52.Q: What is Spiritual Revelation? (KSM 04) ✨

❓ ప్రశ్న: సార్ ఇక్కడ ఇప్పుడు చాలా సార్లు మీ ప్రసంగాల్లో కూడా వింటున్న మాట ఏంటంటే ప్రత్యక్షతను పొందుకోవాలి ప్రత్యక్షతను పొందుకోవాలి అంటే.. కొంతమంది బోధకులు వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృపావరణ బట్టి స్వస్థత పొందాలి స్వస్థతను పొందాలి అంటారు, కొంతమందేమో ఆత్మను పొందాలి ఆత్మను పొందాలి అంటారు. మీరేమో ప్రత్యక్షతను పొందాలి అని ఎక్కువగా వినిపిస్తా ఉంటుంది. అసలు ఈ ప్రత్యక్షత అంటే ఏమిటి దాన్ని ఎలా పొందుకోవాలి? (0:28:11)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 48s)

  • ఆత్మకు ఉన్న కళ్ళు: ప్రత్యక్షత అంటే – ప్రతి మనిషికి శరీరం ఉన్నది, శరీరానికి కళ్ళు ఉన్నాయి. అంతరంగ పురుషుడు లేక ఆత్మ.. ఆత్మకు కూడా కళ్ళు ఉన్నాయి. ఈ ఆత్మకు ఉన్నటువంటి కళ్ళు అదృశ్య ప్రపంచాన్ని, అదృశ్య దేవుని గూర్చిన వాస్తవాలను చూడటానికి ఈ లోపలి కళ్ళు అనేవి అవసరం.
  • 📖 దేవుడు కళ్ళు తెరవాలి: దేవుడు ప్రత్యక్ష పరిస్తే తప్ప ఆత్మీయ సంగతులు మనకు అర్థం కావు అనే సంగతి.. ప్రత్యక్ష పరచడం అంటే మన కళ్ళు దేవుడు తెరిచి మన కళ్ళకు ఈ సంగతులు చూపిస్తే తప్ప మనకు అర్థం కావు అనే సంగతి ఏసుప్రభు వారు పేతురుతో చెప్పాడు. మత్తయి సువార్త 16 వ అధ్యాయము 15, 16, 17 వచనాలు అందుకు ఆయన – “మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారు” అని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు – “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు” అని చెప్పెను. అందుకు యేసు – “సీమోను బరియోనా నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులను నీకు బయలుపరిచెనే గానీ నరులు నీకు బయలు పరచలేదు” అన్నాడు.
  • 🧱 సంఘానికి పునాది: ఈ బండ మీద నా సంఘమును కట్టుదును.. అంటే ఈ ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘము కట్టబడుతుంది అని ఇక్కడ ప్రత్యక్షత అంటే అర్థం ఏమిటంటే – దేవుడు నేరుగా జోక్యం చేసుకోవడం చేత అంతకు ముందు కనిపించని ఆధ్యాత్మిక విషయాలు మనకు కనిపించడం. ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయంలో మరి ఆయన మనకు ప్రత్యక్షత అనేది ఇస్తూ ఉన్నాడు.. 11, 12 వచనాలు ఆయన తన చిత్తానుసారముగా చేసినటువంటి ఆ సంకల్పమును బట్టి సమస్త కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు.
  • 🌊 మర్మములను తెలియజేయుట: తొమ్మిదవ వచనం – “ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు కృపను విస్తరించి చేసెను”. 17 వ వచనం చివరన కూడా – “మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు ఆయన అనుగ్రహించునట్లు నేను ప్రార్థన చేస్తున్నాను” అన్నాడు. కనుక తన చిత్తమును గూర్చిన మర్మాన్ని మీకు తెలియజేస్తాడు, జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇస్తాడు అని అంటే.. అది పరిశుద్ధాత్మ అభిషేకము చేత దేవుని కృప మనం పొందినప్పుడు అందరికీ కనిపించని సంగతులు మన కళ్ళకు కనిపిస్తా ఉంటాయి.
  • 🛡️ నిత్యజీవం మరియు ఆత్మ: అలాంటి సత్యం గోచరమయ్యే కన్నులు వచ్చినప్పుడే “యేసు రక్షకుడు” అని అర్థం అవుతుంది. యేసే రక్షకుడు అని అర్థం కావడానికి కళ్ళు తెరవబడ్డంత మాత్రాన ఆధ్యాత్మిక సంగతులు అన్నిటి కొరకు కళ్ళు తెరవబడవు. మళ్ళీ పదే పదే పదే అనేకసార్లు కొన్ని వందల సార్లు, వేల సార్లు కళ్ళు తెరవబడితేనే మనం సంపూర్ణ సత్యంలోకి వస్తాం. ఆ అనుభవం మనకు ఉంటే తప్ప ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళటం మానేసి ఆత్మను వదిలేసి అక్షరాన్ని పట్టుకుంటాం. అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. ప్రత్యక్షత లేకుండా బైబిల్ చదివితే అక్షరం దొరుకుతుంది. ప్రత్యక్షత ద్వారా బైబిల్ చదివితే బైబిల్ లో ఉన్న ఆత్మ దొరుకుతుంది, అది మనకు నిత్యజీవాన్ని కలిగిస్తుంది.

Detailed English Translation:

❓ Question: You often emphasize the need for ‘Revelation’ (Pratyakshata). While other preachers talk about receiving healing or the Holy Spirit, you focus on receiving revelation. What exactly is this spiritual revelation, and how can a believer obtain it?

  • The Eyes of the Inner Man: Every human has physical eyes, but the ‘inner man’ or the spirit also has eyes. These spiritual eyes are essential to perceive the invisible world and the profound truths concerning the invisible God.
  • The Rock of Revelation: Spiritual matters remain hidden unless God directly discloses them to us. In Matthew 16:15-17, when Peter recognized Jesus as the Christ, Jesus declared him blessed because “flesh and blood has not revealed this to you, but my Father in heaven.” Jesus then stated that His Church would be built upon this ‘Rock’—the Rock of Revelation.
  • Divine Intervention: Revelation means God’s direct intervention to show us spiritual realities that were previously invisible or misunderstood. In Ephesians 1:9 and 1:17, Apostle Paul mentions that God reveals the “mystery of His will” and prays that believers receive a “spirit of wisdom and revelation” to know Him better.
  • The Role of Anointing: This process happens through the anointing of the Holy Spirit. When we receive God’s grace, we begin to see truths that are hidden from the natural eye. Recognizing Jesus as Savior is just the first opening of these eyes. However, a believer needs their eyes to be opened hundreds or thousands of times more to grow into the ‘Fullness of Truth.’
  • Life vs. The Letter: Without continuous revelation, spiritual growth stops. A believer might hold onto the ‘letter’ of the Bible (the literal text) without understanding its ‘spirit.’ As Scripture warns, “The letter kills, but the Spirit gives life.” Reading the Bible with revelation allows you to find the Spirit behind the words, which brings eternal life.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram