60.Q: Does the Human Soul Come from the Father or God? (KSM 04) 🌬️

❓ ప్రశ్న: మానవాత్మ తండ్రి వీర్యం నుండి వస్తుందా లేక దేవుడే ఇస్తాడా? హెబ్రీ 12:9 ఏం చెబుతుంది? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ప్రసంగీకుడు చెబుతూ – తల్లి గర్భములో పిండము రూపించబడేటప్పుడు తండ్రి లోపల నుండి వచ్చిన పదార్థములో కలిసి ఆత్మ వస్తుంది, ఆ ఆత్మనే తల్లి గర్భములో ఉండి తొమ్మిది నెలలు అయిన తరువాత బయటకు వస్తుంది అని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? (1:07:43)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 43s)

  • 🧠 పరిశోధన vs ప్రత్యక్షత: ఇది బైబిల్ రెవలేషన్ (Revelation) మానేసి, బైబిల్ రీసెర్చ్ (Research) పెట్టుకున్న వాళ్ళ బోధ అది. అవును, ప్రసన్న కుమార్ గారు అని ఆయన చెప్తున్నారు.. గాడ్ బ్లెస్ యు (God bless you). ఒక మాట ఏంటంటే – అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు తాను కొల్లగొన్నటువంటి ఆ కొల్ల సొమ్ములు అన్నిటిలోనూ దశమ భాగమును ఇచ్చాడు. అయితే అబ్రహాము యొక్క గర్భములో లేవి కూడా ఉన్నాడు.. అని హెబ్రీ 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు.
  • 🚫 తప్పుడు సిద్ధాంతం: దాంట్లో నుండి ఇప్పుడు వీళ్ళు ఈ రీసెర్చ్ వాళ్ళు తీసుకున్నది ఏంటంటే – “లేవి అబ్రహాము లోపల ఎట్లా ఉంటాడు? అబ్రహాము లో నుండి వస్తున్నటువంటి వీర్యకణములోనే లేవి అనే ఆత్మ కూడా వచ్చింది.. శరీరము తల్లి గర్భంలో తయారవుతుంది, అయితే ఆ స్పెర్మెటోజోవా (Spermatozoa) లోనే ఫాదర్ లో నుండి స్పిరిట్ (Spirit) కూడా వచ్చింది” అని వీళ్ళు చెబుతున్నది శుద్ధ తప్పున్నర తప్పు!
  • 📖 ఆత్మలకు తండ్రి దేవుడు: దయచేసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం తొమ్మిదవ వచనంలోనికి రండి – “మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా!”. మన బయోలాజికల్ ఫాదర్స్ (Biological fathers) ఎవరైతే ఉన్నారో, మన జన్మకు కారకులైన వారు శరీరమునకు తండ్రులు, ఆత్మకు తండ్రులు కాదు. ఆత్మలకు తండ్రి అయిన వాడు దేవుడు అని చెబుతున్నాడు ఇక్కడ.
  • 🌬️ మహాజ్ఞాని సొలొమోను సాక్ష్యం: ఆత్మ అనేది దేవుడు ఇస్తాడు, మన బయోలాజికల్ ఫాదర్ ఇవ్వడు అనే సంగతి ప్రసంగి 12:7 లో ఉంది – “మన్నయినది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరల పోవును.” కాబట్టి అది దేవుని వద్ద నుంచి వచ్చింది అని అర్థం. సంఖ్యాకాండం 27:15 లో మోషే కూడా – “యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా” అని ప్రార్థన చేస్తాడు.
  • ముగింపు: గనుక తండ్రి వీర్యంలో నుంచి ఆత్మ వచ్చేది అంతా కూడా అది ప్రత్యక్షత లేనటువంటి పనికిమాలిన సిద్ధాంతం. దాన్ని ఒప్పుకోవడానికి వీలు లేదు. అంతా మాకే తెలుసు అని పనికిమాలిన గర్వంతో సవాలు చేసే వాళ్ళకి రెవలేషన్ ఏముంటది? ఆ బోధ ఖచ్చితంగా తప్పు. తండ్రి వీర్యము నుండి ఆత్మ రాదు, పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఈ మూడు వాక్యాలు మనకు చెప్పినాయి. దట్ ఈజ్ ది ఆన్సర్ (That is the answer).

Detailed English Translation:

❓ Question: Does the human soul originate from the father’s seed or is it directly given by God? Hebrews 12:9 mentions the ‘Father of Spirits.’ Recently, a preacher claimed that the human soul enters the mother’s womb through the father’s biological matter. Is this scripturally accurate?

  • Research vs. Revelation: This teaching is a product of academic research without spiritual revelation. Some interpret the passage in Hebrews 7—which says Levi was still in the loins of Abraham when he met Melchizedek—to mean the soul is biologically transmitted through the father’s sperm. This is a grave theological error.
  • God as the Father of Spirits: Hebrews 12:9 makes a clear distinction: our earthly parents are the “fathers of our flesh,” but God is the “Father of Spirits.” Our biological fathers are responsible for our physical bodies, but the origin of our spirit is divine.
  • The Return of the Spirit: Ecclesiastes 12:7 states that at death, the dust returns to the earth, but “the spirit returns to God who gave it.” If the spirit returns to God, it logically means it came from Him, not from a biological process. Moses also addresses God as the “God of the spirits of all mankind” in Numbers 27:15.
  • Conclusion: The theory that the soul is transmitted through human seed is unscriptural. It stems from human pride and a lack of spiritual insight. The Bible consistently testifies that the body is from the parents, but the spirit is a direct gift from the Creator. The teaching that the soul comes from the father’s seed must be rejected as false.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram