❓ ప్రశ్న: దయ్యాలు మరియు క్షుద్ర శక్తుల విషయంలో ఇతర మతాల వారు చేసే వాదనలపై మీ స్పందన ఏమిటి? ఇది అసలు జనాల్ని మోసం చేయడమే తప్ప ఇంకేమీ లేదని జన విజ్ఞాన వేదిక వారు విమర్శిస్తున్నారు కదా! దీని మీద మీ అభిప్రాయం ఏంటి? (0:13:16)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 04s)
- 👺 నాస్తికవాదం – ఆస్తికవాదం: జన విజ్ఞాన వేదిక.. నా జ్ఞాపకం సరైతే వాళ్ళు ఆంటాగనిస్ట్స్ (Antagonists) ఓ లేకపోతే నాస్తికులు అయి ఉంటారు. దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ (They don’t believe in God’s existence) అనుకుంటాను. ఒకవేళ దేవుని ఉనికిని అవుట్రైట్ (Outright) గా కాదు అని చెప్పకపోయినా, అవునని కూడా చెప్పలేము, అవునో కాదో ఇదమిద్ధంగా తేల్చలేమనే ఒక ఐడియాలజీ (Ideology) లో వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు జనరల్ (General) గా అసలు దేవుని పేరిట ఏ మహిమ, ఏ మహత్తు, ఏ మహత్ కార్యము జరిగింది అని చెప్పినా వాళ్ళు డెఫినెట్ (Definite) గా అపోజ్ (Oppose) చేస్తారు. సో అది వాళ్ళ యొక్క నార్మల్ ఆక్టివిటీ (Normal activity).
- 🤝 విడ్డూరమైన పొత్తు: కానీ వాళ్ళతో కొంతమంది హిందూ సోదరులు కూడా చేతులు కలిపి.. మరి హిందువులు అంటే ఆస్తికులు, వాళ్ళు అజ్ఞేయవాదులు కాదు లేకపోతే నాస్తికులు కాదు. హిందువులు అంటే వాళ్ళు కరుడుగట్టిన ఆస్తికులు. “దేవుడు ఉన్నాడు” అని కరుడుగట్టిన ఆస్తికులు అని ఎందుకన్నానంటే – భాగవతం ప్రకారం ఆ హిరణ్యకశిపునితో ఆ బాలభక్త ప్రహ్లాదుడు అంటాడు – “ఎందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందే గలడు” అని. గనుక దేవుడు అంతటా ఉన్నాడు అని నమ్మేటటువంటి ఒక భక్తి కలిగే హిందువు ఈ నాస్తిక సమాజంతో కలిసి క్రైస్తవుల మీద దాడి చేయడం, విమర్శ చేయడం చాలా చాలా విడ్డూరమైనటువంటి సంగతి. ఒక భక్తి కలిగిన హిందువు నాస్తికులతో కలిసి క్రైస్తవుల మీద దాడి చేయడం కాదు, ముందు “దేవుడు ఉన్నాడురా” అని వాళ్ళని ఒప్పించాలి. దేవుడు ఉన్నాడు అని నాస్తికులను, అజ్ఞేయవాదులను ఒప్పించడం మానేసి క్రైస్తవుల మీద దాడి చేయడానికి నాస్తికుడైనా మాకు ఓకే, మాకు సహకారం అని చెప్పి వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నారు.
- 🚫 పక్షపాత విమర్శలు: ఈ ముగ్గురు కలిసిన ఈ ముఠాను నేను ప్రశ్నిస్తున్నాను – మీరు దయ్యాలు వెళ్లగొడతామన్నటువంటి పాస్టర్లను విమర్శిస్తున్నారు, అలాగే హిందూ భూత వైద్యులను, అలాగే మరి ఇస్లాంలో ఉన్నటువంటి భూత వైద్యులను మీరు ఎందుకు ప్రశ్నించలేదు? దయ్యాలు ఉన్నాయా, దయ్యాలను వెళ్లగొట్టడం సాధ్యమా అని మీరు అంటుంటే మరి ఇదే ప్రశ్న వాళ్ళని ఎందుకు అడగలేదు? హిందువులు భూత వైద్యం చేస్తేనేమో రైటు, ముస్లింలు మంత్రాలు చేసి దయ్యాలు వెళ్లగొడితే రైటు, క్రైస్తవులే మోసం చేస్తున్నారు అనడం అనేది ఒక అసూయతో కూడుకున్న ద్వేషపూరితమైనటువంటి ఆ ప్రచారం.
- 📖 బైబిల్ సత్యం: నేనైతే నమ్ముతున్న బైబిల్ ప్రకారం దేవుడు ఉన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయినటువంటి దేవదూతలు ఇప్పుడు దయ్యాలై తిరుగుతున్నారు. వాళ్ళు మనుషులను ఆవహించటం అనేది ఉన్నది, ఆవహించినప్పుడు మనుషులు విపరీత ప్రవర్తన ప్రవర్తించడం అనేది ఉన్నది. యేసు ప్రభువు నామంలో గద్దించినప్పుడు ఆ దయ్యాలు వెళ్ళిపోవడం అనేది ఉన్నది, ఇది బైబిల్ లో ఉన్న మాట. సో నేను నమ్ముతున్నాను బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్ (Bible believing Christian) నేను.
- 📺 లైవ్ షోల హాస్యాస్పదం: స్టూడియోలో వాళ్ళని లైవ్ (Live) గా ఇప్పుడు దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చి వెళ్లగొట్టు అని చెప్పడం ఇదంతా హాస్యాస్పదమైన విషయం. అలాగైతే మరి మీ పురాణాల్లో రాయబడ్డ సంగతులన్నిటికీ కూడా మీరు లైవ్ షో (Live show) పెట్టాలి. ఇప్పుడు అగస్త్య మహర్షి సముద్రం అంతా మింగేసాడని ఉన్నది అది లైవ్ షో పెట్టండి. గాంధారి తనకు పుట్టినటువంటి ఆ పిండాన్ని ఆ వేదవ్యాసుల వారు దాన్ని నూరు ముక్కలుగా కోసి నూరు కుండల్లో పెడితే కౌరవులు నూరు మంది పుట్టారని.. అటువంటివన్నీ లైవ్ షో పెట్టాలి. సావిత్రి భర్త ప్రాణాన్ని యమధర్మరాజు దగ్గర నుండి మళ్ళీ తెచ్చుకుంటుంది, మరి ఇది కూడా లైవ్ షో పెట్టండి. ఇవి మత విశ్వాసాలు, టీవీలో చూపెట్టి లైవ్ షో చూపెట్టడం అది తెలివి తక్కువ పని.
Detailed English Translation:
❓ Question: What is your response to groups like Jana Vignana Vedika who claim that castigating demons is a fraud? They challenge religious leaders to prove these spiritual acts scientifically.
- The Rationalist Agenda: Groups like Jana Vignana Vedika are typically atheists or agnostics who deny or doubt the existence of God. Naturally, they oppose any claim of divine miracles or spiritual warfare. That is their expected stance.
- An Ironical Alliance: What is surprising is seeing devout Hindus join forces with atheists to attack Christians. A true believer in God, like Prahlada who saw God everywhere, should be convincing the atheist that God exists, rather than partnering with them to mock another’s faith. This alliance is purely driven by a common opposition to Christianity.
- Selective Criticism: Why are these critics silent about Hindu exorcists (Bhuta Vaidyas) or Islamic healers who also claim to cast out spirits? If they believe exorcism is a fraud, they should challenge all religions equally. Singling out Christian pastors exposes their bias and communal jealousy.
- The Reality of the Spiritual Realm: As a Bible-believing Christian, I believe in the existence of fallen angels (demons) who rebelled against God. They can influence or possess humans, leading to erratic behavior. The Bible records Jesus casting out such spirits, and that power continues in His name today.
- The Absurdity of ‘Live Proof’: Demanding a ‘Live Show’ of an exorcism in a TV studio is ridiculous. If faith is to be proven by live demonstrations, then every mythological event—like Sage Agastya drinking the ocean or Savitri bringing her husband back from the god of death—should also be demonstrated live. Spiritual matters are matters of faith, not studio performances.
