59.Q: Legal Rights of Dalit Christians (BC-C) (KSM 04) 🆔

❓ ప్రశ్న: నిజామాబాద్ నుంచి రమేష్ గారు అడుగుతున్నారు – క్రైస్తవులుగా మారిన దళితులకు కుల ధృవీకరణ పత్రం (BC-C) విషయంలో ఉన్న చట్టపరమైన హక్కులేమిటి? ఈ మధ్య క్రైస్తవుల మీద.. బీసీ సర్టిఫికేట్ ఉంటే మొత్తం స్వీకరించాలి అని, క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళందరూ బీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని వార్తలు వస్తున్నాయి కదా! దీని వాస్తవం ఏంటి? (1:03:35)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 13s)

  • ⚖️ కోర్టు తీర్పులు: బ్రదర్ రమేష్ గారు, ఒక విషయం ఏంటంటే స్పష్టంగా సుప్రీంకోర్టు వరకు కూడా వివిధ కోర్టులు తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది ఏంటంటే – “మత విశ్వాసాలు మార్చుకున్న కులం మారదు” అని. మీరు రామున్ని నమ్మినా, కృష్ణున్ని నమ్మినా, ఇంకొక సాయి బాబాని నమ్మినా, యేసును నమ్మినా.. ఏ నమ్మినా అది మీ మత విశ్వాసం, వ్యక్తిగతమైన విషయం. కులము అనేది మారదు అనేది స్పష్టమైన తీర్పులు ఉన్నాయి.
  • 🚫 దుష్ప్రచారం: ఈ రోజుల్లో ఇది క్రైస్తవులను బెదిరించి, భయభ్రాంతులను చేసి క్రైస్తవ మత వ్యాప్తిని, సువార్త వ్యాప్తిని అరికట్టడానికి కొందరు చేస్తున్న దుష్ప్రచారం, అసత్య ప్రచారం. క్రైస్తవులు మీరు ఫైట్ (Fight) చేయండి. నేను ఫలానా కులంలో పుట్టాను అన్నది సామాజిక నేపథ్యం. ఫలానా దినాన నేను నా మత విశ్వాసం మార్చుకున్నాను, దానికి నా కులం ఎట్లా మారుతుంది? కులం అనేది సామాజికం. నన్ను నేను యేసుని నమ్మినంత మాత్రాన మా ఊరిలో బ్రాహ్మణులను పిలిచి పిల్లని ఇవ్వలేదు, వియ్యం అందలేదు.. గనుక ఇది తప్పున్నారా తప్పు!
  • 📜 కమిషన్ల నివేదికలు: జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా అదే చెప్పింది – మీరు ఏ మతంలో ఉన్నా సరే దళితులు దళితులేనని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా చెప్పింది. గనుక ఇది తప్పున్నారా తప్పు. క్రైస్తవులుగా మీరు మారితే గనుక మేము ఇక నుంచి ఎస్సీ (SC) లం కాదు, బీసీ (BC) లం అని మీరు తప్పకుండా తీసుకోవాలని ఒక ప్రభుత్వ అధికారి గనుక మిమ్మల్ని బలవంతం చేసినా మీరు కోర్టులో దాన్ని సవాల్ చేయొచ్చు.
  • 🛡️ బహిరంగ పిలుపు: సవాల్ చేయడానికి మా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ మీకు పూర్తి సహకారం అందిస్తుంది. మా ఖర్చు మీద మేము మా కోర్టు కేసు ఫైట్ చేస్తాం. ఇది నా సవాలు, ఇది నా బహిరంగ పిలుపు.. ఎవరు భయపడడానికి అవసరం లేదు. మీరు దళితులై ఉంటే.. యేసుని నమ్మకముందు దళితులయితే, నమ్మిన తర్వాత కూడా దళితులే. మీకు సర్వ హక్కులు ఉన్నాయి, అన్ని రాయితీలు మీరు అనుభవించొచ్చు. ఎందుకు ఇవ్వరో నేను చూస్తాను. సుప్రీం కోర్టు దాకా నేను ఫైట్ చేస్తాను. జై భీమ్!

Detailed English Translation:

❓ Question: What are the legal rights of Dalit Christians regarding caste certificates? There are rumors that those who convert to Christianity must give up their SC status and take BC-C certificates. Is this true? What does the law say?

  • Faith vs. Caste: Various courts, including the Supreme Court, have clearly stated that changing one’s religious faith does not change one’s caste. Whether you follow Rama, Krishna, or Jesus, it is a personal matter of faith. Caste, however, is a social identity determined by birth and social circumstances, and it remains unchanged regardless of conversion.
  • Fighting Deceptive Propaganda: The claim that Christians must forfeit their rights is a form of deceptive propaganda designed to intimidate believers and halt the spread of the Gospel. Caste is a social background; if a person’s social standing in their village doesn’t change after conversion (i.e., they still face the same social limitations), their caste status should logically remain the same.
  • Official Commissions: The Justice Ranganath Misra Commission explicitly stated that Dalits remain Dalits regardless of the religion they convert to. This has been supported by various legal precedents. If any government official forces you to change your certificate against your will, you have the right to challenge it in court.
  • Support and Challenge: Our ‘Rashtriya Kraistava Parishad’ is ready to provide full legal support and bear the expenses for such court battles. If you were a Dalit before believing in Jesus, you remain a Dalit afterward with full rights to social benefits. Do not be afraid of threats; we are prepared to fight for these rights up to the Supreme Court. Jai Bhim!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram