29.Q: Age of the Earth – Bible vs Science (KSM 02) 🌍

🌍 ప్రశ్న: సర్ ఇక్కడ బోయిని దుర్గేష్ అనబడిన ఒక బ్రదర్ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారు YouTube లో ఏమని అంటే – భూమి పుట్టి 6వేల సంవత్సరాలు అని బైబిల్ చెబితే, సైంటిస్టులు కొన్ని అవశేషాలను చూసి లక్షల సంవత్సరాలు అని చెబుతున్నారు. ఇది నిజమా అని అడుగుతున్నారు. బైబిల్ ప్రకారము 6000 సంవత్సరాలు అని చెప్పేసి ఉంది, అయితే సైంటిస్టులు కొంతమంది కొన్ని వస్తువులు దొరికినాయి అని చెప్పేసి వాటికి లక్షల ఏండ్ల చరిత్ర ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? (1:20:15)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 17s)

  • 🌍 అసలు భూమి పుట్టి 6000 ఏండ్లు అయింది అనేది బైబిల్ లో ఏ వచనం చెబుతుంది? ఇది నా ప్రశ్న. ఎక్కడ బైబిల్ లో చెప్పబడలేదు భూమి పుట్టి 6000 ఏండ్లు అయింది అని ఎక్కడ చెప్పబడలేదు. అలా విమర్శిస్తున్న వాళ్ళని నేను అడుగుతున్నా – బైబిల్ లో నాకు ఒక వచనం చూపండి, “మీ భూగ్రహము సృష్టింపబడి 6000 ఏండ్లు అయింది” అని. లేదు.
  • 📜 6000 అనే సంఖ్య ఎలా వచ్చింది అంటే – మానవజాతికి మూలపితరుడైన ఆదాము సృష్టింపబడి ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు, ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఏ కొడుకును కన్నాడు ఆయన, మళ్ళీ ఎన్నేళ్లు బ్రతికి ఇంకో కుమారుడిని ఎప్పుడు కన్నాడు.. వీళ్ళ యొక్క వంశావళిలో ఉన్నటువంటి ఈ మూల పురుషుల వయస్సులు, వాళ్ళ యొక్క జీవిత కాలాలన్నీ కూడితే.. ఆదాము నుండి అబ్రహాము దాకా 2000 సంవత్సరాల లెక్క తేలుతుంది. అబ్రహాము నుండి యేసుప్రభువు దాకా ఇంకో 2000 ఏండ్ల లెక్క తేలుతుంది. ఆదాము నుండి అబ్రహాము వరకు 2000, అబ్రహాము నుండి మోషే దాకా 500 ఏళ్ళు, మోషే నుండి దావీదు దాకా మళ్ళీ 500 ఏళ్ళు. దావీదు స్ట్రిక్ట్ (Strict) గా యేసుకు ముందు వెయ్యేళ్ళ క్రితం వాడు, బీసీ (BC) 1000 ఇయర్స్ (Years) నాటి వాడు దావీదు.
  • ⏳ ఈ మొత్తం లెక్క రఫ్ (Rough) గా చెప్పుకుంటే – ఆదాము నుండి అబ్రహాముకు 2000 ఏళ్ళు, అబ్రహాము నుండి యేసుకు 2000 ఏళ్ళు, యేసు తర్వాత ఇప్పుడు మనకు 2000 ఏళ్ళు. గనుక ఇప్పుడు మానవజాతి యొక్క చరిత్ర 6000 ఏళ్ళని చెప్తుంది బైబిల్. అయితే మానవజాతి ఈ భూమి మీద ఉండిన ఏకైక మొట్టమొదటి మానవజాతి అని లేక నివాసులని బైబిల్ లో ఎక్కడా లేదు. బైబిల్ చెబుతుంది – ఎన్నో యుగాలు గతించిపోయిన ఈ గ్రహం మీద.
  • 🧱 ఈ గ్రహం మీద ఆదికాండంలో దేవుడు చేసినటువంటి ఆ సృష్టి యాక్చువల్ (Actual) గా సృష్టి కాదు, పునః సృష్టి. ఓకే. ఎందుకంటే మరి యెషయా భక్తుడు చెబుతాడు – “ఆకాశములకు దేవుడైన యెహోవాయే ప్రభువు, ఆయన భూమిని కలుగజేసి స్థిరపరిచెను, ఆయన నిరాకారముగా ఉండునట్లు దానిని సృష్టింపలేదు, నివాస యోగ్యముగా ఉండునట్లు భూమిని చేశాడు.” కానీ ఆదికాండం ఒకటి ఒకటిలోకి, ఒకటి రెండులోకి వస్తేనే – “భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను.” దేవుడు అలాగ భూమిని నిరాకారంగా చేయలేదు. కానీ ఆదికాండం ఒకటిలో అలాగ ఉంది అది. అంటే నివాస యోగ్యముగా చేయబడిన భూమి నిరాకారముగా, శూన్యంగా మారిపోయిన ఒక దురదృష్టకరమైన ఒక ఘోరమైనటువంటి ప్రళయం ఏదో జరిగింది. ఆ ప్రళయం తర్వాత మళ్ళీ భూమిని బాగు చేసి, మళ్ళీ నివాసులతో నింపడమే ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ కథనము, ఆ చరిత్ర. ఓకే.
  • 🧪 మరి ఆ ప్రళయం రాకముందు ఎన్ని లక్షల ఏళ్ళు, ఎన్ని కోట్ల ఏళ్ళు మనకు తెలియదు. అందుచేత బైబిలు భూమికి ఉన్న వయసు 6000 ఏళ్ళని చెప్పిందని ఎవరు చెప్పినా అదంతా కూడా హాఫ్ నాలెడ్జ్ (Half knowledge), మిడిమిడి జ్ఞానమే తప్ప.. బైబిల్ ఎప్పుడూ కూడా ఒక్క అన్ సైంటిఫిక్ (Unscientific), హిస్టారికల్ (Historical) గా ప్రూవ్ (Prove) చేయలేనటువంటి శాస్త్ర విరుద్ధమైన, చరిత్ర విరుద్ధమైన విషయం ఒక్కటి కూడా చెప్పలేదు. బైబిల్ సైంటిఫిక్ రీసెర్చ్ (Scientific research) లు ఎన్ని జరిగి విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతుందో, బైబిల్ సత్యమని అంతగా నిరూపించబడుతా ఉంది. అందుచేత బైబిల్ గూర్చి నేను అతిశయిస్తున్నాను.
  • 🧪 వాళ్లకు దొరికిన లక్షల ఏళ్ళ కిందటి శిలాజములు, వాటిని ఫాసిల్స్ (Fossils) అంటారు. ఓకే. ఆ అప్పటి జీవరాశుల ఎముకలు అవి. అది వెనకట ఉన్న యుగాల్లో ప్రాణికోటి. వెరీ సింపుల్. యాజ్ సింపుల్ యాజ్ దట్ (As simple as that). “యుగముల సమాప్తి యందు యేసుప్రభువు వచ్చాడు” అని హెబ్రీ పత్రిక తొమ్మిది 26లో చెప్తాడు. అంటే యుగములకు అంతం ఉంది. లాస్ట్ (Last) యుగములో యేసుప్రభువు అవతారం జరిగింది. అంతకుముందు యుగాలు ఏం జరిగిందో మనకు తెలీదు. ఓకే.

