❓ ప్రశ్న: రిబ్కా తన కుమారుల విషయంలో పక్షపాతం చూపి తప్పు చేసిందా? అదే రిబ్కా గురించి అడిగితానండి.. యేషావు యాకోబు విషయంలో తప్పు చేసిందని బోధిస్తున్నారు. అది తప్పు చేసిందా లేదా అనేది కొంచెం నాకు క్లారిటీ కావాలి. పెద్దవాడి పక్షాన పక్కన పక్షపాతం చూపింది, చిన్నవాడికి ఈ విధంగా కుట్ర చేసి పెట్టింది కదా, తప్పే కదా అని చెప్తున్నారు. దీనిపై మీ వివరణ ఏంటి? (0:39:01)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 37s)
- 🤱 దైవిక ప్రత్యక్షత: ఒక విషయం ఏంటంటే – తన గర్భములో రెండు పిండములు, శిశువులు పెనుగులాడుతున్నప్పుడు “ఇంతకంటే నాకు మరణమే మేలు కదా, ఈ బాధ పడలేను” అని గర్భం మోస్తున్నటువంటి చూలాలుగా మరి ఆమె వెళ్లి దేవుని అడగడానికి వెళ్ళింది – “దేవా ఏంటి నాకు ఈ శ్రమ?” అని. అప్పుడు దేవుడు ఆమెకు చెప్పాడు – “నీ గర్భములో రెండు జనపదములు, రెండు రాజ్యములు గలవు, రెండు జనములు కలవు. ఆ పెద్దవాడు చిన్నవానికి దాసుడగును” అని దేవుడు చెప్పాడు. అది ఆమెకు తెలిసింది.
- ✨ జ్ఞాపకం ఉన్న మాట: తెలిసిన తర్వాత ఆమె జ్ఞాపకం పెట్టుకున్నది. నాకు ఆ కవలలు ఉన్నారు, ముందు వచ్చేవాడు దేవుని ప్రణాళికలో ఉన్నవాడు కాదు, వెనుక వచ్చేవాడి ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. “నేను చిన్నవాడిని ఆశీర్వదిస్తాను” అన్నాడు దేవుడు. గనుక వీడు దేవునికి ఉపయోగపడే వ్యక్తి అని దృష్టి పెట్టుకొని వాడి మీద ఆమె ప్రేమ పెంచుకున్నది. అయితే ఇస్సాకుకు ఈ ప్రత్యక్షత లేక – జేష్ట కుమారుడు ముందు పుట్టినోడు నా ఆస్తిక వారసుడు, నా యొక్క కుటుంబానికి ఆయన ఆస్తిపాస్తుల అన్నిటికీ హక్కుదారుడు, నా తర్వాత అధికార పీఠం మీద ఉండేవాడని.. ఆయన శారీరకముగా ముందు పుట్టాడు అనే అభిమానం ఇస్సాకుది.
- 📖 తప్పుడు విశ్లేషణలు: దేవుడు ఎన్నుకొని ఆశీర్వదించిన వాడిని నేను జాగ్రత్తగా కాపాడాలనే కాన్సెప్ట్ (Concept) రిబ్కమ్మది. ఇప్పుడు రిబ్కా తప్పు చేసిందని చెప్పేవాళ్ళు లేఖనాల ప్రకారము ఆధ్యాత్మికంగా, యోగికార్థం, ప్రవచనార్థం చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు సోషియాలజిస్టులు (Sociologists). వాళ్ళు ఏంటంటే సామాజిక శాస్త్రం ప్రకారం – ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఒకరి పట్ల ఎక్కువ ప్రేమ, ఒకరి పట్ల తక్కువ ప్రేమ చూపినప్పుడు పిల్లల క్యారెక్టర్ (Character) డామేజ్ అయిపోతుంది, సమానంగా ప్రేమించాలి అనే ఆ పాఠం నేర్పడానికి ఈ యాకోబు, యేషావుల కథ, తల్లిగారి రిబ్కా కథ వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా తప్పు ఇది. ఇప్పుడు కుటుంబంలో పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి అనే పాఠం చెప్పుకోవడానికి రిబ్కా మీద తప్పు మోపడం తప్పు. రిబ్కా యాకోబును ఎందుకు ప్రేమించింది అంటే దేవుడు ఆమెకు చెప్పిన మాటను బట్టి ప్రేమించింది.
- 🛡️ భర్తను, కొడుకును కాపాడటం: ఇప్పుడు రిబ్కా తప్పు చేయట్లేదు, రిబ్కా యొక్క ప్రేమకు కారణాన్ని గుర్తుపట్టలేక వీళ్ళు తప్పు చేస్తున్నారు. ఇస్సాకు తన వారసునిగా యేషావును నియమించి అతనికి ఆశీర్వాదం ఇచ్చి చచ్చిపోదామని ఆయన డిసైడ్ (Decide) అయిపోయాడు. ఈ సంగతి రిబ్కా విన్నది. విన్న తర్వాత ఆమె మీద ఒక బాధ్యత ఉంది ఇప్పుడు. దేవుని చిత్తానికి విరోధంగా ఆశీర్వాదం పలికిన దోషము ఇస్సాకు మీదకి వస్తుంది. ఇటు భర్తని కాపాడుకోవాలి, తన కొడుకుని కాపాడుకోవాలి. అందుచేత ఒక తప్పు జరగకుండా అడ్డుకుందామని ఆమె ఆ పని చేసింది. యాక్చువల్ (Actual) గా ఇస్సాకు ఘోరమైన తప్పు చేయబోయాడు. ఏంటా ఆ తప్పు? దేవుడు తృణీకరించిన వాడిని ఆశీర్వదించబోయాడు.
- 🏆 ముగింపు: ఒకవేళ రిబ్కా ఈ పని చేయకపోతే ఇస్సాకు యేషావును దీవించేశాడు అనుకోండి, అయినా సరే దేవుడు యేషావును వాడుకోలేడు, యాకోబును వాడుకుంటాడు. అప్పుడు ఇస్సాకుకు అవమానం రాదా? ఇస్సాకు ఆశీర్వాదానికి విలువ లేకుండా పోతుంది కదా! భర్తకు నిత్యమైన అవమానం రాకుండా, ఘోరమైన తప్పిదం జరగకుండా అడ్డుకున్నది రిబ్కా మహా తల్లి. ఆమెను తప్పు అనడం మన తప్పు. రిబ్కా చేసినది మంచి పని.
Detailed English Translation:
❓ Question: Did Rebekah commit a sin by favoring Jacob and deceiving Isaac to secure the blessing for her younger son? Some preachers claim she showed partiality and manipulated the situation. What is the scriptural truth?
- The Divine Oracle: Rebekah’s preference for Jacob was not based on mere parental favoritism but on a divine revelation. When she sought God during a difficult pregnancy, He told her that two nations were in her womb and that “the older will serve the younger” (Genesis 25:23). She held onto this prophecy, knowing Jacob was God’s chosen vessel.
- Isaac’s Blindness: Isaac, however, focused on tradition and physical order. He loved Esau because of his hunting skills and intended to bless the firstborn according to custom, ignoring or forgetting God’s specific word to Rebekah.
- Sociology vs. Theology: Critics who blame Rebekah often look at the story through the lens of modern sociology, teaching that parents should love all children equally. While that is a good general rule, applying it here ignores the prophetic context. Rebekah wasn’t being a ‘bad mother’; she was being a guardian of God’s revealed will.
- Preventing a Disaster: By intervening, Rebekah actually saved her husband from a catastrophic spiritual error. Had Isaac blessed Esau (whom God had rejected for the covenant), his blessing would have been futile, and Isaac would have stood in opposition to God’s purpose. Rebekah’s ‘deception’ was a desperate move to ensure that the blessing reached the right person and to protect Isaac from the shame of a failed blessing.
- Rebekah’s Legacy: Rebekah is a hero of faith who prioritized God’s word over social norms and even her husband’s misguided intentions. Calling her action a ‘sin’ is a misunderstanding of her role in the redemptive history. She ensured that the lineage of Christ remained through Jacob, as God intended.
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
