❓ ప్రశ్న: దయ్యాలు ఎలా పుట్టాయి? అవి నిజంగా మనుషులకు కనబడతాయా? అసలు ఈ దయ్యాలు ప్రారంభం ఎక్కడ? అవి నిజముగా కనబడతాయా? వాటి పరిస్థితి ఏమిటి? (0:32:50)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 13s)
- 👻 ప్రారంభం: వాటి పరిస్థితి ఏమిటంటే – ప్రప్రథమముగా దేవుడు దయ్యములను సృష్టించలేదు, దేవుడు దేవదూతలను సృష్టించాడు. ఆ దేవదూతలు మనము ఊహించలేనంత అధిక సంఖ్యలో కోట్ల కోట్లు, బిలియన్స్ (Billions) అండ్ ట్రిలియన్స్ (Trillions) అండ్ క్వాడ్రిలియన్స్ (Quadrillions) అనుకోండి అంతమంది ఉన్నారు వాళ్ళు. దేవదూతలను దేవుడు నక్షత్రములు అని పిలిచాడు. అంటే దాదాపుగా నక్షత్రములు ఎలాగ అసంఖ్యాకంగా ఉన్నాయో, దేవదూతలు అలాగే ఉన్నారు. అందులో మూడవ భాగమును ఆది ఘటసర్పము, ఆ సైతాను తోకతో ఈడ్చి భూమిమీద పడవేసాడని మనకు ప్రకటన 12వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ పడిపోయిన దేవదూతలే ఇప్పుడు దేవ విరోధ రాజ్యంగా ఏర్పడి దేవునికి విరోధంగా పని చేస్తున్నారు.
- 👁️ కనిపిస్తాయా?: దయ్యాలను చూసాము అని కొంతమంది అంటున్నారు. వాళ్ళు తెల్లచీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, గజ్జలు కట్టుకొని నడుస్తూ ఉండటాన్ని మేము చూసాము అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది సాధ్యమా? సంభవమా? అలా జరుగుతుందా? ఈ దేవదూతలు మనకంటే అతీత శక్తులు అనేకము కలిగినవారు. అందులో ఒకటి ఏంటంటే – కామరూప ధారణ. కామరూప ధారణ అంటే కోరుకున్న రూపాన్ని ధరించడం. ఈ పడిపోయిన దేవదూతలు తమ రూపాన్ని అప్పటికప్పుడు మార్చుకోగలరు. అసలు ఆడపిల్లలాగా మగోళ్ళలాగా ఎందుకు, వాళ్ళు జంతువుల్లాగా కూడా మారగలరు. పులి లాగా, పిల్లి లాగా, గాడిద లాగా, కుక్క లాగా.. ఎలాగన్నా మారగలరు.
- 🚫 వాటి ఇష్టం: అలాంటప్పుడు వాళ్ళు ఎవరికైనా కనిపించాలి అనుకున్నప్పుడు కనిపిస్తారు, వద్దనుకుంటే అంతర్ధానం అయిపోతారు. మనము చూడాలనుకున్నప్పుడు వాళ్ళు కనిపించరు. కనబడటం ద్వారా వాళ్ళ అంధకార రాజ్యానికి ఏదైనా లాభం ఉన్నది అనుకుంటే వాళ్ళు కనపడతారు. అప్పుడు వాళ్ళు ఒక మగవాడి రూపంలో కనబడొచ్చు లేదా ఒక జంతువు రూపంలో కనబడొచ్చు లేకపోతే ఒక ఆడపిల్ల రూపంలో కనబడొచ్చు. దేవుడు కనిపించడు, ఈ దయ్యాలు కనిపించవు. మనం ఈ మట్టి శరీరంలో ఉన్నంతవరకు కనబడవు. అది వాళ్ళు అదృశ్యంగా ఉన్నారు.
Detailed English Translation:
❓ Question: How did demons originate? Do they actually appear to humans? What is their true nature and state?
- Origin from Fallen Angels: God did not create demons; He created angels in unfathomable numbers, often referred to as stars in the Bible. A third of these angels followed Satan in his rebellion and were cast down to Earth (Revelation 12). These fallen angels now form a kingdom opposed to God and are what we identify as demons or evil spirits.
- The Ability of Shape-shifting: Can they be seen? Some claim to see them as figures in white sarees or with specific appearances. Fallen angels possess ‘Kamaupa Dharana’—the ability to change their form at will. They can manifest as men, women, or even animals like tigers or dogs for a limited time to serve their purposes.
- Visibility and Invisibility: They do not appear just because someone wants to see them. They manifest only when it serves the interests of their dark kingdom. While they are naturally invisible to human eyes in our physical state—much like air, bacteria, or subatomic particles—they can choose to become visible to deceive or terrify. Their primary target is to distract humans from the Truth of Jesus Christ.
