62.Q: Response to the Controversy Over Prayer for Persecuted Christians (KSM 05) 🛐

🛐 ప్రశ్న: అన్యాయంగా హింసించబడుతున్న క్రైస్తవుల కోసం మీరు చేసిన ప్రార్థనపై జరుగుతున్న దుమారంపై మీ స్పందన ఏమిటి? ఈ వారంలో పెద్ద దుమారమే లేచింది.. సోషల్ మీడియా నిండా, టీవీ5 లోనూ, రక్షణ టీవీ లోనూ డిబేట్స్ జరిగాయి. కొద్ది కాలం క్రితం మీరు చేసిన ప్రార్థనపై ఈ దుమారం లేచింది కదా! దీని పట్ల మీ ఉద్దేశం ఏంటి? (0:01:48)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (9m 14s)

  • 🛐 వ్యక్తిగత విన్నపం: మొట్టమొదటి విషయము – అది దేవునికి నేను చేసిన ప్రార్థన. ఒక భక్తుడు తన దేవునితో ఏమేమి మాట్లాడుకుంటాడు అనేది ఇతరులు కామెంట్ (Comment) చేయాల్సిన విషయం కాదు. నేనేదో బాధపడి, కడుపు మండి, నా గుండె మంట నా కడుపు మంటను దేవునికి చెప్పుకున్నాను.
  • 🚫 హింస మరియు అన్యాయం: ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే – మతోన్మాదులు దారుణంగా క్రైస్తవులను హింసిస్తున్నారు, అన్యాయంగా హింసిస్తున్నారు. మతోన్మాదులు క్రైస్తవులను హింసిస్తుంటే లా అండ్ ఆర్డర్ (Law and Order) మెయింటైన్ చేయవలసిన పోలీసు అధికారులకు, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ (Complaint) చేస్తే.. అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ “మరి మీరు మత ప్రచారం ఎందుకు చేస్తున్నారండి? మీరు చేయకూడదు కదా!” అని పోలీస్ ఆఫీసర్సే అంటున్నారు. అసలు మత ప్రచారం అనేది మన ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్ (Fundamental Rights) లో ఒకటి అనేది పోలీస్ అధికారులకు తెలియదు అనుకోవాలనా లేకుంటే వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ (RSS) భావజాలంతో నింపబడ్డారని అనుకోవాలనా? తెలియదు.
  • ⚖️ రాజ్యాంగ విరుద్ధం: ఎన్నో చోట్ల క్రైస్తవ సువార్తికులు సువార్త ప్రకటిస్తుంటే భయంకరంగా వాళ్ళు రక్తాలు కారేటట్టు కొడుతున్నారు. ఇలా ఉప్పల్లో జరిగింది, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్.. అనేక చోట్ల జరిగింది, ఈస్ట్ గోదావరిలో జరిగింది. రక్తాలు కారే గాయాలతో పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ (Register) చేసుకోలేదు, సర్ది చెప్పి పంపించారు. కానీ వీళ్ళు ఏమి నోరు విప్పకుండా సైలెంట్ గా కరపత్రాలు పంచుకుంటుంటే “వీళ్ళు మత దూషణ చేశారు, మా దేవతలను దూషించారు” అని ఫాల్స్ (False) కేసు పెడితే అర్జెంటుగా ఎఫ్.ఐ.ఆర్ (FIR) బుక్ చేసేస్తున్నారు. కంచి చేను మేసినట్టుగా ఉంది భారతదేశంలో పరిస్థితి.
  • 🛡️ మొర ఎవరికి?: సరే ఇప్పుడు ఊర్లో వాళ్ళు కొడితే అమ్మకు పోయి చెప్పుకుంటామా? అమ్మే కొడుతుంటే ఏం చేయాల? ఇప్పుడు పడవ మునిగిపోకుండా నావికుడు కాపాడాలి, నావికుడే పడవను ముంచేస్తుంటే అప్పుడు ఏం చేయాల? భారతదేశంలో ఆ పరిస్థితి ఉన్నది. అధికారులు కూడా ఆర్ఎస్ఎస్ భాష మాట్లాడుతున్నారు, బాబాసాహెబ్ రాసి ఇచ్చిన రాజ్యాంగ పరిభాష మాట్లాడడం లేదు. అలాంటప్పుడు మరి బాధ ఎవరికి చెప్పుకుంటాం? దేవునికి చెప్పుకున్నాం.
  • దైవ నిర్ణయం: దేవునికి మేము చెప్పుకున్న దాని గురించి.. దేవుడు ఒకవేళ ఆయన సర్వజ్ఞుడు, ఆయన మా కింద నౌకరు కాదు, మేము ఆయన కింద నౌకరులము. దేవునికి మా బాధ చెప్పుకున్నాము, ఆయన వింటే వింటాడు లేకుంటే తప్పు బిడ్డ ఆ మాట అడగొద్దు వాళ్ళని కూడా నేను రక్షిస్తానని ఆయన చెప్తాడు, అది ఆయన ఇష్టము. మమ్మల్ని బాధ పెట్టేది వాళ్ళు, మళ్ళీ మేము బాధపడి దేవునికి మొర పెట్టకుండా అట్లా మొరపెట్టొద్దు అనేది.. ఇదేమి బద్మాషి, ఇదేమి దుర్మార్గం అండి? నేను ఎవరిని కొట్టలేదు, పోయి కొట్టండి అని ఎవరికీ చెప్పలేదు. దేవునికి నేను కంప్లైంట్ ఇచ్చాను ఎందుకంటే అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండట్లేదు కాబట్టి.
  • 🔥 సమర్థన: ఈ క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్న క్రైస్తవ జాతి మొత్తం నాశనం చేయాలి అని జపాలు, హోమాలు చేయాలని పిలుపునిచ్చిన హిందూ నాయకులు ఉన్నారు, హిందూ పీఠాధిపతులు ఉన్నారు.. మరి అది తప్పు అనిపించలేదా ఎవరికీ? నేను జాతిని నాశనం చేయమని అనలేదు. ఏ వ్యక్తులైతే రాజ్యాంగానికి భిన్నంగా, వేదసారానికి భిన్నంగా మతోన్మాదంతో ప్రవర్తిస్తున్నారో ఆ వ్యక్తులను శిక్షించమని దేవుని అడిగాను. మరి వాళ్ళ పీఠాధిపతులు పిలుపునిచ్చినప్పుడు ఎవరికీ చీమ కుట్టినట్లు లేదా? గనుక నేను చెప్తున్నా – నా ప్రార్థనను తప్పు పట్టిన ప్రతివాడు ఒక వెధవ, నర వెధవ అని అంటున్నాను నేను.
  • ⚠️ ముగింపు: నా పర్సనల్ (Personal) గా నా మనసు మండి నా గుండె మండి.. దేవా ఇంత అన్యాయం జరుగుతున్నది వీళ్ళని శిక్షించమని నేను దేవునికి చెప్పాను. నా ప్రార్థన తప్పు ఒప్పు అని జడ్జిమెంట్ (Judgment) చేసే హక్కు ఎవడికీ లేదు. నో హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎనీ రైట్ టు కామెంట్ ఆన్ మై ప్రేయర్ (No human being has any right to comment on my prayer). ఈ దేశంలో నమ్మిన విశ్వాసాన్ని ప్రచారం చేసే హక్కు లేకపోతే పోయింది, దేవునికి మొరపెట్టుకునే హక్కు కూడా లేదా? ఇదేం దేశం అండి? చాలా దుర్మార్గము. మీడియా ప్రముఖులకు కూడా నేను వార్నింగ్ (Warning) ఇస్తున్నా – ఆ ప్రార్థన మీకు కూడా వర్తిస్తది. మత సామరస్యానికి భంగకరంగా ఎవరు పని చేస్తున్నారో వాళ్ళని దేవుడు శిక్షించాలని నేను ప్రార్థన చేశాను.

Detailed English Translation:

❓ Question: What is your response to the huge controversy surrounding your prayer for Christians who are being unjustly persecuted? The media and TV channels have held debates on this. What is your perspective on this uproar?

  • A Private Appeal to God: First of all, the prayer was my private communication with my God. No one has the right to comment on or judge what a believer discusses with their Creator. Out of deep pain and a sense of injustice, I poured out my heart’s agony to God.
  • Persecution and Systemic Failure: I was compelled to pray this way because radical elements are brutally and unjustly persecuting Christians. When we approach the police for protection, many officers, instead of upholding law and order, ask why we are preaching. This shows a complete disregard for the fundamental rights guaranteed by the Constitution. It feels as if some officials have prioritized an ideological agenda over their constitutional duty.
  • Unfair Law Enforcement: In many places like Uppal, Karimnagar, and East Godavari, evangelists are beaten until they bleed. When they report these assaults, FIRs are often not registered. Conversely, when false accusations of ‘insulting gods’ are made against Christians who were peacefully distributing tracts, FIRs are filed instantly. It is like the fence eating the crop.
  • To Whom Shall We Cry?: If the protector becomes the oppressor, where should we go? When the legal system and officials speak the language of an ideology rather than the Constitution, our only recourse is God.
  • Divine Sovereignty: God is the ultimate Judge. He is not our servant; we are His. I took my complaint to Him. He may answer it as requested, or He may tell me to endure and love those who hate me. That is between me and my God. For others to interfere and say we shouldn’t even cry out to God is pure malice.
  • Double Standards in Society: Hindu leaders and pontiffs have openly called for rituals and ‘homams’ to destroy the entire Christian race. Why was there no media outcry then? I didn’t ask for the destruction of a race; I asked God to punish specific individuals who act against the Constitution and communal harmony.
  • Conclusion: I assert that no human being has the right to judge my prayer. If this country denies us the right to preach, does it also deny us the right to pray? I warn those in the media who fan these flames—my prayer for God to punish those who disrupt communal harmony applies to you too. We will continue to seek divine justice where human justice fails.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram