❓ ప్రశ్న: రక్షణ పొందిన విశ్వాసికి మళ్ళీ దయ్యం పట్టే అవకాశం ఉందా? రీసెంట్ గా ఒక విశ్వాసి అడిగారు ఈ ప్రశ్న ఏంటంటే – ఏసుక్రీస్తు ప్రభువును నమ్మి ప్రభువు బలలో పాలుపొందిన తర్వాత, సాతానుడు దయ్యపు శక్తులు మళ్ళీ ఆ విశ్వాసిలో ఏ సమయములో, ఏ విధముగా, ఏ కారణము చేత మళ్ళీ లోపల పడుతుంది? సాతాను దయ్యం మళ్ళీ ఎట్లా పడతది ఆ విశ్వాసికి? పట్టడానికి గల కారణాలు ఏంటి? (1:51:03)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 01s)
- 👿 విశ్వాసికి దయ్యం పట్టదు: విశ్వాసికి దయ్యం పట్టదు. అందుకే నేను చెప్పాను ఇంతకుముందు ప్రశ్నలో – సైతాను ఒకడి లోపల దూరకుండానే బయట ఉండి వాడి ప్రవర్తనను, తలంపులను, ఆలోచన విధానాన్ని కంట్రోల్ (Control) చేసే ఒక ప్రక్రియ ఉంది. అయితే బయట ఉండి కంట్రోల్ చేస్తున్నటువంటి సైతాను ఒక దశలో లోపలికి దూరుతుంది. అది ఇస్కరియోతు యూదాకు జరిగింది.
- 📖 దశల విశ్లేషణ – యూదా ఉదాహరణ: మనకు ఈ దశలు చాలా క్లియర్ (Clear) గా యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడినవి. సాతాను వానిలో ప్రవేశించలేదు అని తేటగా లేఖనం చెబుతుంది, తర్వాత ప్రవేశించాడు అని కూడా చెబుతా ఉంది లేఖనం. యోహాను సువార్త 13:2 ప్రకారం – “వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను.” ఆ తర్వాత 27వ వచనంలో – “వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను.” అంతవరకు ప్రవేశించలేదు, కానీ హృదయంలో ఆలోచన పుట్టించారు.
- 🧱 కఠినమైన హృదయం: అట్లాగే విశ్వాసులైన వాళ్ళకు కూడా జరిగే ఒక రిమోట్ పాసిబిలిటీ (Remote possibility) ఉంది. ప్రతి విశ్వాసికి దయ్యాలు పట్టడం అనేది ఉండదు. కానీ వీడు మరీ తన మనస్సాక్షిని చంపేసుకున్నాడు.. ఏసుప్రభు వారు అన్నాడు “మీలో ఒకడే నన్ను అప్పగిస్తాడు” అన్నప్పుడే వాడు కాళ్ళ మీద పడి బోరుమని ఏడ్చి “ప్రభువా నీకు తెలిసిపోయిందా నా సంగతి, క్షమించు” అంటే సరిపోయేది. ఏసుప్రభు వారు చెప్తున్నా సరే వీడు ఇంకా మొండికేశాడు, మనసును కఠినం చేసుకున్నాడు.
- 🛡️ నిరాకరణ మరియు ప్రవేశం: రక్షకుడు వాని కాళ్ళు కూడా కడిగి “ఇదిగో నువ్వురా నన్ను అప్పగించబోతున్నావు నాకు తెలుసు” అని ముక్క ఇచ్చినప్పుడు, వాడు విలాసంగా దాన్ని చిద్విలాసంగా నవ్వుతూ పుచ్చుకున్నాడు తప్ప “అయ్యో” అని వాడి గుండె పగిలి రోధించలేదు. అంత హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు వాని లోపలికి సాతాను ప్రవేశించడానికి అవకాశం కలిగింది. ఏ విశ్వాసి అయినా పదే పదే అలవాటుగా ఒక తప్పు చేస్తూ, పశ్చాత్తాప పడడానికి నిరాకరిస్తే.. ఒకవేళ యేసుప్రభు వారు వారితో మాట్లాడి భక్తుల ద్వారా, ప్రవచనం ద్వారా, లేఖనము ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎన్నిసార్లు మాట్లాడి గద్దించినా ఆ తప్పు అలాగే చేయడానికి వాడు బండగా తన హృదయాన్ని కఠినం చేసుకొని అలాగే కొనసాగితే – అలాంటప్పుడు సైతాను లోపల ప్రవేశించే అవకాశం ఉంది.
- ✨ ముగింపు: అంతే తప్ప చిన్న చిన్న తప్పులకు సైతాన్ లోపలికి రాడు. మనం ఏదో తప్పు చేయగానే సైతాన్ రావడం అనేది అబద్ధం, ఏ విశ్వాసి అలాగ అనుకోకండి. మీరు తప్పు చేస్తే మళ్ళీ ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పు చేసినప్పుడల్లా దెయ్యం లోపలికి రావడం, మళ్ళీ గుడికి వెళ్ళగానే దెయ్యం బయటికి వెళ్ళిపోవడం.. ఇలాగ సంతలోకి వచ్చిపోయినట్టు, అంగట్లోకి వచ్చిపోయినట్టు ఊరికే మన లోపలికి దయ్యాలు వస్తూ వెళ్తూ ఉండవు. అసలు విశ్వాసి యేసు రక్తం కింద ఉంటాడు గనుక సైతాన్ లోపలికి వచ్చే అవకాశమే లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఇస్కరియోతు యూదా లాగా అంతగా కఠినపరుచుకున్నప్పుడు వచ్చే అవకాశం.
Detailed English Translation:
❓ Question: Can a person who is saved and partakes in the Holy Communion be possessed by a demon? Under what circumstances or reasons would a spirit enter a believer again?
- Possession vs. Influence: Generally, a true believer cannot be possessed by a demon because they are under the protection of the Blood of Jesus. However, there is a difference between ‘external influence’ and ‘internal possession.’ Satan can plant thoughts and influence a believer’s mind from the outside without entering their body.
- The Case of Judas Iscariot: The stages of possession are clearly seen in Judas. First, Satan planted the thought of betrayal in his heart (John 13:2). At this stage, Judas was not possessed; he was being influenced. Possession only occurred later, specifically after he received the piece of bread from Jesus (John 13:27).
- The Role of a Hardened Heart: Possession is a ‘remote possibility’ that only occurs when a believer repeatedly and stubbornly hardens their heart against God’s repeated warnings. Jesus gave Judas multiple opportunities to repent—He even washed his feet and indirectly pointed out the betrayal—but Judas remained callous. When a person systematically kills their conscience and rejects the Holy Spirit’s conviction, they create a void for the enemy to enter.
- No ‘Revolving Door’ Possession: Some fear that every small sin leads to possession. This is false. A believer does not become possessed every time they stumble, nor does a demon ‘move out’ every time they enter a church. Spiritual life is not a revolving door.
- Final Assurance: If you are a believer, you are protected. As long as you maintain a repentant heart and stay under the grace of Christ, possession is impossible. It is only the extreme, willful, and persistent rebellion—like that of Judas—that bypasses divine protection. Small mistakes do not lead to possession; God is always ready to forgive a repentant soul.
