48.Q: The Person from Addanki in Kalagnanam (KSM 04) 🔮

❓ ప్రశ్న: ఈ మధ్య సోషల్ మీడియాలో మిమ్మల్ని ఉద్దేశించి చాలా వైరల్ అయింది సార్. మరి చాలామంది మరి వాళ్ళకి ఏ విధంగా తెలిసిందో తెలియదు గానీ ఆ వీరభోగ వసంత రాయుడు అంటే ఆ స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానములో అద్దంకి వారి కుటుంబం లో నుండి ఆ ఒక వ్యక్తి వస్తారు ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉన్నటువంటి అనేక సంగతులను తెలియజేస్తారు ప్రజానీకానికి అని చెప్పినటువంటి ఆ ఒక్క మాటను తీసుకొని అద్దంకి వారి కుటుంబం నుండి అద్దంకి సీమలో నుండి అనబడిన ఆ మాటను తీసుకొని అది అద్దంకి రంజిత్ ఓఫిర్ గారిని ఉద్దేశించిన మాటనే అని చెప్పేసి కొంతమంది దాన్ని బాగా వైరల్ చేస్తా ఉన్నారు గారు.. దీని పట్ల మీ ఉద్దేశం ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? (0:05:15)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (9m 14s)

  • 🔮 నా ఉద్దేశ్యం: ఇప్పుడు ఒక విషయం నేను ఎదురు ప్రశ్నిస్తాను – పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినందుకు నా విలువ ఎక్కువ అవుతదా, తక్కువ అవుతదా? ఇప్పుడు క్రైస్తవుడిగా నేను నమ్మేది ఏంటంటే – నేను చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి చర్య కొంతమందిని యేసు వైపు ఆకర్షించడానికి పనికొస్తే అదే నా జీవిత సార్థకత, పరమార్థం అని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పింది ఏంటంటే – “అద్దంకి సీమలో ఒక బీదవాని ఇంట బుద్ధుడంతటి వాడు పుడతాడని, ఆ బుద్ధుడు అంతటి వాడు పుట్టి సర్వమత సారము చెపుతాడు, అన్ని మతముల సారము చెపుతాడు” అనే సంగతి వీరబ్రహ్మం గారు చెప్పారు.
  • 📞 మధ్యలో ఒక ఫోన్ కాల్ (కిరణ్ గారు, విసన్నపేట): * కిరణ్: వందనాలు అండి అయ్యగారు, నా వందనాలు నాయనా. చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడటం. మీ మెసేజ్లు ఎప్పుడూ రెగ్యులర్ గా వింటూ ఉన్నానండి. నాకు మీ మెసేజ్లు బాగా ఇన్స్పైర్ అయ్యి ఆత్మీయ జీవితంలో నాకు ఎంతో ప్రేరేపణ వచ్చిందండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే – నా ఆత్మీయ తండ్రి ఎవరై ఉంటారు? నాకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారా లేక మీరా?
    • ఓఫిర్ గారి సమాధానం: కన్న తండ్రి ఏమో మీకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు, పెంచిన తండ్రి ఏమో రంజిత్ ఓఫిర్ గారు. ఆ గొడవ లేదు, మనం ఒకళ్ళు ఒకరు పిల్లలైతే తండ్రులు అయితే లాభం ఏం లేదు, అల్టిమేట్ గా మనం పరలోకపు తండ్రి పిల్లలమే. వాక్య సూచన ప్రకారం ముందుకు నడిస్తే దేవుడు మీకు గొప్ప బహుమానం ఇస్తాడు. (దీనిపై పూర్తి వివరణ 49వ ప్రశ్నలో వస్తుంది).
  • 📜 కాలజ్ఞాన వివరణ కొనసాగింపు: ఇక ఈ అద్దంకి సీమలో ఒక బీదవాని ఇంట బుద్ధుడు అంతటి వాడు పుడతాడు, అతడు అన్ని మతముల సారము తెలుపుతాడు అని వీరబ్రహ్మం గారు చెప్పిన ప్రవచనం. మరి మా ఇంటి పేరు అద్దంకి, మరి మా రూట్స్ (Roots) కూడా అక్కడే అద్దంకి నుండే. అందుచేత మరి నేను మొదటి నుంచి కూడా నాకు ఉన్నటువంటి దృష్టి ఏంటంటే – దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు అన్ని స్థలములలో ఉన్నాడు అనేది కాదు, అన్ని గ్రంథములలో కూడా ఉండి ఉంటాడు, అన్ని శాస్త్రాలలో ఉండి ఉంటాడు అనే దృష్టి నాకు ఎలాగో అబ్బింది.
  • 📚 పరిశోధన – ప్రత్యక్షత: ఆ దృష్టితోనే నేను పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, అన్ని మత గ్రంథాలు చదివాను. చరిత్రలో యేసు చారిత్రిక వాస్తవం. యోగికార్థంలో ఈయనతో పోల్చదగిన విషయాలు, ఆయనను మెన్షన్ చేస్తున్నట్టు స్ఫురింపజేసే విషయాలు అన్ని గ్రంథాల్లో ఉన్నాయి అని నాకు స్ఫురించింది, నేను బయట పెట్టాను. ఇది ఇప్పుడు ఏదో కొత్తగా చెప్పింది కాదు, చాలా దశాబ్దాల క్రితమే చెప్పాను. తర్వాత ‘హైందవ క్రైస్తవం’ అనే బుక్ కూడా రాశాను. నేను చెప్పినటువంటి పబ్లిక్ మెసేజెస్ కూడా రికార్డెడ్ (Recorded) గా ఉన్నాయి.
  • వైరుధ్యం లేని బోధ: ఐ థరోలీ బిలీవ్ (I thoroughly believe), ఫర్మ్ లీ బిలీవ్ (Firmly believe) ఏంటంటే – అన్ని మతముల సారము యేసు అనేది. దాన్ని ప్రాపర్లీ ఇంటర్ప్రిట్ (Properly interpret) చేసి దేన్ని ఎక్కడ ప్లేస్మెంట్ (Placement) చేసుకోవాలో మనం చేసుకుంటే మతముల మధ్య వైషమ్యాలు ఉండవు, వైరుధ్యము ఉండదు. అన్ని కలిసి చక్కగా మనకు యేసునే చూపిస్తాయి అనేది నేను నమ్మినటువంటి విషయం. ఇలాంటివాడు ఒకడు వస్తాడని ఆయన చెప్పాడు. దాదాపు ఆ లక్షణాలు నాలో ఉన్నాయి.
  • 🛡️ ముగింపు: అయితే ఆయన చెప్పింది నేనే కాకపోయినా నాకు నష్టం లేదు. ఆయన చెప్పింది నన్ను గూర్చి అని చెప్పుకొని నాకు ఇప్పుడు అందరి చేత మార్కులు వేయించుకోవాల్సిన అవసరం లేదు. నేను క్రీస్తుకు చెందినవాడనని నేను ప్రకటించుకున్నప్పుడు, యేసు నన్ను అభిషేకించి తన సేవకు పిలిచి నియమించి వాడుకున్నప్పుడే నాకు మాగ్జిమమ్ మార్కులు పడిపోయినాయి. ఇప్పుడు వీరబ్రహ్మం గారు చెప్పినందుకు నాకు పరలోక రాజ్యంలో బహుమానం ఎక్కువ కాదు తక్కువ కాదు. ఒకవేళ ఆయన చెప్పింది నన్ను గూర్చి కాకపోతే ఇటువంటివాడు ఇంకొకడు వస్తే అది కూడా మంచిదే, అతన్ని కూడా నేను వెల్కమ్ చేస్తాను. అన్ని మతముల సారము యేసేనని చెప్పగలిగేవాడు ఎవరైనా వస్తే క్రైస్తవుడిగా నేను అతన్ని స్వాగతిస్తాను, నా సహదాసునిగా చేర్చుకుంటాను. అద్దంకి సీమ నుండి వచ్చినటువంటి ఒకడు అన్ని మతముల సారము ఇదిగో యేసు అని చెప్పడానికి పోరాడుతున్నవాడు చరిత్రలో మీకు ఎవరైనా తెలుసా? తెలిసి ఉంటే నా దృష్టికి తీసుకురండి, దాన్ని నేను కూడా ప్రచారం చేస్తాను. మంచిది థాంక్యూ.

Detailed English Translation:

❓ Question: There is a viral claim on social media that you are the person mentioned in the ‘Kalagnanam’ (prophecies) of Saint Veerabrahmendra Swami. It says a person from the ‘Addanki’ family would emerge to reveal the truths of the past, present, and future, and the essence of all religions. What is your take on this?

  • Self-Worth in Christ: My value does not increase or decrease based on whether Veerabrahmendra Swami prophesied about me. My only goal as a Christian is to lead people to Jesus. If my work serves that purpose, my life is successful. The prophecy mentions a ‘Buddha-like’ person born into a poor family in the Addanki region who would explain the essence of all religions.
  • The ‘Addanki’ Connection: My surname is Addanki, and my ancestral roots are indeed in that region. From the beginning, I had a unique conviction: if God is omnipresent, His fingerprints must be in all scriptures and sciences. This led me to study the Vedas, Puranas, and Upanishads alongside the Bible.
  • Universal Christ: I discovered that the historical Jesus and His spiritual significance are reflected in all ancient scriptures. I didn’t just invent this recently; I have been preaching and writing about it for decades, including in my book ‘Haindava Kraistavam.’
  • Harmony through Interpretation: I firmly believe Jesus is the essence of all religious truths. When we interpret these texts correctly and place them in the right context, communal conflicts disappear, as they all eventually point to Christ. The prophecy’s description closely aligns with my lifelong mission.
  • No Need for Earthly Validation: Even if I am not the person the Swami spoke of, it doesn’t bother me. I don’t need external markers or secular prophecies to validate my ministry. My ‘maximum marks’ were awarded when Jesus called, anointed, and appointed me to His service.
  • Invitation for Truth: If there is another person from Addanki who is consolidating the essence of all religions into the Truth of Christ, I would gladly welcome and support them. Until then, my focus remains on showing the world that Jesus is the culmination of all spiritual seeking.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram