35.Q: Star of Bethlehem in Zoroastrian Scriptures (KSM 03) ✨

❓ ప్రశ్న: జోరాస్ట్రియన్ మత గ్రంథాలలో యేసుక్రీస్తు జననం గురించి నక్షత్ర సూచన ఉందా? ఇప్పుడు జోరాస్టరిజం మత గ్రంథం అయ్యగారు, ప్రవచనం ఉంది కదా యేసుప్రభువు గురించి! అది నక్షత్రం ద్వారా తెలిసిందని చెప్తారు కదా అయ్యగారు? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం ద్వారానే వస్తారు కదా, వాళ్ళే వీళ్ళని అనుకోవచ్చా? (0:35:14)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 15s)

  • తూర్పు దేశపు జ్ఞానులు: తప్పకుండా ఒక మాట నాయనా. ఇప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అనేది బైబిల్ ను నమ్ముతున్నటువంటి విశ్వాసులంగా మనం నమ్ముతున్నాం. అవునా కాదా? సో వాళ్ళు వచ్చారు, వచ్చి వాళ్ళు అన్న మాట ఏంటి – “తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును మేము చూచి ఆయన్ని పూజింప వచ్చితిమి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు?” అని అన్నారు.
  • 📜 శాస్త్రాలలోని సమాచారం: అంటే వాళ్ళకు ఏదో రకంగా ఈ సమాచారము తెలుసు. ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఏమని తెలుసు అంటే – ఆ యూదుల రాజుగా పుట్టినటువంటి ఆ రక్షకుడు పుట్టినప్పుడు ఈ నక్షత్రం ఉదయిస్తుంది అనేది వాళ్ళు చదువుకున్న శాస్త్రాలలో ఉంది. అది జోరాస్ట్రియన్ (Zoroastrian) మత గ్రంథమైన జెండా అవెస్తా (Zend Avesta) కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా ఎన్నెన్నో కోకొల్లలుగా ఉన్న గ్రంథాలు ఏదైనా కావచ్చు. ఆ మత విశ్వాసాలు, ఆ మత గ్రంథాలు, ఆ సిద్ధాంతాలలో ఒక నమ్మకం ఏంటంటే – లోక రక్షకుడు పుట్టినప్పుడు ఒక ప్రత్యేక నక్షత్రం ఉదయిస్తుంది అని వాళ్ళు నమ్మారు, తరతరాలుగా ఎదురు చూశారు.
  • 🔭 నక్షత్ర దర్శనం: వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ఇది మామూలు నక్షత్రంగా లేదు, మనం తరతరాలుగా ఎదురు చూసింది ఇదే కాబోలు అనుకున్నారు. ఆ నక్షత్రం వాళ్ళకు చాలా దగ్గరగా దిగి వచ్చి, వాళ్ళని నడిపించి నడిపించి ఆ మరి ఇశ్రాయేలు దేశానికి తీసుకొచ్చింది. తర్వాత కథ మనకు తెలుసు.
  • 🌍 ఖగోళ శాస్త్రం: కాబట్టి ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అంటే ప్రాచీన కాలములో ఖగోళ శాస్త్రము బాగా అభివృద్ధి చెందిన దేశాలు – చైనా, ఇరాన్, ఇండియా (భారతదేశం). ఆ ఈ దేశాల్లో బాగా ఖగోళ శాస్త్రం అభివృద్ధి చెందింది. ఈ మూడు దేశాలు కూడా ఇశ్రాయేలుకు తూర్పులోనే ఉన్నాయి. గనుక వాళ్ళు వచ్చారు అన్నది వాస్తవము. వాళ్ళు రక్షకుడిని కనుగొన్నారు, పూజించి మళ్ళీ వేరొక మార్గాన వెళ్ళిపోయారు.
  • 🏆 యేసు ప్రత్యేకత: కాబట్టి అందులో ఇంకా మనకు సందేహం ఏమీ లేదు. మనం నమ్ముతున్నాం – యేసు పుట్టకముందు ఇతర దేశాల జ్ఞానులకు ఇన్ఫర్మేషన్ (Information) ఉంది. అలా అవతార పురుషులు అనబడిన ఏ ఇతర దైవానికి కూడా ఇలాంటి సాక్ష్యం లేదు. అవతార పురుషులుగా పూజలు అందుకుంటున్న వాళ్ళు ఎవరి జన్మ కంటే ముందు కూడా, ఎవరి గురించి కూడా పుట్టడానికంటే ముందు ఏ ఇతర దేశంలో జ్ఞానులకు ఇలాంటి హింట్ (Hint) ఏమీ లేదు. ఈ విషయంలో యేసు ఒక్కడే అసమానుడు, అందరికీ అతీతుడు ఆయన. యూనిక్ (Unique) విషయంలో. కనుక యేసుని కలిగి ఉన్నందుకు మనం అతిశయించాలి. గాడ్ బ్లెస్ యు (God bless you).

Detailed English Translation:

❓ Question: Is there a prophecy about the Star of Bethlehem in Zoroastrian scriptures? Can we identify the Wise Men from the East mentioned in the Bible with Zoroastrian priests who followed a star to find Jesus?

  • The Prophetic Expectation: As believers, we accept the account of the Magi (Wise Men) who arrived in Jerusalem saying, “We saw his star when it rose and have come to worship him.” These men possessed ancient knowledge that a specific celestial event would signal the birth of the King of the Jews.
  • Scriptural Evidence: This information likely came from their own sacred texts, such as the Zoroastrian ‘Zend Avesta’ or other ancient Persian and Eastern scrolls. There was a cross-cultural expectation that a Great Savior would be born, accompanied by a unique star. They waited for generations for this sign.
  • The Celestial Guide: When they finally witnessed this extraordinary star—which behaved unlike any ordinary astronomical body—they followed its guidance. It descended and led them directly to the land of Israel, and eventually to the exact location of the child Jesus.
  • Excellence of the East: Historically, regions like Persia (Iran), India, and China were hubs of advanced astronomy. Being east of Israel, these ‘Wise Men’ traveled from these civilizations. Their visit validates that the revelation of Christ was not limited to Israel alone.
  • Uniqueness of Christ: Jesus is unique because His birth was foretold not just in Hebrew prophecy but also hinted at in the wisdom of other nations. No other figure worshiped as an ‘avatar’ or deity has such pre-birth validation from the wise men of distant lands. We should take pride in following a Savior whose arrival was a global prophetic event.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram