37. ప్రశ్న: దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదియునైన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించాడు ఎందుకు? ఆ పండులో జ్ఞానం ఉన్నదా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: పండులో జ్ఞానం ఉండదు. కానీ అక్కడ విషయం ఏమిటంటే విధేయత అనేదానికి పెట్టిన పరీక్ష అది. అసలు ఇతడు నా మాట వింటాడా? లేదా? అనేది. గనుక అక్కడేంటంటే దేవుడు ఆ రెండు కూడా సాదృశ్యరూపకమైనటువంటి చెట్లే. అసలు జీవవృక్షం అంటే అది మామూలు చెట్టు కాదది. ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే వాడు నశింపడు నిత్యజీవం పొందుతాడు అని అన్నాడు. ఆ పండు తింటే అదే ఎఫెక్ట్ వస్తుంది […]
