❓ ప్రశ్న: యెప్త తన కుమార్తెను నిజంగానే దహనబలిగా అర్పించాడా? దేవుడు నరబలిని కోరుకుంటాడా? యెప్త కుమార్తెను దహనబలిగా తన తండ్రి అర్పించాడు అనేటువంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు కదా! అర్పించారని రెండు విధాలు చెప్పారు, మాట్లాడుకున్నారు. దహనబలిగా అర్పించాడా లేదా అనేది ఒక విషయం. అర్పిస్తే అది ఎలా జరిగింది? దేవుడు యాక్సెప్ట్ (Accept) చేయలేదని నేను కూడా నమ్ముతున్నాను. అంటే అర్పణ ఎలా జరిగింది? ఆ అర్పణను దేవుడు అంగీకరించాడా అనేది మీ ప్రశ్న. (0:20:25)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (12m 20s)
- 🩸 నేపథ్యం: బ్రదర్, ఇప్పుడు ఈ యెప్త తన కుమార్తెను బలిగా అర్పించాడు అనే సంగతి అసలు ఎందుకు వచ్చింది? నేపథ్యం ఏంటంటే – అతను తొందరపాటుగా ఒక ప్రమాణం, మొక్కుబడి దేవునికి చేశాడు. “నేను యుద్ధంలో జయము పొంది తిరిగి విజయవంతంగా క్షేమంగా ఇంటికి వస్తే, నాకు ఎదురొచ్చేది ఏదైనా దానిని నీకు దహనబలిగా అర్పిస్తాను” అని మొక్కుకొని వెళ్ళాడు. ఆయన తిరిగి యుద్ధంలో జయం పొంది వచ్చేటప్పుడు, నాన్నగారు జయం పొందాలని ఈ అమాయకురాలు యెప్త కుమార్తె ఆయనను ఎదుర్కోవాలని వచ్చింది. ఈయన చేసుకున్న మొక్కుబడి ఈమెకు తెలియదు. మరి ఏది ఎదురు వస్తే అంటే ఒక ఎద్దో, ఆవో, మేకనో ఏదో అనుకున్నాడు కానీ, నా కూతురు వస్తది అనే సంగతి నేను కూడా అనుకోలేదు అనే సంగతి అతనికి షాక్ (Shock).
- 😭 తప్పని మొక్కుబడి: కానీ అతను మరి తప్పదు అనే సంగతి, నా కూతురిని బలిగా అర్పించక తప్పదు. 35వ వచనంలో – ఈమె అతనికి ఓన్లీ చైల్డ్ (Only child), ఈమె కాక ఇంకా కూతురు గాని కొడుకు గాని యెప్తకు లేరు. ఓన్లీ చైల్డ్. అప్పుడు అంటాడు 35లో – “అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయువారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుకతీయలేను” అనగా.. ఆమె “నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయల్దేరిన మాట చొప్పున నాకు చేయుము” అంటే దహనబలి కావడానికి ఆమె కూడా ఒప్పుకున్నది. దేవునికి మాట ఇచ్చావు కదా నాన్న నువ్వు మాట తప్పొద్దని.
- 🏔️ కన్యాత్వపు ప్రలాపం: అయితే కన్యాత్వం అనేది నేను పోగొట్టుకోకుండానే, అసలు స్త్రీ జన్మ ఎత్తిన దానికి సార్థకత లేకుండానే చచ్చిపోతున్నాను గనుక, నా కన్యాత్వాన్ని గూర్చి దేవుని సన్నిధిలో ప్రలాపించడానికి నాకు అవకాశం కొంత టైమ్ అడిగి, ఆ తర్వాత బలి అనేది జరిగిపోయింది.
- 🚫 నరబలి – దేవుని చిత్తం కాదు: దీంట్లో నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి? దాన్ని దేవుడు ఎందుకు అలౌ (Allow) చేశాడు? ఎందుకు రాయించాడు? మొట్టమొదటి విషయం – ఇలాగు జరిగింది అనే చరిత్ర రాయబడింది తప్ప, ఇలాగు చేయండి అని దేవుడు ఆజ్ఞాపించినట్టు లేదు. రెండవ విషయం – నరబలి అనే సంగతి దేవుడు ఎప్పుడూ అంగీకరించలేదు. “నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని చేతనే చిందించబడును”, “నరహత్య చేయకూడదు” అన్నాడు దేవుడు. గనుక నరుని బలిగా అర్పించడం అనేది లేదు. జంతువుల మీద దహన బలిగా అర్పించండి, జంతు రక్త ప్రోక్షణం దేవుడు అంగీకరించాడు. మనిషిని బలి ఇవ్వమని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు.
- ⚠️ తొందరపాటు మొక్కుబడులు: ఈ ఎపిసోడ్ లో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే – మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, మొక్కుబడి చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తొందరపాటుగా మొక్కుబడి చేయకూడదు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము గనుక జాగ్రత్తగా మాట్లాడమన్నాడు (ప్రసంగి 5:2). ఏదో తొందరపాటుగా ఓవర్ (Over) గా మనం మాట్లాడకూడదు. “ప్రభువా ఈ ఒక్క మనవి ఆలకిస్తే నా లైఫ్ లో ఇంకా ఎప్పుడు ఏమీ అడగను” అని అంటారు, అది చాలా ఫూలిష్ ప్రేయర్ (Foolish prayer).
- ⚖️ లేఖనమే సుప్రీం: నీవు చేసిన ప్రార్థన అయినా సరే, అది లేఖనాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు – “పొరపాటుగా నేను ఈ మాట అన్నాను, ఇప్పుడు నా మాట మీద నేను ఆధారపడి ఈ పని చేసేయాలి అనుకుంటే దేవుని మాటకు వ్యతిరేకంగా పోవాల్సి వస్తున్నది” అనుకున్నప్పుడు నీ ప్రార్థనైనా నువ్వు మార్చుకోవచ్చు. యెప్త ఆ పని చేయలేదు. ధర్మశాస్త్రంలోనే నరుని రక్తము చిందించవద్దు అని ఉన్నది కదా! మరి నా కూతురు వచ్చింది.. దేవుడు క్లియర్ గా చెప్పాడు మనిషిని చంపొద్దు, మనిషికి బదులుగా ఒక జంతువును చంపాలి అని. గనుక ఈయన లేఖనాలను పట్టించుకోకుండా “నేను అన్నాను గనుక నెరవేరవలసిందే” అనే మొండి పట్టుదల మీద ఉన్నాడు. ఇది రెండవ పొరపాటు.
- ✨ ముగింపు: ప్రార్థనలో మనము ఓవర్ యాక్షన్లు (Over actions) చేయకూడదు. ఒకవేళ నోరుజారి చేసిన తెలివి తక్కువ ప్రార్థనను మనం మొండిగా నెరవేర్చుకోకుండా.. “ప్రభువా, నా మాట పోతే పోయింది నీ లేఖనానికి నిలబడతాను గనుక తప్పైతే నన్ను క్షమించు” అని మనం అడ్జస్ట్మెంట్ (Adjustment) చేసుకోవచ్చు. దేవుడు హిట్లర్ లాంటివాడు కాదు, ఆయన లవింగ్ ఫాదర్ (Loving Father). దేవునితో మనం ఆర్గ్యూ (Argue) చేయవచ్చు, లేఖనము ప్రకారం మనము ఆయనను ఒప్పించవచ్చు. యెప్త ఈ రెండు తప్పులు చేశాడు. లెట్ అస్ నాట్ డూ దోస్ మిస్టేక్స్ (Let us not do those mistakes).
Detailed English Translation:
❓ Question: Did Jephthah really sacrifice his daughter as a burnt offering? Does God desire human sacrifice? Since God never accepts human sacrifice, how did this event take place, and how should we understand it?
- The Context of the Vow: Jephthah made a rash and hasty vow to God: “If you give the Ammonites into my hands, whatever comes out of the door of my house to meet me when I return in triumph… I will sacrifice it as a burnt offering.” He likely expected an animal to greet him, but to his horror, his only daughter came out dancing to celebrate his victory.
- A Tragic Commitment: Jephthah was devastated but felt he couldn’t break a vow made to the Lord. His daughter, displaying great courage and faith, encouraged him to keep his word but requested two months to weep for her virginity upon the mountains. After two months, the Bible records that Jephthah did to her as he had vowed.
- God’s Stance on Human Sacrifice: It is crucial to understand that God never commanded or desired human sacrifice. The Law of Moses strictly forbade murder and human sacrifice, viewing it as an abomination. This story is recorded as a historical fact of what happened due to human error, not as a divine commandment for us to follow.
- The Error of Jephthah: Jephthah made two major mistakes. First, he made a rash, foolish vow without thinking of the consequences. Second, he displayed stubborn legalism by prioritizing his spoken word over God’s established moral law, which prohibited killing humans. He could have repented for his foolish vow and offered a substitute sacrifice as the law allowed, but he chose a rigid path.
- Lesson for Believers: We must be careful with our words before God. Ecclesiastes 5:2 warns us not to be hasty in our speech before the Lord. If we ever realize that a personal promise or prayer contradicts God’s Word, we should have the humility to repent and stick to the Scriptures. God is a loving Father, not a programmed computer; He values our obedience to His moral heart over our foolish, rigid vows.
