❓ ప్రశ్న: గుడివాడ నుండి పాస్టర్ డేవిడ్ గారు ఒక ప్రశ్న అడిగారు అయ్యగారు – యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనములో మరి ఈ విధముగా ఉంది ఏమని అంటే: ‘ఆయన శిష్యులు – బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా? వీని కన్నవారా? అని ఆయనను అడగగా’ అనేటువంటి మాట ఉంది అయ్యగారు. దీనికి అర్థం ఏమిటి? దీని యొక్క ఆ ఉద్దేశం ఏమిటి? (0:02:34)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 25s)
- 🦯 ప్రశ్నలోని విచిత్రం: ఈ ప్రశ్న మీరు అడగడం చాలా విచిత్రము ఎందుకంటే కోయిన్సిడెన్స్ (Coincidence), ఈరోజు నన్ను ఇంకా ఇద్దరు ఈ ప్రశ్న అడిగారు. సేమ్ క్వశ్చన్ (Same question). ఆ అలాగే నర్సీపట్నంలో పాస్టర్ డేవిడ్ గారు అని ఉన్నారు ఆయన కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఇంకొక సహోదరి కూడా ఇదే ప్రశ్న అడిగారు. వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేసిరి? వీడు పాపము చేసినందుకు గుడ్డివాడై పుట్టాడా? వీడిని కన్నవారు పాపం చేసినందుకు వీడు గుడ్డివాడై పుట్టాడా? ఇది వాళ్ళ యొక్క ప్రశ్న.
- 👪 తల్లిదండ్రుల పాపమా?: ఒకవేళ వీడిని కన్నవారు పాపము చేసినందుకు వీడు గుడ్డివాడై పుట్టాడు అనే ఒక కాన్సెప్ట్ (Concept) ని యాక్సెప్ట్ (Accept) చేస్తే – తల్లిదండ్రులు చేసిన పాపానికి వాళ్ళకు దేవుడు విధించిన శిక్షగా ఒక కళ్ళు లేని కొడుకు పుట్టాడు, గుడ్డివాడు కొడుకు పుట్టాడు, వాళ్ళ జీవితాంతం బాధపడతారు. వాడిని పెంచలేక, సెటిల్ చేయలేక అందరి పిల్లలతో సమానంగా తమ కొడుకు ఆడుకోలేక ఉండడం తల్లిదండ్రులకి ఎంతో గొప్ప గాయం. ఒకవేళ వాళ్ళను దేవుడు శిక్షించడానికి ఇట్లాంటి కొడుకుని ఇచ్చి ఉండవచ్చు గానీ కాన్సెప్ట్.
- 🕉️ పూర్వజన్మ కర్మఫలమా?: కానీ వీడు పాపము చేశాడా? వీడు గుడ్డివాడై పుట్టడానికి కారణము వీడి సొంత పాపమేనా? అంటే పాపమునకు కారణంగా వీడు గుడ్డితనాన్ని పెట్టుకొని పుట్టాడు అంటే ఆ పాపము వీడు పుట్టక ముందు చేసిందై ఉండాలి. పుట్టకముందు చేసిందై ఉండాలి అంటే ముందే ఎప్పుడో పాపం చేసినందుకు ఈ స్థితిలో పుట్టాడు అంటే పూర్వజన్మ పాపం, పూర్వజన్మ కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు అనే హిందూ మత సిద్ధాంతానికి ఈ ప్రశ్న చాలా దగ్గరగా లేక సపోర్ట్ (Support) గా ఉంటుంది.
- 📖 బైబిల్ దృక్పథం – పునర్జన్మ లేదు: అలాంటి ప్రశ్న అడిగినప్పుడు ఏసుప్రభు వారైతే పునర్జన్మ సిద్ధాంతము, మరి జనన మరణ పరంపర ఏదైతే ఉన్నదో హిందూ మత సిద్ధాంతం ప్రకారం, కొన్ని తూర్పు దేశాల మత సిద్ధాంతాల ప్రకారం – ఈ పునరపి జననం పునరపి మరణం అనే సిద్ధాంతాన్ని యేసుప్రభువు అయితే సపోర్ట్ (Support) చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే లేఖనం ఒప్పుకోవడం లేదు అది. హెబ్రీ పత్రిక మరి ఆ తొమ్మిదవ అధ్యాయము 26, 27 వచనాల్లో – “మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను అటు తర్వాత తీర్పు జరుగును.” అంటే మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం అనే జనన మరణ చక్ర పరిభ్రమను బైబిల్ ఒప్పుకోవట్లేదు. దేర్ ఈజ్ నో రీఇన్కార్నేషన్ (There is no reincarnation), పునర్జన్మలు బైబిల్ ప్రకారం లేవు.
- 🧱 యేసు సమాధానం: గనుక బైబిల్ దేవుని వాక్యము, యేసే దేవుని వాక్యం గనుక బైబిల్ పునర్జన్మను ఒప్పుకోనప్పుడు, పూర్వజన్మలను ఒప్పుకోనప్పుడు.. వాకమై ఉన్న యేసు పూర్వజన్మ కర్మ ఫలమును ఇప్పుడు అనుభవించడం అనే కాన్సెప్ట్ ను ఒప్పుకోవడానికి వీలు లేదు, అవుట్ రైట్ (Outright) గా యేసు ఖండించి తీరాలి. ఈ ప్రశ్న అడిగిన ముగ్గురు, ఇంకా లక్షలాది మంది మనసులో ఉండే సందేహం ఏంటంటే – “వీడైనను” అని యేసుప్రభువు ఎందుకు అన్నాడు? “వీడైనను పాపము చేయలేదు వీడిని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు కనపరచుటకై వీడు గుడ్డివాడిగా పుట్టాడు.”
- 🔍 స్పష్టీకరణ: అంటే ఏసుప్రభువు కూడా ఒప్పుకున్నట్టు అయిపోయింది కదా? వీడు పుట్టకముందు జరిగిన పాపం, వీడు పుట్టకముందు చేసిన పాపం దీనికి కారణం కాదు అని అంటే – అసలు ఆ కాన్సెప్టే తప్పురా, వీడు పుట్టక ముందు పాపం ఎలా చేస్తాడో, అంతకుముందు వీడు లేనే లేడు కదా! ఇదే వీని ఉనికికి ఆరంభము, ఇది వీని మొదటి పుట్టుక, ఇదే ఆఖరి పుట్టుక. కనుక పుట్టకముందు వీడు పాపం చేయడం అనే పాసిబిలిటీ (Possibility) లేదు అనాలి యేసుప్రభువు వారు. వాళ్ళు అడిగిన వాళ్ళు జ్ఞానము లేక అడిగారు, యేసుని చిక్కుపరచడానికి అడిగారు – వీడు పాపం చేసినా వీడిని కన్నవారు పాపం చేసినా అని.
- ✨ అంగవైకల్యం – దేవుని మహిమ: దానికి ఇక్కడ విషయం ఏంటంటే – వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు గానీ దేవుని క్రియలు వీరి యందు కనపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడని యేసుప్రభువు చెప్పాడు. దానికి అర్థము అసలు మనుషులు వికలాంగులుగా పుట్టడానికి గాని కొన్ని లోపములతో పుట్టడానికి గాని కారణం ఎవరి పాపము కాదు అనే వాస్తవమే చెబుతున్నాడు ఆయన. ఎవరో పాపం చేసినందుకు పాపానికి శిక్షగా వికలాంగులుగా పుడతారనే సిద్ధాంతం తప్పు. ఆ అంగవైకల్యం ద్వారా దేవుడు తన మహిమను చూపిస్తాడు, ఆ అంగవైకల్యం ద్వారా దేవుడు తన యొక్క శక్తిని ప్రదర్శిస్తాడు, కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఆ అంగవైకల్యాన్ని కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు అంతేగానీ ఏదో ఒక పాపం జరిగింది దానికి శిక్షగానే వికలాంగులు పుడతారనే సిద్ధాంతం తప్పు అని ఏసుప్రభువు చెబుతున్నాడు.
