6.Q: Can Christians Watch Movies and Entertainment? (KSM 01) 🎬

🎬 ప్రశ్న: సార్, ఇప్పుడు క్రైస్తవులు సినిమాలు చూడొద్దు అంటున్నారు. అయితే క్రైస్తవులు సినిమాలు చూడొచ్చు ఎందుకంటే మనమే సినిమాలు తీస్తున్నాం అంటున్నారు. ఈ సినిమా చూడడం వల్ల కొంతమంది ఆత్మీయంగా అంటే దిగజారే స్థానంలో ఉండొచ్చు, అంటే పడిపోయి కొంచెం తక్కువయే స్థానంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా! చూడడం వల్ల ఈ క్రికెట్ గాని, ఈ సినిమాలు గాని, ఈ టీవీ సీరియల్స్ గాని వీటి వలన మనకు క్రైస్తవులకు ఏమైనా ప్రయోజనం ఉందా అంటారా సార్? (0:31:35)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (6m 05s)

  • 📺 సాంకేతిక పరిజ్ఞానం: మంచి ప్రశ్న అడిగారు రాజు గారు, చాలా వందనాలు. ఒక విషయం ఏంటంటే – సినిమా అనేది ఒక టెక్నాలజీ (Technology), అదొక సాంకేతిక పరిజ్ఞానము. మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ (Media of communication), సమాచారం ప్రజలకు చేరవేయడానికి, సందేశం చేరవేయడానికి ఉన్నటువంటి మాధ్యమాలలో అదొకటి. ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఫిల్మ్ కూడా ఒక మీడియా.
  • 🎭 మాధ్యమాన్ని వాడుకునే విధానం: అయితే ఇప్పుడు ఈ ఫిల్మ్ మీడియాను సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు, అన్ని విశ్వాసాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బలపరుచుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి వాడుకుంటున్నారు. వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు దానికి అనుకూలమైన కథలతో, కథనాలతో సినిమా తీశారు. నాగదేవత మహిమలని, లేకపోతే ఫలానా బాబా వారి మహిమలని, ఫలానా దేవుళ్ళ మహిమలని ఇలాగా తీశారు. మరి కొంతమంది నాస్తికత్వాన్ని ప్రోత్సహించడానికి, రాజకీయ సందేశాలు ఇవ్వడానికి ఇలాగా చేశారు. అందులో యేసు ప్రభువును గూర్చి చెప్పటానికి కూడా ఫిల్మ్ మీడియాను మన వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా వాడుకున్నారు.
  • 🎬 క్రైస్తవ సినిమాలు: ఇప్పుడు సినిమా చూడొద్దు అని రూల్ చేస్తే మరి ‘ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్’ (Passion of the Christ) ఎందుకు ఎగబడి చూస్తున్నారు? ‘కరుణామయుడు’ ఎందుకు సూపర్ హిట్ అయింది? కరుణామయుడు, దయామయుడు, ద బైబిల్ (The Bible), బెన్ హర్ (Ben-Hur), 10 కమాండ్మెంట్స్, ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్.. ఇలాగ ఎన్నో క్రిస్టియన్ సినిమాలు వచ్చినాయి. గనుక ఇక్కడ బేసికల్లీ సినిమా చూడడం తప్పు, సినిమా చూడడం నిషిద్ధం అనేది మనం అలాగ మాట్లాడకూడదు.
  • 🔪 కత్తి ఉదాహరణ: యాక్చువల్ గా టెక్నాలజీ అనేదాన్ని అది అందుబాటులో ప్రజల్లో చలామణిలోకి వచ్చినప్పుడు అది చెడ్డవాళ్ళు వాడుకుంటారు, మంచి ఉద్దేశం కొరకు వాడే వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ (Printing press) ఏ ఉన్నది. ప్రింటింగ్ ప్రెస్ ఉంటే మరి భగవద్గీత, బైబులు, కొన్ని శాస్త్రీయ గ్రంథాలు ఇటువంటివి ప్రింట్ అవుతున్నాయి. కొన్ని పోర్నోగ్రాఫిక్ బుక్స్ (Pornographic books) కూడా ప్రింట్ అవుతున్నాయి. మరి ప్రింటింగ్ మెషిన్ అనేది వచ్చినప్పుడు బూతు సాహిత్యం, అపవిత్ర సాహిత్యం ప్రింట్ చేస్తున్నారు, భగవద్గీత రామాయణం బైబిల్ ఖురాన్ ప్రింట్ చేస్తున్నారు. కనుక టెక్నాలజీ ఎవరి చేతిలోకి వెళ్ళిందో వాడు దుర్మార్గుడు అయితేనేమో దుర్మార్గం కొరకు వాడుకుంటాడు, మంచివాడైతే మంచి కోసం వాడుకుంటాడు. చాకు తయారు చేస్తారు, టమాటాలు కోయొచ్చు పీక కూడా కోయొచ్చు. కనుక చాకులు చేయొద్దు అని రూల్ చేయకూడదు, చాకులు అవసరమే. అయితే పీకలు కోయకుండా చూసుకోవాలి.
  • 💎 ప్రక్షాళన చేసే సినిమాలు: విషయం ఏంటంటే ఫిల్మ్ అనే మాధ్యమము ద్వారా మరి మనం మంచి చేయదలుచుకుంటే దానికి విస్తారమైనటువంటి ఆ స్కోప్ (Scope) ఉన్నదన్నమాట, అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ – అంబేద్కరిజమే ఉన్నది, కుల వివక్ష నిర్మూలన ఉన్నది, మతోన్మాదాన్ని నిర్మూలించాలనే సందేశం ఉన్నది. ఆ దిశలో వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ‘1942 ఒక గ్రామం’ అనే ఒక సినిమా వచ్చింది చాలా సూపర్ హిట్ మూవీ. అందులో కులాంతర వివాహాన్ని ఒక బ్రాహ్మణ పురోహితుడు అగ్రహారంలో ప్రోత్సహించి చేయడం, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయడం.. 1942 ఒక గ్రామం అది మీరు చూడకపోతే చూడండి, ఎక్సలెంట్ మూవీ. నేను అనుకుంటున్నా అట్లాంటి మూవీస్ ఇంకా వందల కొలది రావాల్సిన అవసరం ఉంది. ఆ ‘1942 ఒక గ్రామం’ అనే ఆ మూవీ లాంటి సినిమాలు ఇంకొక వెయ్యన్న రావాలి, భారతదేశం అంతా ప్రక్షాళన అయిపోతుంది.
  • ⚖️ ముగింపు: గనుక సినిమాలు మనం చూడొచ్చా అంటే – చెడ్డ సినిమాలు చూడకండి. కొన్ని సినిమాలు వచ్చినాయి, టెన్త్ క్లాస్ లో ఉన్న అబ్బాయి ఆ టీచర్ ని చూసి మోహిస్తాడు లవ్ అఫైర్, అటువంటివి మనం ఖండించాలి. ఈ మీడియా పెద్దలు కూడా కొంచెం ఆలోచించి అట్లాంటి సమాజానికి డ్యామేజ్ కలిగించే సినిమాలు తీయకుండా.. ఇప్పుడు ‘శంకరాభరణం’ ఉన్నది, మహోన్నతమైనటువంటి సందేశంతో విశ్వనాథ్ గారు, కళాతపస్వి విశ్వనాథ్ గారు తీశారు, వారికి ఆ ఈ మీడియా ద్వారా కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. అలాగే చాలా మంచి మంచి ఫిలిమ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి సినిమా అనగానే బేసికల్లీ బ్యాడ్ కాదు, బేసికల్లీ గుడ్ కాదు. సినిమా అనేది గుడ్ బ్యాడ్ అంటే ప్రింటింగ్ మెషిన్ గుడ్ బ్యాడ్ అన్నట్టు ఉంటది. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, అంతర్జాలం. ఇంటర్నెట్ లో కూడా మరి పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ ఉంది, ఆధ్యాత్మికంగా మనకు ఎంతో అభివృద్ధి కలిగించే మెటీరియల్ ఉంది. ఆడియో బైబిల్స్ ఉన్నాయి, అన్ని వర్షన్స్ ఆఫ్ బైబిల్స్ ఉన్నాయి, భక్తుల ప్రసంగాలు ఉన్నాయి. మరి బ్యాడ్ కావాలనుకున్నోడు బ్యాడ్ కి వాడుకుంటాడు, గుడ్ కావాలంటే గుడ్ వాడుకుంటాడు. అది సంగతి బ్రదర్ రాజు గారు. సో మన డిస్కషన్ మీద ఆధారపడి ఉంది తప్ప బేసికల్లీ సినిమా చెడ్డది అంటే నేను ఒప్పుకోనండి. సినిమాను చెడ్డది అనేకంటే దాన్ని వాడుకొని దాని ద్వారా సువార్త చేయడం మంచిది.

Detailed English Translation:

🎬 Question: Some say Christians should not watch movies at all, while others say we can since we produce Christian films. Can entertainment like movies, cricket, or TV serials cause spiritual damage, or is there any benefit for a Christian?

  • Technology as a Neutral Medium: Film is simply a technology—a tool for communication, just like the printing press. Whether a medium is ‘good’ or ‘bad’ depends entirely on who is using it and for what purpose.
  • The Analogy of the Knife: Think of a knife. It can be used to cut vegetables for a meal or to harm someone. We don’t ban knives because of their potential for misuse; we focus on using them correctly. Similarly, the printing press produces Bibles but also harmful content. Technology itself is neutral.
  • The Power of Christian and Social Cinema: If we ban movies, we miss out on powerful tools like ‘The Passion of the Christ’ or ‘Karunamayudu,’ which have touched millions. Cinema can also be a vehicle for social reform, addressing issues like the caste system and religious fanaticism. Films like ‘1942 Oka Gramam’ or the works of K. Viswanath provide meaningful messages that can spiritually and socially cleanse a nation.
  • Discernment is Key: The issue isn’t the ‘movie’ but the ‘content.’ We should condemn movies that promote immorality or damage social values. On the internet, you can find pornography or you can find the Word of God. The choice lies with the individual. Instead of labeling all cinema as evil, we should use this powerful medium to spread the Gospel and promote human values.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram