51.Q: Is Jesus Equal to the Father? Philippians 2:6 (KSM 04) ⚖️

❓ ప్రశ్న: యేసుక్రీస్తు తండ్రితో సమానుడు కాదు, ఇప్పుడు భౌతికంగా ఒక తండ్రి ఉంటాడు కుమారుడు ఉంటాడు.. కుమారుడు ఎప్పుడు తండ్రి స్థాయికి సమానుడు కాదు కదా! అలాగే ఏసుక్రీస్తు కూడా తండ్రి అయినటువంటి యెహోవాకు సమానుడు కాదు అని కొందరు చెబుతున్నారు. దీనిపై మీ జవాబు ఏంటి? ఏసుక్రీస్తు తండ్రితో సమానుడా? తక్కువవాడా? (0:18:10)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 45s)

  • కాలఘట్టాల ప్రాముఖ్యత: మీరు అడిగిన ప్రశ్నకు ఇంకొక్క ఎదురు ప్రశ్న వేయాల్సి ఉంటది – మీరు ఏ కాల ఘట్టమును గూర్చి అడుగుతున్నారు అనేది. కాలఘట్టం.. ఒక్కొక్క టైమ్ పీరియడ్ (Time period) లో ఆయన స్టేటస్ (Status) ఆయన స్వచ్ఛందంగా మార్చుకుంటూ వచ్చాడు.
  • 📖 ఫిలిప్పీ 2:6 – ఒక ఛాయిస్: ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయము ఐదు, ఆరు వచనాలు చూస్తే – “క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు” అన్నాడు. అంటే ఒక ఛాయిస్ (Choice) ఆయన తీసుకోవాల్సిన ఘట్టము ఆయన లైఫ్ లో వచ్చింది. దేవునితో సమానంగా ఉండిపోదామా లేక ఓ మెట్టు దిగుదామా? ఈ ఛాయిస్ ఆయన ముందుకు వచ్చింది.
  • 🤱 మహిమ నుండి దిగిరావడం: మన మానవ జాతిని, మిమ్మల్ని నన్ను మొత్తం మనుష్య జాతి అంతటిని రక్షించడానికి ఆయన మహిమలో నుంచి ఒక అడుగు బయటికి వేయాల్సి వచ్చింది. మహిమలో నుండి బయటికి.. లేక ఆయనకు ఉన్న మహిమలో ఒక తక్కువ అంతస్తుకు ఆయన దిగవలసి వచ్చింది. అలాగ దిగినప్పుడు దేవునితో ఉండే ఆ సమానత్వాన్ని పోగొట్టుకుంటాడు. మరి దైవ సమానత్వము అనేది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అంటే “దాన్ని వదిలేద్దాంలే” అనుకున్నాడు. ఒకవేళ యేసు ప్రభువు వారు దేవునితో సమానముగా ఎప్పుడు ఉండకపోతే, మరి దాన్ని విడిచిపెట్టే ప్రసక్తి ఎలా వస్తుంది? విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు అంటే – దైవ సమానత్వాన్ని నేను అవసరమైతే వదిలేయొచ్చు అనుకున్నాడు. గనుక ఏదో ఒక కాలంలో యేసుప్రభువు వారు దేవునితో సమానంగా అయితే ఉండి తీరాలి.
  • 🩸 నరావతారం – నా తండ్రి గొప్పవాడు: ఆయన నరావతారం ఎత్తినప్పుడు తనను తాను తగ్గించుకొని మనుష్య పోలికగా పుట్టాడు. మనుషుల పోలికగా పుట్టి మరియ గర్భము ద్వారా ఒక పరిశుద్ధ మానవుడిగా మానవజాతిలో ఆయన పుట్టినప్పుడు ఆ దైవ సమానత్వం పోయింది. అప్పుడు అన్నాడు – “నా తండ్రి నాకంటే గొప్పవాడు” అని.
  • 📜 పాత నిబంధన – రెండవ యెహోవా: కానీ పాత నిబంధనలో తండ్రి, కుమారుడు సరిసమానమే. ఎందుకంటే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడే అన్నాడు – “నిర్గమకాండము 23:20-21 లో.. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను నేను సిద్ధపరిచిన చోటుకు రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నామము ఆయనకు ఉన్నది”. నా నామము అంటే ‘యెహోవా’ అనేది నా నామము, నా పేరే ఆయనకు కూడా ఉన్నది. దేవుడే అయితే తప్ప యెహోవా అనే పేరు ఇంకోడికి ఉండడానికి వీలు లేదు. అక్కడ ఆయన – “ఆయన కోపం రేపవద్దు రేపితే నేను కూడా ఏం చేయలేను” అని అన్నాడు. గనుక పాత నిబంధనలో ఈ రెండవ యెహోవా నా అంతటి వాడు, నేను ఆయనతో నెగోషియేట్ (Negotiate) చేయలేను, ఆయనను ఒప్పించలేను, నాతో సమానుడు అనే ధ్వని యెహోవా దేవుని మాటలో కనబడుతుంది.
  • మళ్లీ పొందిన మహిమ: కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత “నా తండ్రి చిత్త ప్రకారమే చేయుచున్నాను” అన్నాడు. ఎందుకంటే ఫిలిప్పీ 2:6 నెరవేరింది అక్కడ. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. కానీ అవతార పరిసమాప్తి సమయంలో యోహాను 17:5 లో – “తండ్రి లోకము పుట్టక ముందు మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మళ్ళీ మహిమ పరచు” అన్నాడు. అంటే లోకం పుట్టక ముందు ఒక మహిమ ఉండింది, అది దైవ సమానత్వం. అవతార సమయంలో అది లేదు. ఇప్పుడు పునరుద్ధానుడైన తర్వాత “నాకు మళ్ళీ ఆ మహిమ నాకు ఇచ్చేసేయ్” అని అన్నాడు.
  • 🛡️ ముగింపు: యేసు తండ్రి అయిన దేవునితో సమానుడా అంటే – అవతారానికి ముందు సమానుడు, అవతారం తర్వాత కూడా సమానుడు. కేవలం అవతార సమయంలోనే ఒక మెట్టు కింద ఉన్నాడు. యేసు ప్రభువు యొక్క మర్మ వ్యక్తిత్వాన్ని గుర్తించే శక్తి లేనోళ్లు ఎవరంటే.. బైబిల్ విషయంలో రీసెర్చ్ (Research) పెట్టుకున్నారు తప్ప ప్రత్యక్షత (Revelation) పొందలేదు. ప్రత్యక్షత లేని వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు కానీ ప్రత్యక్షత ఉంటే లేఖనాల్లో సమృద్ధిగా ఈ సాక్ష్యం ఉన్నది.

Detailed English Translation:

❓ Question: Is Jesus Christ truly equal to God the Father? Some argue that since a son is always subordinate to a father, Jesus must be lesser than Jehovah. They claim He is not equal in status. What is your biblical response?

  • Status and Time Periods: Jesus’ status must be understood according to different ‘dispensations’ or time periods. He voluntarily changed His status based on the requirements of His redemptive mission.
  • The Decision in Philippians 2:6: Scripture states that Jesus, though being in the nature of God, did not consider equality with God something to be grasped or held onto at the cost of our salvation. This proves He was already equal; otherwise, there would be nothing to ‘give up.’ He made a conscious choice to step down from that equality for a specific period.
  • Stepping Out of Glory: To save mankind, He had to step out of His full divine glory. He descended to a lower status, voluntarily setting aside His divine equality. This act of ’emptying Himself’ was necessary to take on human form through the womb of Mary. It was during this incarnate state that He said, “The Father is greater than I.”
  • The ‘Second Jehovah’ in the Old Testament: However, in the Old Testament, the equality is absolute. In Exodus 23:20-21, God speaks of a Messenger (Angel) who carries His very Name—Jehovah. God warns that this Messenger will not forgive rebellion, implying His authority is final and non-negotiable, even by the Father in that context. This ‘Second Jehovah’ is presented as an equal in power and name.
  • Restoration of Pre-existent Glory: In John 17:5, as He prepared to finish His mission, Jesus prayed to be restored to the glory He had with the Father before the world began. This pre-existent glory was His divine equality. He set it aside for the incarnation and reclaimed it after the resurrection.
  • Conclusion: Jesus is equal to the Father before creation and after His ascension. He was only ‘subordinate’ during the brief period of His incarnation to serve as our sacrifice. Denying His equality is a result of academic research without spiritual revelation. True revelation confirms His eternal equality with the Godhead.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram