💎 ప్రశ్న: సార్ నా ప్రశ్న – న్యూమరాలజీ (Numerology) ప్రకారం మన నేమ్స్ (Names) లో లెటర్స్ (Letters) మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అలాగే న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ (Astrology), ఈ రెండిటికీ సంబంధం ఉందా? వీటి ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది? క్రైస్తవులుగా మనకు ఏమాత్రం ఆచరణీయం? ఆస్ట్రాలజీలో విగ్రహారాధనకు సంబంధం ఉంది, ఏవో కలర్స్ (Colors), స్టోన్స్ (Stones), రింగ్స్ (Rings) ధరించుట అనుసరణీయమేనా? వీటిపై దయతో క్లారిటీ ఇవ్వగలరు. (1:30:16)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 42s)
- 💎 ఇప్పుడు చాలా వేరే వేరే అంశాల గురించి అడిగారు, అన్ని ఒకేసారి చెప్పలేము కానీ నేను చెప్తున్నాను – ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ (Different issues) ఇవి. మొట్టమొదటి విషయము న్యూమరాలజీ అనేది ఒకటి ఉంది, గ్రాఫాలజీ (Graphology) అనేది ఒకటి ఉంది – అంటే చేతి వ్రాత మీద ఆధారపడి మన యొక్క జీవిత స్థితిగతులు ఉంటాయి అనేది గ్రాఫాలజీ. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ.. ఈ గ్రహముల స్థితిని బట్టి వాటి అలైన్మెంట్ (Alignment) ను బట్టి మన జీవిత స్థితిగతులు ప్రభావితం అవుతాయి అనేది ఆస్ట్రాలజీ. ఆ తర్వాత జెమాలజీ (Gemology) అనేది కూడా ఒకటి ఉంది – ఈ ప్రశస్త రత్న స్టోన్స్, విలువైన రత్నాల యొక్క శాస్త్రం ఇది ఉంది.
- ⚖️ నేను ఒకటే చెప్తున్నాను – జెమాలజీ గాని, గ్రాఫాలజీ గాని, ఆస్ట్రాలజీ గాని, ఆ తర్వాత గ్రాఫాలజీ గాని, న్యూమరాలజీ గాని, న్యూమరిక్స్.. న్యూమరాలజీ గాని మనిషికి నరకము నుండి రక్షణ కల్పించలేవు. ఇవన్నీ కూడా ఈ భూమి మీద మనం బ్రతికే 30, 40, 50, 60, 70, 100 మ్యాక్సిమమ్ (Maximum) ఇన్ని సంవత్సరాల ఆయుష్కాలంలో సమాజంలో మన మీద వ్యతిరేకత తగ్గడానికి కొంచెం ఒక 5% తేడా తీసుకొస్తే అంతే.
- 🏠 ఓకే ఆ ఇప్పుడు వాస్తు ఉంది – ఈ గుమ్మం ఇటు కాదు అటు పెడితే కొంచెం ప్రశాంతత ఉంటుంది దీనితో అంటాడు. అటున్నా ఇటున్నా వీడు యేసు రక్తం లేకుండా పరలోకానికి అయితే వెళ్ళడు. వీడు అటు మొహం పెట్టినా నరకానికి పోతాడు, ఇటు పెట్టినా నరకానికి పోతాడు యేసు రక్తాన్ని ఆశ్రయించకపోతే. ఈ రత్నాలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా యేసు రక్తమును ఆశ్రయించకపోతే వీడు పోయేది నరకానికే. ఎందుకంటే యేసుప్రభువు చెప్పాడు – “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను, నా ద్వారా తప్ప ఎవడూ పరలోక రాజ్యానికి రాడు, నేనే మార్గమును” అంటే నేను మాత్రమే మార్గము అని ఆ పెద్దాయన చెప్పాడు. ఇంకెవరూ ఆ మాట చెప్పలేదు.
- ✨ మిగతా దేవతలందరూ చాలా యదార్థవంతులు – “ఎవరినైనా మొక్కొచ్చు పర్లేదు” అన్నారు. “ఎవరిని మొక్కినా నాకే చెందుతుందిలే పర్లేదు” అన్నాడు. అంటే అర్థం ఏంటి? “నేనే మార్గము” అని యేసు చెప్పాడు, “నేను ఒక్కడినే ఏం కాదులే” అన్నాడు ఇంకొక ఆయన. మరి కళ్ళు ఉన్నోడికి తెలిసిపోతుంది సత్యం. అవును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆశ్రయిస్తేనేమో పరలోకం గ్యారెంటీ (Guarantee), ఆశ్రయించకపోతే నరకము గ్యారెంటీ. ఇది క్రైస్తవుని సందేశం, సువార్త.
- 🧱 ఇకపోతే మరి రాళ్ళు పెట్టుకుంటే, లేకపోతే వాస్తు ప్రకారం అనుగుణంగా మార్చుకుంటే, లేకపోతే గ్రాఫాలజీ పాటిస్తే, న్యూమరాలజీ పాటిస్తే జీవితంలో ఇప్పటి జీవితకాలంలో కొన్ని స్థితిగతులు కొంచెం అనుకూలం, కొంచెం ప్రతికూలం. ఓకే అంతే. అంటే ఇప్పుడు ఎదురు గాలికి సైకిల్ తొక్కితే కష్టపడి తొక్కుతాం. అవును. అలా కాకుండా పల్లెంలో తొక్కితే కొంచెం ఈజీ (Easy) గా తొక్కుతాం. అదే స్లోప్ (Slope) లో తొక్కుతే మరీ ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ మాత్రం డిఫరెన్స్ (Difference) మన జీవిత గమనంలో ఉంటుంది తప్ప నిత్యత్వానికి ఏ మేలు గాని, ఏ కీడు గాని ఏ శాస్త్రము చేయదు అంతే. యేసు రక్తమే నిత్యత్వంలో మనకు మేలు చేస్తుంది. బ్రదర్ మీకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాము.
Detailed English Translation:
💎 Question: What is the significance of changing name spellings according to Numerology? Do Numerology and Astrology affect human lives, and is it appropriate for Christians to use colored stones, rings, or follow Vastu?
- Defining the Fields: These are various fields of study—Graphology deals with handwriting, Numerology with numbers, Astrology with planetary alignments, and Gemology with the influence of precious stones. While these are distinct ‘sciences’ or beliefs, they all share a common limitation.
- The 5% Difference: Practices like Vastu or Numerology may offer a minor shift (perhaps 5%) in one’s psychological comfort or earthly situation, similar to the difference between cycling against the wind versus cycling downhill. They might make your temporary earthly journey feel a bit smoother or rougher.
- The Question of Eternity: No amount of name-changing, stone-wearing, or architectural adjustments can save a soul from Hell or grant entrance into Heaven. Jesus Christ clearly stated, “I am the Way… no one comes to the Father except through Me.” While other philosophies might suggest that all paths lead to the same destination, Jesus claimed exclusivity in salvation.
- The Ultimate Remedy: Whether your house faces north or south, and whether you wear a ruby or an emerald, if you haven’t sought refuge in the blood of Jesus Christ, your eternal destination remains unchanged. These earthly ‘remedies’ are strictly for the 70–100 years of life on Earth. Only the blood of Jesus Christ has the power to affect your status in eternity. A Christian’s focus should be on the Savior who secured their eternal future, rather than temporary earthly fixes.