- ⚖️ లేఖన ప్రాధాన్యత: ఆయన వీడైనా వీడి కన్నవారైనా పాపం చేయలేదు అని అన్నంత మాత్రాన ఆయన అంతకుముందు వీడు పాపం చేయడానికి అవకాశం ఉన్నది అని చెప్పినట్టు కదా అని అంత సూక్ష్మంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఆయన అన్యాపదేశంగా పూర్వజన్మను సమర్థించిన వాడై ఉంటే.. యాజ్ బైబిల్ బిలీవర్స్ (As Bible believers) మన యొక్క కాన్సెప్ట్ (Concept) ఏంటంటే, మన యొక్క అవగాహన ఏంటంటే – వి ఆర్ నాట్ ద క్రిటిక్స్ ఆఫ్ ద బైబిల్ (We are not the critics of the Bible). ఏ వచనానికైనా మీరు లాజిక్ (Logic) ఉపయోగించి ఏదో ఒక నిర్ణయానికి వస్తే బైబిల్ యొక్క డైరెక్ట్ స్టేట్మెంట్ (Direct statement) దాన్ని ఖండిస్తే నీ అభిప్రాయం నువ్వు మార్చుకోవాలి. బైబిల్ డైరెక్ట్ స్టేట్మెంట్ కు వ్యతిరేకంగా నీవు అనుకున్నదే తప్పవుతుంది, బైబిల్ స్టేట్మెంట్ రైట్ అవుతుంది.
- 🛤️ ముగింపు: సో బికాజ్ ఆఫ్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ హెబ్రూస్ నైన్త్ చాప్టర్ లాస్ట్ వర్సెస్ (Because of what the Bible says in Hebrews 9th chapter last verses) – ముందు జన్మ తర్వాత జన్మ అనే సిద్ధాంతం అసలు అవకాశమే లేదని బైబిల్ కొట్టి పారేసింది గనుక యేసు మాటలకు ఆ అర్థం సరికాదు. ఏం అర్థం అంటే – పాపానికి శిక్షగా ఎవరిదైనా గాని వికలాంగులు పుట్టరు. ఆ వికలాంగుల యొక్క అంగవైకల్యం ద్వారా కూడా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి అనుకున్నాడు గనుకనే అలాంటి జన్మను ఆయన అలవ్ (Allow) చేస్తాడు అని అర్థం చేసుకోవాలి.
Detailed English Translation:
❓ Question: Pastor David from Gudivada asks about John 9:2: ‘His disciples asked him, “Rabbi, who sinned, this man or his parents, that he was born blind?”‘ What is the meaning and intention behind this question?
- The Theology of Suffering: This question reflects a common belief that physical suffering or birth defects are direct punishments for sin. If the parents sinned, the child’s blindness would be their lifelong agony. If the man himself sinned to be born blind, it implies he committed a sin before birth—a concept closely related to the Hindu doctrine of ‘Karma’ and ‘Reincarnation’ (reaping the fruits of a previous life).
- Biblical Stance on Reincarnation: Jesus does not support the idea of reincarnation. Hebrews 9:27 clearly states that “man is destined to die once, and after that to face judgment.” There is no cycle of multiple births and deaths in Biblical theology. Therefore, the possibility of the man sinning in a ‘previous life’ is non-existent.
- Refuting the Karmic Link: When Jesus said, “Neither this man nor his parents sinned,” He was not validating a previous existence. He was outright dismissing the idea that disability is a divine punishment for specific sins. The man didn’t exist before this birth, so he couldn’t have sinned.
- Purpose over Punishment: Jesus explains that the man was born blind “so that the works of God might be displayed in him.” Disabilities are not always divine strikes; they can be platforms for God to demonstrate His power, teach profound lessons, or reveal His glory through healing and restoration.
- The Rule of Interpretation: As Bible believers, we must interpret ambiguous passages through the lens of clear, direct statements. Since the direct teaching of the Bible rejects reincarnation, we cannot twist Jesus’ words to support it. The man’s condition was an opportunity for a divine miracle, proving that God can turn any human limitation into a manifestation of His grace.