Detailed English Translation:

🌍 Question: A brother named Durgesh asked on YouTube: “The Bible says the Earth is only 6,000 years old, but scientists claim it is millions of years old based on fossils. Is this true? How do we understand this contradiction?”

  • A Misunderstanding of the Timeline: First of all, the Bible nowhere states that the Earth as a planet was created only 6,000 years ago. Those who criticize the Bible on this ground often have a superficial understanding of the text.
  • Human History vs. Planetary Age: The 6,000-year figure is derived by totaling the ages and genealogies from Adam to Abraham (approx. 2,000 years), Abraham to Jesus (approx. 2,000 years), and Jesus to the present day (approx. 2,000 years). This is the history of the current human race, not the age of the Earth.
  • The Concept of ‘Re-creation’: According to Isaiah, God created the Earth to be inhabited, not to be formless and void. However, Genesis 1:2 describes the Earth as “formless and empty.” This suggests that a massive, catastrophic event or judgment occurred between Genesis 1:1 and 1:2, causing a perfectly created world to become a wasteland. The six days of creation in Genesis are actually a process of ‘re-creation’ or restoration of a ruined planet for new inhabitants (Adam’s race).
  • Harmony with Science: The millions of years scientists refer to and the fossils they find belong to those previous eons and cycles of life that existed before the current human era. The Bible refers to the “end of the ages” (Hebrews 9:26) in relation to Christ, implying there were multiple ages before Him. As scientific research advances, it only confirms the depth of biblical truth. There is no conflict between the Bible and scientific discoveries regarding the Earth’s antiquity.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram