❓ ప్రశ్న: అప్పగించిన ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు అప్పచెప్పడం వల్ల ఉరేసుకొని చనిపోయాడు కదా అయ్యగారు! అయితే యేసుక్రీస్తు ప్రవచన సారంగా కంపల్సరీ (Compulsory) ఈ భూలోకంలో పాపుల కోసం చనిపోవాలి. కాబట్టి ఇస్కరియోతు యూదా చేసింది పుణ్యమే కదా? పాపం ఎలా అవుతుంది? ఆయన అప్పగించబడకపోతే యజ్ఞం జరిగేది కాదు కదా! దీనిపై మీ వివరణ ఏంటి? (1:12:45)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 17s)
- ⚖️ న్యాయ సూత్రం – ఉద్దేశ్యం: సంతోషం స్వామి గారు, ఇంతకుముందు కూడా దీనికి నేను చెప్పాను. ఒక మంచి పనికి సహకరించిన ఉద్దేశము.. దురుద్దేశముతో సహకరించినప్పుడు అది మంచి పనిగా ఎంచబడదు. ఇది ఒక న్యాయ సూత్రము.
- 👺 యూదా దురుద్దేశం: వాడు ఏసుప్రభువును ద్వేషించి, పగబట్టి, వాడు పగతో ఆయన్ని సంహరించాలని చూశాడు. యేసుని ఎలా సంహరిద్దామా అని యూదుల పెద్దలు ఎదురు చూశారు, వీడు వెళ్లి ఆ 30 తులాల వెండికి ఆయనను అమ్ముకున్నాడు. అంతేగానీ వాడేమి – “యేసయ్య మరి నీవు యజ్ఞమై లేవకపోతే మాకు ఎవరికీ రక్షణ లేదు గనుక నువ్వు యజ్ఞం కావాలి, గనుక మరి మాకు రక్షణ అవసరం గనుక వాళ్ళకి నీ దారి చూపిస్తాను” అని చెప్పలేదు.
- 🚫 యూదా చెప్పని మాట: “దుర్మార్గులారా మీరు ఆయన్ని చంపాలనుకుంటున్నారు కానీ అది రక్షణార్థమైన యజ్ఞం రా! అదిగో గురువుగారు అక్కడున్నారు, మీరు తీసుకెళ్లి చంపుకోండి.. కానీ మీరు నరకానికి వెళ్తారు జాగ్రత్త, నా గురువు జాడ చెప్తున్నాను ఎందుకంటే మరి రక్షణ యజ్ఞం అవసరం గనుక” అని వాడు చెప్పలేదు.
- ⚖️ దేవుని తీర్పు: వాడి ఉద్దేశ్యమును బట్టి దేవుడు వానికి తీర్పు తీరుస్తాడు. ఏదో రకంగా మనకు ఉపయోగపడ్డాడు అని దేవుడు మార్కులు వేసేవాడు కాదు. ఒకవేళ నష్టమే జరిగినా సరే ఉద్దేశం మంచిదైనప్పుడు దేవుడు వాడిని కనికరిస్తాడు. లాభమే జరిగినా సరే ఉద్దేశం రాంగ్ (Wrong) అయినప్పుడు తప్పక దేవుడు దండిస్తాడు. ఉద్దేశమును బట్టి దండన లేక బహుమానం. ఆ.. ఓకే బ్రదర్ రైట్. థాంక్యూ.
Detailed English Translation:
❓ Question: Since Jesus had to die for the sins of the world according to prophecy, wasn’t Judas Iscariot’s act of betraying Him actually a virtuous deed? If he hadn’t betrayed Jesus, the sacrifice wouldn’t have happened. So, why is it considered a sin?
- The Principle of Intent: A fundamental principle of divine justice is that an action is judged by the intent behind it. Even if a positive outcome results from a negative action, the act itself is not considered virtuous if the intention was evil.
- Judas’ Malice: Judas did not betray Jesus to fulfill a divine plan or to help save humanity. He did it out of greed, hatred, and malice. He sold his Master for thirty pieces of silver. He conspired with the religious leaders who were looking for an opportunity to kill Jesus.
- Lack of Spiritual Purpose: Judas never said, “I am showing the way to my Master because a sacrifice is needed for the salvation of mankind.” He didn’t warn the persecutors of their sin while facilitating the prophecy. His heart was purely set on betrayal and personal gain.
- Divine Judgment: God does not reward people simply because their actions accidentally served a greater purpose. God judges the heart. Even if an act results in great benefit (like the crucifixion leading to salvation), the person who committed the act with a wrong intent remains guilty. Conversely, if a person’s intent is pure but the outcome is poor, God is merciful.
- Conclusion: Reward and punishment are based on intent. Judas’ intent was treason and greed, and therefore, he faced the consequences of his sin. He was a tool of prophecy through his rebellion, not through his obedience.
