7.Q: Constitutional Rights and Responding to Gospel Opposition (KSM 01) 📢

📢 ప్రశ్న: ఇప్పటికే మీరు చాలాసార్లు ఖండించారు ఈ యొక్క క్రైస్తవుల మీద, చర్చెస్ మీద, పాస్టర్స్ మీద జరుగుతున్నటువంటి దాడులను. నిన్నటి దినముననే ఖమ్మంలో మరొకసారి సువార్త ప్రకటిస్తున్న యూత్ అందరూ కలిసి సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది వచ్చి – “మీరు ఇలా పబ్లిక్ లో ఎందుకు ప్రకటిస్తున్నారు ఈ అన్యమత ప్రచారాన్ని? ఇలా ప్రకటించొద్దు కదా” అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని రప్పించి వాళ్ళని అక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది. ఆ సమయంలో వారు అడుగుతా ఉంటే జవాబు చెప్పలేకపోతున్నారు వీళ్ళు. సువార్త ప్రకటించే వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతా ఉన్నారు – “మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు? ఎవరు ప్రకటించమన్నారు? మీకు రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చిందా?” అని అడిగినప్పుడు ఇటువంటి సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న వారికి ఏ విధముగా జవాబులు చెప్పాల్సిన అవసరం ఉన్నది? (0:37:51)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (11m 31s)

  • 🧠 ఆలోచన విధానం మారాలి: ఇప్పుడు ప్రప్రథమంగా ప్రతి వ్యక్తి క్రైస్తవుడే కాదు, ప్రతి వ్యక్తి కూడా సరైన ఆలోచన విధానం అలవరుచుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులు అన్నారు, ఏ విధంగా సమాధానం చెప్పాలి అని మీరు అడుగుతున్నారు. అసలు నాకు ఎదురయ్యే సిచుయేషన్ లో నేను కరెక్ట్ గా మాట్లాడాలి, సరైన సమాధానం ఇవ్వాలి, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించాలి అనే కాన్సెప్ట్ క్రైస్తవులకు ఉండాలి కదా!
  • 🐑 తప్పుగా పెంచబడ్డ క్రైస్తవ్యం: ఇప్పుడు క్రైస్తవ బోధకులు, నాయకులు ఎలా పెంచారంటే – మీరు గమ్ముగా ఊరుకోండి, మాట్లాడకండి, నోరెత్తకండి, వాళ్ళు కొడితే దెబ్బలు తినండి, వాళ్ళు తిట్టినా సరే తిట్లు పడండి, మీరు ఏమి మాట్లాడొద్దు, మౌనంగా బతుకు కోయబడే గొర్రెలాగా యేసు ప్రభువు లాగా మీరు ఉండాలి అని నేర్పించారు. వాళ్ళు సండే స్కూల్ లెవెల్ నుంచి, బాల్యం నుండి మీసాలు వచ్చేదాకా, పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు తండ్రులు అయ్యేదాకా వాళ్ళను – మీరు తిరగబడొద్దు, ఎదురు చెప్పొద్దు, సమాధానం చెప్పొద్దు అని పెంచి ఇప్పుడు సడన్ గా ఇలా సమాధానం చెప్పమంటే అసలు రక్తంలోనే లేదు ఆ తత్వము.
  • 📢 అన్యాయాన్ని ఎదిరించాలి: అందుకే నేను 40 సంవత్సరాలుగా నేను ఒక తరాన్నే తయారు చేశాను. అన్యాయాన్ని ఎదిరించని వాడు అసలు క్రైస్తవుడే కాదు, భక్తుడే కాదు, వాడు మంచి మనిషే కాదు ఫస్ట్ అఫ్ ఆల్. లీవ్ ఎలోన్ గుడ్ క్రిస్టియన్ (Leave alone good Christian), గుడ్ క్రిస్టియన్ అనేది హిమాలయన్ హైట్ అది, అంతరిక్షం అంత ఎత్తు. మంచి క్రైస్తవుడు అనేది అంతరిక్షమంత ఉన్నత స్థానం. ఒక మనిషిగానే వాడు మంచోడు కాదు ఫస్ట్ అఫ్ ఆల్. అన్యాయాన్ని ఎదిరించాలి. ఏదైనా అక్రమము జరిగితే దానికి మనం అక్కడే వ్యతిరేకత, దాన్ని అపోజ్ (Oppose) చేసి దాన్ని ఆపాలి. ఆపడానికి ప్రయత్నమైనా చేయాలి, ఆపలేకపోవచ్చు ప్రయత్నమైనా చేయాలి.
  • 🇮🇳 రాజ్యాంగబద్ధమైన సమాధానం: ఇప్పుడు ముందు ముందు ఈ ఆటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఆ ఆటిట్యూడ్ డెవలప్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ చెప్తాను, అప్పుడు మీరు అడిగిన ప్రశ్న వస్తది. ఏంటంటే ఏ విధంగా సమాధానం ఇవ్వాలంటే – వెరీ సింపుల్ వెరీ సింపుల్. ఇప్పుడు వీధులలో ‘హరే కృష్ణ హరే రామ’ భజన చేస్తూ ఇస్కాన్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. బోనాల పండుగ జరుగుతది, బోనాల ఊరేగింపు జరుగుతుంది, గణేష్ నిమజ్జన ఊరేగింపు జరుగుతాయి. అయితే మన దేశంలో ఇష్ట దైవాన్ని బహిరంగంగా ఆరాధించుకోవడం, పూజించుకోవడమే కాకుండా ధర్మ ప్రచారాలు చేయడం కూడా మన దేశంలో అది సంప్రదాయము.
  • ⚖️ చట్టం అందరికీ ఒకటే: పబ్లిక్ గా ఎందుకు చెబుతున్నావు నువ్వు, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండాలా అని అంటే – మరి అదే చట్టం అందరికీ వర్తింపజేయాలి. క్రైస్తవులు గనుక వీధుల్లోకి రాకూడదు, వాళ్ళ దేవుని నామం ప్రకటించొద్దు అంటే – ఇంకా ఇతర దేవతలను మొక్కే వాళ్ళు హైందవం గాని, ఇస్లాం గాని ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు. ఎవరి ఇళ్లల్లో ఎవరి గుళ్ళలో వాళ్ళు ఉండాలి. అంటే ఒక వర్గం వాళ్ళైతే వీధుల్లోకి రావచ్చు, ప్రకటించుకోవచ్చు, భజనలు చేయొచ్చు, క్రైస్తవులు మాత్రమే రావద్దు అనేది అది మనస్సాక్షికి విరుద్ధము, న్యాయానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధము, మానవత్వానికి విరుద్ధం.
  • 📜 ప్రాథమిక హక్కు: అసలు రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కు ప్రాథమిక హక్కులలో ఒకటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు పొందుపరిచి మనకు ఇచ్చినటువంటి అద్భుతమైన అపురూపమైన రాజ్యాంగంలో మనకు ఇవ్వబడ్డ హక్కు ఏంటంటే – ఏ భారత పౌరుడైనా తనకు నచ్చిన మతాన్ని విశ్వసించవచ్చు, అవలంబించవచ్చు, తాను హృదయంలో ఏది నమ్ముకున్నాడో దాన్ని ఇతరులకు తాను ప్రచారం చేయొచ్చు. ఈ ప్రచారాన్ని విన్నవాడు నిర్ణయించుకోవాలి – ఇది బాగుంది అనుకుంటే అతడు కూడా నమ్మొచ్చు, లేకపోతే దాన్ని వదిలేయొచ్చు. సో బిలీవింగ్ ఎనీ రిలిజియన్ అండ్ ప్రాపగేటింగ్ ద రిలిజియన్ ఐ బిలీవ్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ ఇన్ ఇండియా (So believing any religion and propagating the religion I believe is our fundamental right in India).
  • 👮 పోలీస్ పర్మిషన్ అక్కర్లేదు: “మీరు ఎందుకు బయటక వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు? మీకు పోలీస్ పర్మిషన్ ఉందా?” అని అడిగినవాడు ఒట్టి చవట, వాడు ఒక మూర్ఖుడు. అసలు రాజ్యాంగబద్ధంగా నేను అడుగుతున్నాను – క్రిస్టియన్స్ పర్మిషన్ ఉంటేనే ప్రచారం చేసుకోవాలని ఏ అధికరణంలో ఉంది? ఈ రోజుల్లో దీని మీద కేసులు పెట్టడం, కొన్ని పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేయడం, రిజిస్టర్ చేయడం చాలా దురదృష్టకరం. అధికార యంత్రాంగమే రాజ్యాంగానికి విరోధంగా పని చేస్తున్నదా అని అనుమానం కలుగుతా ఉన్నది. ఏ అధికరణంలో ఉంది పర్మిషన్ తీసుకొని చెప్పుకోవాలి అని? ఏ అధికరణలో కూడా లేదు.
  • 🗳️ సంఘటిత శక్తి: మనకు గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు తర్వాత ఎన్నెన్ని పండగలు వస్తా ఉంటాయి. ఆ గూబలు పగిలేంత పెద్ద సౌండ్ పెడుతుంటారు. క్రైస్తవులు, ముస్లింలు ఊరుకోవట్లేదు? వాళ్ళ పండగ అండి కానివ్వండి పర్వాలేదు, లెట్ దెమ్ ఎంజాయ్ (Let them enjoy) అనుకుంటారు గమ్ముగా ఊరుకుంటారు. కానీ క్రైస్తవులు వస్తే కొడతారు, చంపుతారు, మానభంగాలు చేస్తారు, చర్చిలు కూల్చివేస్తారు. ఈ విషయంలో క్రైస్తవులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి సంఘటితమై – మనం వాళ్ళని కొట్టనక్కర్లేదు, తిట్టనక్కర్లేదు – “మా హక్కులు మాకు వర్తింపజేయండి లేకపోతే మేము ఒక ఓటు బ్యాంకు గా తయారయ్యి వచ్చే ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం” అని క్రైస్తవులందరూ గనుక ఏకం కాగలిగితే తప్పక ఈ ఇన్సేన్ ఆటిట్యూడ్ (Insane attitude), ఈ ఉన్మాదం అనేది సమాజంలో వచ్చి ప్రక్షాళన అయిపోతుంది. తప్పకుండా అది ఆ ఉన్మాదాన్ని తొలగించాల్సిన బాధ్యత మనకుంది.

Detailed English Translation:

📢 Question: Recently, youths preaching the Gospel in Khammam were harassed and dispersed by the police after locals objected to ‘public religious propagation.’ How should we respond legally and biblically to such opposition?

  • A Flawed Theology of Silence: For generations, Christian leaders have groomed believers to be silent, passive, and to suffer in silence like “sheep led to the slaughter.” This attitude has made us easy targets. A person who doesn’t resist injustice is neither a good citizen nor a good believer. True humanity requires us to stand against wrong wherever we see it.
  • Equality Under the Law: Our country celebrates public religious displays—be it ISKCON’s ‘Hare Krishna’ bhajans, Bonalu processions, or the massive scale of Ganesh Chaturthi celebrations. If one community has the right to be on the streets with loud music and public displays, the same right applies to Christians. If Christians are forbidden from the streets, then every religious procession in India must also stay within their homes and temples.
  • Constitutional Fundamental Right: Dr. B.R. Ambedkar ensured that the Indian Constitution grants every citizen the right to follow, practice, and propagate the religion of their choice. It is the fundamental right of a believer to share their faith, and it is the listener’s choice whether to accept it or not.
  • The Myth of ‘Permission’: There is no legal article that requires a citizen to obtain police permission specifically for talking about their faith in public. To ask “Where is your permission?” is a mark of ignorance. When law enforcement records cases against people for simply sharing a religious message, they are acting against the spirit of the Constitution.
  • Political Solidarity: Religious fanaticism is an illness that needs social and political treatment. Christians don’t need to resort to violence. Instead, they must unite as a formidable ‘Vote Bank.’ When the authorities and politicians realize that mistreating Christians will cost them power at the polls, they will begin to uphold our constitutional rights. Unity is the only way to end this madness.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram