💧 ప్రశ్న: అయ్యగారు, యోహాను సువార్త నాలుగవ అధ్యాయము 14వ వచనములో – “నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్యజీవముకై వానిలో ఊరేడు నీటిబుగ్గగా ఉండును” అని ఆమెతో చెప్పెను. అయ్యగారు, ఒక విశ్వాసి ఇలా నీటి బుగ్గగా ఎలా మారుతాడు? అప్పుడు యేసుక్రీస్తుకు, విశ్వాసికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? (0:53:52)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 13s)
- 💧 విశ్వాసి కాదు – ఆత్మే నీటి బుగ్గ: “నేను ఇచ్చెడి నీళ్లు అతనిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును” అన్నాడు కానీ, విశ్వాసి నీటి బుగ్గ అవుతాడు అనలేదు ఆయన. గనుక నీటి బుగ్గ అనేది పరిశుద్ధాత్మ దేవుడే. అయితే ఆ నీటి బుగ్గ వచ్చి మనలో ఉంటాడు గనుక దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు, వాడు మళ్ళీ దప్పిగొనడు అంటాడు.
- 🕊️ పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వం: నేను ఇచ్చే నీళ్ళు దప్పిగొన్నవాడు రావాలి, నేను ఇచ్చే నీళ్లు తాగాలి. అవి నిత్యజీవాన్ని కలిగించే జీవజలాలు నేను ఇస్తాను. త్రాగిన తర్వాత అది మామూలు నీళ్లు కాదు, త్రియేక దేవునిలోని ఒక వ్యక్తిత్వమే. సృష్టికర్త అయిన దేవుడే, అగాధ జలముల మీద ఆదికాండంలో అల్లాడిన ఆయనే వస్తాడు. కాబట్టి మనం తాగే నీళ్లు ఎగిరిపోతాయి దేహం నుంచి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈయన ఎక్కడికీ పోడు. మనం ఒకసారి తాగేస్తే లోపల ఉంటాడు.
- ⚡ నిరంతర శక్తి: ఆయన అనంతుడు గనుక ఆయన యొక్క ఎనర్జీ (Energy) ఎప్పటికీ అయిపోదు, ఎగ్జాస్ట్ (Exhaust) కాదు. గనుక ఇప్పుడు ఇవాళ దాహం వేసి తాగాము, మళ్ళీ రేపు దాహం వేసింది. దాహం వేసినప్పుడు మళ్ళీ యేసు దగ్గరికి వెళ్లి మళ్ళీ కొత్తగా ఆత్మను పొందాల్సిన అవసరం లేదు. నీవు ఆల్రెడీ పొందేసిన పరిశుద్ధాత్మ దేవుడే నీలోనే ఒక స్ప్రింగ్ (Spring) లాగా, ఒక నీటి బుగ్గ లాగా ఉంటాడు. గనుక నీకు దాహం వేసినప్పుడు నీవు ఆయన్ని మళ్ళీ ఆత్మను ఇమ్మని అడగనక్కర్లేదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీకు మళ్ళీ దాహం తీరుస్తాడు, గనుక వాడు ఎన్నటికీ దప్పిగొనడు అన్నాడు.
- ✨ అభిషేకము: ముందు దాహం అయింది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందకముందు దాహం వేసింది, యేసు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్లి పరిశుద్ధాత్మను పొందినాక మళ్ళీ ఎవ్రీ డే (Every day) పోయి మళ్ళీ పొందనక్కర్లేదు. పరిశుద్ధాత్మ అభిషేకము – వన్స్ ఫర్ ఏ లైఫ్ టైమ్ క్రైసిస్ ఎక్స్‌పీరియన్స్ (Once for a lifetime crisis experience) అన్నమాట. రక్షణ, మారుమనసు, నీటి బాప్తిస్మం ఎలాగో.. మరి పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడడం. తర్వాత సెవరల్ అనాయింటింగ్స్ (Several anointings) వస్తాయి కానీ, ఒరిజినల్ గా పొందినటువంటి ఆ అభిషేకమే మనలో ఉండి మళ్ళీ రిపీట్ అవుతుంది.
- 🛡️ ముగింపు: కానీ ఫస్ట్ టైమ్ (First time) పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండానే విశ్వాసులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పరలోకానికి వస్తారు, నరకానికి ఏం పోరు కానీ శక్తిహీనంగా జీవిస్తారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుదురు అంటే, రాకముందు శక్తి పొందరు అన్నమాట. వెరీ సింపుల్. అందుచేత నీటి బుగ్గ అనేది ఈ విశ్వాసి కాదు, అతడు పొందిన అతనిలో ఉన్న ఆత్మ దేవుడే నీటి బుగ్గ. దట్ ఈజ్ ది ఇంటర్ప్రెటేషన్ (That is the interpretation).
Detailed English Translation:
💧 Question: In John 4:14, Jesus says the water He gives becomes a “well of water springing up into everlasting life” within the person. How can a believer become this well? What is the difference between Christ and the believer in this context?
- The Believer is the Vessel, not the Source: Jesus did not say the believer becomes the well; He said the water He gives becomes a well within the believer. The ‘well’ is a metaphor for the Holy Spirit. Once the Holy Spirit enters a person, the Source of eternal life is stationed within them.
- The Eternal Nature of the Spirit: Physical water is consumed and leaves the body, leading to repeated thirst. But the Holy Spirit is the third person of the Trinity—the same Spirit that moved over the deep in Genesis. He is infinite. His energy is never exhausted.
- Internalized Grace: Before receiving the baptism of the Holy Spirit, a person is ‘thirsty’ and must go to Jesus to receive. But once the Spirit is received, that person doesn’t need to ask for the Spirit anew every day. The ‘well’ is already inside. The believer can draw from this internal spring whenever they feel spiritually dry.
- The Power of Anointing: Receiving the Holy Spirit is a foundational, life-altering crisis experience. While there are many subsequent ‘fillings’ or ‘anointings,’ the initial reception establishes the Spirit’s permanent residence. Those who believe but are not yet anointed by the Spirit will still go to Heaven, but they live a life lacking spiritual power. The ‘well’ mentioned here is the Divine Person of the Holy Spirit living and acting within the human spirit.
