pastor, that pastor has become an ‘idol’ to you. This is a serious matter that affects your standing before Christ’s judgment seat. I tell my own followers: if I ever stubbornly deviate from the Bible, you must leave me. If you stay despite knowing the error, you become a partner in that error. Our ultimate goal is not to keep people in a building, but to ensure that they stay connected to Jesus Christ.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram